1➤ నిష్కపటమైన విశ్వాసంగల తిమోతి అవ్వ పేరు ఏమిటి?
=> లోయి (1:5)
,
2➤ తిమోతి తల్లి ఎవరు?
=> యునీకే (1:5)
,
3➤ పౌలును తరచు ఆదరించిన కుటుంబం ఏది?
=> ఒనేసిఫోరు కుటుంబం (1:16,17)
,
4➤ 'మంచి సైనికునివలె నాతోకూడ శ్రమను అనుభవించుము' అని ఎవరు ఎవరితో చెప్పారు?
=> తిమోతితో పౌలు చెప్పాడు (2:3)
,
5➤ పౌలుకోసం వెదికి అతడు రోమాకు వచ్చినప్పుడు పౌలును కనుగొన్న వ్యక్తి ఎవరు?
=> ఒనేసిఫోరు (1:17)
,
6➤ ఎవరి బోధ కొరుకు పుండు ప్రాకినట్టు ప్రాకింది?
=> హుమెనైయు, ఫిలేతు (2:17,18)
,
7➤ మోషేను ఎదిరించింది ఎవరు?
=> యన్నే, యంబ్రే (3:8)
,
8➤ 'మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని'. ఇవి ఎవరి మాటలు?
=> పౌలు మాటలు (4:7,8)
,
9➤ ఈ లోకాన్ని ప్రేమించి పౌలును విడిచింది ఎవరు?
=> దేమా (4:10)
,
10➤ ఎవరివద్ద పౌలు తన అంగీని, పుస్తకాన్ని, చర్మపు కాగితాన్ని త్రోయలో ఉంచాడు?
=> కర్పు (4:12,13)
,
11➤ పౌలుకు చాలా కీడుచేసిన కంచరివాడెవరు?
=> అలెక్సంద్రు (4:14)
,
12➤ మిలేతులో రోగియైనందుకు పౌలు ఎవరిని అక్కడ విడిచిపెట్టాడు?
=> త్రోఫిము (4:20)