జాగ్రత అనే అంశాము పై తెలుగు బైబిల్ క్విజ్ -2 || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu

1/15
విశ్వాసములేని ఏది ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని "జాగ్రత్త"గా చూచుకొనవలెను?
A జాలి హృదయము
B దుష్ట హృదయము
C నీతి హృదయము
D ప్రేమ హృదయము
2/15
దేనికొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో "జాగ్రత్త" గలవారై యుండవలెను?
A విశ్రాంతి దినము
B ప్రతిష్ఠ దినము
C ప్రవచించు దినము
D దేవుని దినపు రాకడ
3/15
ఇక కొంతకాలమునకు ఎవరి స్థలమును "జాగ్రత్త"గా పరిశీలించినను వారు కనబడకపోవుదురు?
A భక్తిహీనులు
B విశ్వాసులు
C పరిశుద్ధులు
D నీతిమంతులు
4/15
దేవుడు - అంతమువరకు నా క్రియలు "జాగ్రత్త"గా చేయువానికి ఎవరిమీద అధికారము ఇచ్చెదను?
A రాజ్యముమీద
B దాసులమీద
C జనులమీద
D మంత్రులమీద
5/15
కీడుచేయుట మాని,మేలుచేయ నేర్చుకొని దేనిని"జాగ్రత్త"గా విచారించవలెను?
A వర్తమానమును
B వివాదమును
C న్యాయమును
D వ్యాపారమును
6/15
నీవు "జాగ్రత్త"పడునట్లు దివారాత్రము ధర్మశాస్త్రమును ధ్యానించినయెడల దేనిని వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు?
A దుష్క్రియను
B ధనభోగమును
C ఐశ్వర్యమును
D మార్గమును
7/15
నీ దేవుడైన యెహోవా మాటను "జాగ్రత్త"గా వినినయెడల మీలోఎవరు ఉండనే ఉండరు?
A ఘనులు
B బీదలు
C వైరులు
D దుష్టులు
8/15
యెహోవా దూత ఎవరికి ప్రత్యక్షమై నీవు "జాగ్రత్త"గా ఉండి, ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకుండుము అని ఆజ్ఞాపించెను?
A హెబెరు భార్య
B మానోహ భార్య
C కయీను భార్య
D గిలాదు భార్య
9/15
నేను వచ్చువరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును "జాగ్రత్త"గా ఉండుమని పౌలు ఎవరిని హెచ్చరించెను?
A ఫిలేమోను
B అప్పియ
C అప్పు
D తిమోతి
10/15
"నా నాలుకతో పాపముచేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును" ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ తెలుపండి?
A కీర్తనల గ్రంథము 39:6
B కీర్తనల గ్రంథము 39:9
C కీర్తనల గ్రంథము 39:8
D కీర్తనల గ్రంథము 39:1
11/15
నీవు నిబ్బరముగలిగి "జాగ్రత్త" పడి బహు ధైర్యముగానుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెనని దేవుడు ఎవరికి ఆజ్ఞాపించెను?
A దానియేలు
B యోహాషువా
C అహరోను
D సమూయేలు
12/15
మోసకరమైన దేనిచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమోనని "జాగ్రత్తగా" ఉండుడి?
A పరిపూర్ణజ్ఞానముచేత
B ప్రజ్ఞావివేక జ్ఞానములుచేత
C సమయోచిత జ్ఞానముచేత
D నిరర్థక తత్వజ్ఞానముచేత
13/15
అబద్ధ ప్రవక్తలను గూర్చి "జాగ్రత్తపడుడి, వారు గొట్టెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు------------?
A క్రూరమైన తోడేళ్లు
B క్రూరమైన సింహము
C క్రూరమైన ఖడ్గము
D క్రూరమైన మృగము
14/15
యౌవనస్థులు దేనిని "జాగ్రత్త"గా చూచుకొనుట చేతనే తమ నడత శుద్ధిపరచు కొందురు?
A వాగ్దానమును
B విశ్వాసమును
C వాక్యమును
D వినయమును
15/15
అజ్ఞానులవలె కాక, ఎవరివలె నడుచుకొనునట్లు "జాగ్రత్త"గా చూచుకొనుడి?
A మూర్ఖులవలె
B జ్ఞానులవలె
C క్రూరులవలె
D యోగ్యులవలె
Result: