Telugu bible quiz questions and answers from Esther

1➤ ఎస్తేరు గ్రంథాన్ని వ్రాసింది ఎవరు?

=> మొర్దికై (9:29)

2➤ భారత దేశం (హిందూదేశం) గురించి ఏ పుస్తకం ప్రస్తావించింది?

=> ఎస్తేరు (1:1)

3➤ నూట ఇరవై ఏడు సంస్థానాలను పాలించిందెవరు?

=> అహష్వేరోషు (1:1)

4➤ ఎస్తేరుకు సంరక్షకుడు ఎవరు?

=> మొర్దికై (2:5-7)

5➤ అహష్వేరోషు భార్య ఎవరు?

=> వష్తి (1:9)

6➤ రాజుకు లోబడనందుకు రాణి హోదానుండి ఎవరు తొలగించబడ్డారు?

=> వస్త్రి (1:12-19)

7➤ కోటలో స్త్రీలకు విందును సిద్ధపరచిందెవరు?

=> వష్తి (1:9)

8➤ షూషను కోటలో అధికారియైన నపుంసకుడు ఎవరు?

=> హేగే (2:3)

9➤ 'ఎస్తేరు' పేరుకు అర్థం ఏమిటి?

=> నక్షత్రం (2:7)

10➤ ఎస్తేరుకు గల మరో పేరేమిటి?

=> హదస్సా (2:7)

11➤ షూషను కోటలో ఎస్తేరు ఎవరి పర్యవేక్షణలో ఉంది?

=> హేగే (2:8)

12➤ తనజాతిని, వంశాన్ని బయలుపరచవద్దని ఎస్తేరుకు ఎవరు సలహా ఇచ్చారు?

=> మొరైకై (2:10)

13➤ ఎస్తేరు తండ్రి ఎవరు?

=> అబీహాయిలు (2:15)

14➤ తన సంస్థానాలన్నిటిలో సెలవు దినాన్ని ప్రకటించిన రాజు ఎవరు?

=> అహష్వేరోషు (2:18)

15➤ రాజును హత్య చేయడానికి కుట్ర పన్నిన నపుంసకులైన ద్వారపాలకులు ఎవరు?

=> బిగ్దాను, తెరేషు (2:21)

16➤ మోకాళ్ళూని హామానుకు నమస్కారం చేయని వ్యక్తి ఎవరు?

=> మొరైకై (3:2)

17➤ యూదులకు విరోధంగా చేసిన ఆజ్ఞను రాజు ఉంగరంతో ముద్రించిందెవరు?

=> హామాను (3:12)

18➤ రాజు అనుమతి లేకుండా రాజు కోట ఆవరణంలోకి వెళ్ళిన రాణి ఎవరు?

=> ఎస్తేరు (5:1)

19➤ హామాను భార్య ఎవరు?

=> జెరెషు (5:10)

20➤ 'నేను నశించిన నశించెదను' అని చెప్పిందెవరు?

=> ఎస్తేరు (4:16)

21➤ హామాను ఇంటిని రాజు ఎవరికిచ్చాడు?

=> ఎస్తేరు (8:1)

22➤ ఏ కాలంలో యూదులపట్లున్న భయంవలన అనేకులు యూదా మతాన్ని అవలంభించారు?

=> ఎస్తేరు కాలం (8:17)

23➤ యూదులందరి సంక్షేమంకోసం మాట్లాడుతూ తన ప్రజల మేలుకు పని చేసిందెవరు?

=> మొరైకై (10:3)

24➤ 'దేవుడు' అనే పదాన్ని వాడని బైబిలు పుస్తకం ఏది?

=> ఎస్తేరు