1. యోవాషు ఎవరి కుమారుడు?
2. యోవాషు తల్లి పేరేమిటి?
3. ఎన్ని సంవత్సరముల ఈడుగలవాడై యోవాషు ఏలనారంభించెను?
4. యాజకుడైన యెహోయాదా యోవాషునకు ఎంతమంది భార్యలను పెండ్లిచేసెను?
5. యెహోయాదా బ్రదికిన దినములన్నియు యోవాషు యెహోవా దృష్టికి ఎలా ప్రవర్తించెను?
6. యెహోవా మందిరమును బాగు చేయవలెనని యోవాషునకు ఏమి పుట్టెను?
7. దేవుని మందిరమును బాగుచేయుటకు యాజకులను,లేవీయులను యోవాషు ఏమిచేసెను?
8. ఎవరి యొద్ద నుండి మందిరమును బాగుచేయుటకు ధనమును యోవాషు సమకూర్చమని ఆజ్ఞ ఇచ్చెను?
9. దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరఉపకరణములను దేనికి ఉపయోగించిరి?
10. ఎవరు నిర్ణయించిన కానుకను సేకరించలేదని యోవాషు యెహోయాదాను అడిగెను?
11. రాజు ఆజ్ఞప్రకారము యెహోయాదా ఒక పెట్టె చేయించి ఎక్కడ పెట్టెను?
12. మోషే ఎక్కడ ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను తేవలెనని జనులకు చాటించిరి?
13. అధిపతులు, జనులందరు ఎలా కానుకలను తీసుకొని వచ్చి పెట్టెలో వేసిరి?
14. ఎవరు కానుకల పెట్టెను రాజు విమర్శస్థలమునకు తెచ్చుచుండిరి?
15. ఎంత ధనము సమకూడినపుడు ప్రధానమంత్రి,పైవిచారణకర్తలు దానిని తీసెడివారు?
Result:
0 out of 15