1➤ యెహెజ్కేలు పుస్తక రచయిత ఎవరు?
,=> యెహెజ్కేలు
2➤ ఆకాశము తెరువబడి దర్శనం చూసిన అనుభవం ఏ ప్రవక్తకు కలిగింది?
,=> యెహెజ్కేలు (1:1)
3➤ యెహెజ్కేలుకు దర్శనం కలిగినప్పుడు అతడు ఎక్కడ ఉన్నాడు?
,=> కెబారు నదీ ప్రదేశం (1:1)
4➤ కెబారు నది ఎక్కడ ఉంది?
,=> కల్దీయుల దేశం (1:3)
5➤ యెహెజ్కేలు తండ్రి ఎవరు?
,=> బూజీ (1:3)
6➤ యెహెజ్కేలు దర్శనంలోని నాలుగు జీవులు ఏ రూపంలో ఉన్నాయి?
,=> మానవ స్వరూపంలో (1:5)
7➤ జీవుల ఆత్మ ఎక్కడ ఉంది?
,=> చక్రంలో (1:20)
8➤ దేవుడు యెహెజ్కేలును ఏమని పిలిచాడు?
,=> నరపుత్రుడా (2:1)
9➤ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది ఎవరు?
,=> ఇశ్రాయేలీయులు (2:3)
10➤ లోపల, బయట రెండు ప్రక్కలా వ్రాయబడిన గ్రంథాన్ని ఎవరు పొందుకొన్నారు?
,=> యెహెజ్కేలు (2:10)
11➤ ఏ ప్రవక్త గ్రంథాన్ని తిన్నాడు?
,=> యెహెజ్కేలు (3:3)
12➤ యెహెజ్కేలు నుదుటిని దేవుడు ఎలా మార్చాడు?
,=> చెకుముకి రాతికంటే కఠినంగా చేశాడు (3:9)
13➤ ఏడు రోజులపాటు ఏమి చెప్పకుండా యెహెజ్కేలు ఎక్కడ కూర్చొన్నాడు?
,=> కేబారునది దగ్గర తేలాబీబు స్థలం (3:15)
14➤ ఏడు రోజులపాటు ఏమి చెప్పకుండా ప్రజల మధ్య కూర్చొన్న ప్రవక్త ఎవరు?
,=> యెహెజ్కేలు (3:15)
15➤ ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించబడిన ప్రవక్త ఎవరు?
,=> యెహెజ్కేలు (3:17)
16➤ పెంకు పలకమీద యెరూషలేము పట్టణ రూపాన్ని గీసిందెవరు?
,=> యెహెజ్కేలు (4:1)
17➤ ఇశ్రాయేలీయులముందు యెహెజ్కేలు పెట్టిన సూచన ఏమిటి?
,=> పెంకు పలక మరియు ఇనుప రేకు (4:1,3)
18➤ ఇనుప రేకును ఇసుప గోడగా పెట్టిందెవరు?
,=> యెహెజ్కేలు (4:3)
19➤ ఎడమ ప్రక్కన పండుకొని ఇశ్రాయేలు దోషాలను మోసిన ప్రవక్త ఎవరు?
,=> యెహెజ్కేలు (4:4)
20➤ దేవునిచేత కట్లతో బంధింపబడిన ప్రవక్త ఎవరు?
,=> యెహెజ్కేలు (4:8)
21➤ ఒక రోజుకు యెహెజ్కేలు ఎంత తినేవాడు?
,=> ఇరవై తులాలు (4:10)
22➤ మనిషి మలాన్ని ఇంధనంగా వాడి రొట్టెలను కాల్చమని దేవుడు ఎవరికి చెప్పాడు?
,=> యెహెజ్కేలు (4:12)
23➤ మంగల కత్తివంటి వాడిగల కత్తితో తలను, గడ్డాన్ని క్షౌరం చేసుకొన్న ప్రవక్త ఎవరు?
,=> యెహెజ్కేలు (5:1)
24➤ తన స్వంత వెంట్రుకలను తూచి భాగాలను చేసినదెవరు?
,=> యెహెజ్కేలు (5:1)
25➤ తన వెంట్రుకలను అగ్నితో కాల్చినదెవరు?
,=> యెహెజ్కేలు (5:2)
26➤ తన వెంట్రుకలను గాలిలో విసిరి కొట్టినదెవరు?
,=> యెహెజ్కేలు (5:2)
27➤ తన వెంట్రుకలను తన చెంగుకు కట్టుకొన్న ప్రవక్త ఎవరు?
,=> యెహెజ్కేలు (5:3)
28➤ ఇశ్రాయేలులో ఏది చిగురించింది?
,=> గర్వం (7:10)
29➤ దర్శనంలో భూమ్యాకాశాలకు మధ్య ఎత్తబడిన ప్రవక్త పేరు చెప్పండి?
,=> యెహెజ్కేలు (8:3)
30➤ ఏ ప్రవక్త గోడకు కన్నం త్రవ్వాడు?
,=> యెహెజ్కేలు (8:8)
31➤ హెబ్రీ నెల పేరు మరియు ఒక దేవత పేరు ఒక్కటే. ఆ పేరేమిటి?
