Telugu Bible Quiz ➤ అపొస్తలుడైన పౌలు స్నేహితులు పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1. "సౌలా, సహోదరుడా" అని పౌలును సంబోధించిన మనుష్యుడు ఎవరు? అతడు ఏ పట్టణములో నివసించాడు?


Q ➤ 2. "అతడు పరిశుద్ధాత్మతోను, విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు" - అని ఎవరిని గూర్చి చెప్పబడింది?


Q ➤ 3. పౌలుయొక్క రెండవ సేవాప్రయాణమున అతనితో కలిసి పర్యటించినవాడు ఎవరు?


Q ➤ 4. పౌలు ఒక వ్యక్తిని లుస్త్రలో కనుగొన్నాడు. ఎవరా వ్యక్తి?


Q ➤ 5. పౌలు ఫిలిప్పియలో ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించాడు. ఎవరతడు?


Q ➤ 6. పౌలు ఒక యూదుని కొరింథులో కలుసుకొన్నాడు. ఎవరా యూదుడు?


Q ➤ 7. కొరింథులో తనతో ఉన్న ఆ మనుష్యుని భార్య పేరేమిటి?


Q ➤ 8. "అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడునై యుండెను" అని ఎవరినిగూర్చి చెప్పబడెను. అతడెక్కడ పుట్టాడు?


Q ➤ 9. "నిజముగా అతడు రోగియై చావునకు సిద్ధమైయుండెనుగాని, దేవుడతనిని కనికరించెను" అని పౌలు తన స్నేహితుడిగూర్చి చెప్పు చున్నాడు - ఎవరా స్నేహితుడు?


Q ➤ 10. "ప్రియుడైన వైద్యుడు" అని పౌలు ఒక వ్యక్తిని సంబోధిస్తున్నాడు. ఎవరా వ్యక్తి?


Q ➤ 11. "అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు" - అని పౌలు ఒక వ్యక్తినిగూర్చి చెప్పాడు. ఎవరతడు?


Q ➤ 12. అపొస్తలుడైన పౌలు పరిచర్యనిమిత్తము క్రేతులో విడిచివచ్చిన పెద్ద ఎవరు?


Q ➤ 13. ఒకే ఒక అధ్యాయముగల పత్రికను అందుకున్న వ్యక్తి ఎవరు?


Q ➤ 14. "నా సంకెళ్ళనుగూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి, కనుగొని, అనేక పర్యాయములు ఆదరించెను” అని పౌలు ఈ స్నేహితునిగూర్చి చెబుతున్నాడు. ఎవరా స్నేహితుడు?


Q ➤ 15. అపొస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రికకు లేఖికుడు ఎవరు?