Telugu bible quiz questions and answers from Psalms

1➤ కీర్తనల పుస్తకంలో ఎన్ని విభజనలున్నాయి?

=> ఐదు

2➤ కీర్తనల పుస్తకంలో 'సెలా' అనే పదం ఎన్నిసార్లు వాడబడింది?

=> 71 సార్లు

3➤ 'సెలా' పదాన్ని మొదటిసారి ఏ కీర్తన వాడింది?

=> 3వ కీర్తన

4➤ నీతిమంతుల మార్గము ఎవరికి తెలుసు?

=> యెహోవా (1:6)

5➤ కేడెముతో కప్పినట్టు దేవుడు ఎవరిని దయతో కప్పుతాడు?

=> నీతిమంతులను (5:12)

6➤ దేవుడు లేడని ఎవరు తమ హృదయాల్లో అనుకొంటారు?

=> బుద్ధిహీనులు (14:1)

7➤ దేవుని మహిమను ఏవి విపరిస్తున్నాయి?

=> ఆకాశములు (19:1)

8➤ బంగారంకంటె, విస్తారమైన మేలిమి బంగారంకంటె కోరదగింది ఏది?

=> దేవుని వాక్యం (19:10)

9➤ దావీదు 22వ కీర్తనను ఏ రాగంలో పాడాడు?

=> అయ్యలెత్ షహరు రాగం

10➤ యెహోవా సన్నిధిని ఎవరు అనుభవిస్తారు?

=> యెహోవాయందు భయభక్తులు గలవారు (25:14)

11➤ ఎవరి ఆలోచనను యెహోవా వ్యక్తపరుస్తాడు?

=> అన్యజనముల ఆలోచన (33:10)

12➤ భక్తిహీనులను సంహరించేదేమిటి?

=> చెడుతనం (34:21)

13➤ కరువు దినాల్లో తృప్తి పొందేది ఎవరు?

=> నీతిమంతులు (37:18, 19)

14➤ ఒకే రకంగా ఉన్న రెండు కీర్తనలు ఏవి?

=> 14,53 కీర్తనలు

15➤ 'యోనతేలెమ్ రెహూకీము' అనే రాగంమీద పాడబడిన కీర్తన ఏది?

=> 56వ కీర్తన

16➤ నీతిమంతులు సంతోషించేలా చేసేదేమిటి?

=> దైవిక ప్రతిదండన (58:10)

17➤ దేవుడు తన చెప్పును ఎక్కడ విసిరివేస్తాడు?

=> ఏదోముమీద (60:8)

18➤ అనేక శిఖరాలుగల పర్వతం ఏది?

=> బాషాను పర్వతం (68:15)

19➤ దుర్మార్గులకు కంఠహారం ఏమిటి?

=> గర్వం (73:6)

20➤ బలిపీఠం వద్దనే తన పిల్లలకు గూటి స్థలాన్ని కనుగొన్న పక్షి ఏది?

=> పిచ్చుక (84:3)

21➤ కలిసియుండే రెండు దైవిక లక్షణాలేమిటి?

=> కృపాసత్యములు (85:10)

22➤ శుభకరమైన ఆనవాలుకోసం ఎవరు ప్రార్థించారు?

=> దావీదు (86:17)

23➤ ఏ కీర్తనను మోషే వ్రాశాడు?

=> 90వ కీర్తన

24➤ ఖర్జూర చెట్టువలె అభివృద్ధి చెందేది ఎవరు?

=> నీతిమంతులు (92:12)

25➤ ఏ పక్షి అడవిలో జీవించడానికే ఇష్టపడుతుంది?

=> గూడబాతు (102:6)

26➤ దేవుడు దేనితో తనను కప్పుకొన్నాడు?

=> వెలుగు (104:2)

27➤ సరళ చెట్టుపై నివాసం చేసే పక్షి ఏది?

=> కొంగ (104:17)

28➤ సముద్రంలో ఆటలాడటానికి దేవుడు సృష్టించిన పెద్ద సముద్ర జంతువు ఏది?

=> మకరం (104:26)

29➤ అక్షర క్రమ పద్ధతిలో వ్రాయబడిన కీర్తన ఏది?

=> 119వ కీర్తన

30➤ దేవుని వాక్య మహిమను ఏ కీర్తన వివరిస్తుంది?

=> 119వ కీర్తన

31➤ అతి చిన్న కీర్తన ఏది?

=> 117వ కీర్తన

32➤ కీర్తన పుస్తకంలో ఎక్కువ భాగాన్ని వ్రాసిందెవరు?

=> దావీదు (73 కీర్తనలు)

33➤ సొలొమోను వ్రాసిన కీర్తనలు ఏవి?

=> 72, 127 కీర్తనలు