,=> తమ్మూజు (8:14)
32➤ ఏ దేవత గురించి స్త్రీలు ఏడుస్తున్నారు?
,=> తమ్మూజు (8:14)
33➤ తన చేతుల్లోకి నిప్పులను తీసుకొన్నదెవరు?
,=> అవిసెనార బట్టలు ధరించినవాడు (10:2)
34➤ 'ఈ పట్టణం పచనపాత్ర (వంటపాత్ర) అని, మనము మాంసమని' ఎవరు చెప్పారు?
,=> పెలట్యా, అతని మనుష్యులు (11:1, 2)
35➤ యెహెజ్కేలు ప్రవచిస్తుండగా ఎవరు చనిపోయారు?
,=> పెలట్యా (11:13)
36➤ చెరలోనికి వెళ్ళువానివలె తన ప్రయాణాన్ని మొదలు పెట్టినది ఎవరు?
,=> యెహెజ్కేలు (12:4)
37➤ ఇశ్రాయేలుకు సూచనగా దేవుడు నియమించిన ప్రవక్త పేరు ఏమిటి?
,=> యెహెజ్కేలు (12:6)
38➤ ఇశ్రాయేలీయుల సంఖ్యలో లెక్కించబడని వారు ఎవరు?
,=> అబద్ధ ప్రవక్తలు (13:9)
39➤ దేవుని ప్రజల సభకు చెందని వారెవరు?
,=> అబద్ధ ప్రవక్తలు (13:9)
40➤ నీతిచేత తమ ప్రాణములు కాపాడుకొన్న ముగ్గురు వ్యక్తులు ఎవరు?
,=> నోవహు, దానియేలు, యోబు (14:14)
41➤ ఇశ్రాయేలు పుట్టుక మరియు పూర్వీకులు ఎక్కడ?
,=> కనాను (16:3)
42➤ యెరూషలేము తండ్రి ఎవరు?
,=> అమోరీయుడు (16:3)
43➤ యెరూషలేము అక్క ఎవరు?
,=> షోమ్రోను (16:46)
44➤ ఉపమానరీతిగా విప్పుడు కథను చెప్పిన ప్రవక్త ఎవరు?
,=> యెహెజ్కేలు (17:2)
45➤ ఎవరి మరణంలో దేవునికి ఎంతమాత్రం సంతోషంలేదు?
,=> దుష్టుల మరణం (18:23)
46➤ తన చేతులతో చప్పట్లు కొట్టి సమాచారాన్ని ప్రవచించిన ప్రవక్త ఎవరు?
,=> యెహెజ్కేలు (21:14)
47➤ యెరూషలేమువైపు ముఖాన్ని తిప్పుకొని పరిశుద్ధ స్థలానికి వ్యతిరేకంగా ప్రసంగించినది ఎవరు?
,=> యెహెజ్కేలు (21:2)
48➤ తన బాణాలను అటు ఇటు ఆడించి విగ్రహాలను సంప్రదించిన రాజు ఎవరు?
,=> బబులోను రాజు (21:21)
49➤ 'నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీకుండునా?' అని ఎవరు అడిగారు?
,=> దేవుడు (22:14)
50➤ మంటమీద కుండను పెట్టి దానిలో ఎముకలను ఉడకబెట్టినదెవరు?
,=> యెహెజ్కేలు (24:3-5)
51➤ 'నీ భార్య మరణించినప్పుడు నీవు ఏడువవద్దు, కన్నీరు విడువవద్దు' అని దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు?
,=> యెహెజ్కేలు (24:16)
52➤ 'ఉదయమందు జనులకు నేను ప్రకటించితిని, సాయంత్రమున నా భార్య చనిపోయెను'. ఎవరి భార్య చనిపోయింది?
,=> యెహెజ్కేలు (24:18)
53➤ ఒంటెలకు శాలగా చేయాలని దేవుడు ఆశించిన స్థలం ఏది?
,=> రబ్బా పట్టణం (25:5)
54➤ గొర్రెలకు దొడ్డిగా దేవుడు చేసిన స్థలం ఏది?
,=> అమ్మోనీయుల దేశం (25:5)
55➤ సముద్రం మధ్యలో వలను పరిచే స్థలంగా ఏ స్థలం ఉంటుంది?
,=> తూరు (26:5)
56➤ అది కూలునప్పుడు ద్వీపాలను కంపించేది ఏది?
,=> తూరు (26:15)
57➤ సంపూర్ణ సౌందర్యం కలదానినని ఏ ప్రాంతం చెప్పింది?
,=> తూరు పట్టణం (27:3)
58➤ అనేక సముద్ర రేవులమీద వర్తక జనం ఎవరు?
,=> తూరు (27:3)
59➤ 'నేనొక దేవతను. దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై యున్నాను' అని ఎవరు చెప్పారు?
,=> తూరు (28:2)
60➤ తాను మరొకరికంటే జ్ఞానవంతున్ని అని తూరు అధిపతి ఊహించుకొన్నాడు. ఆ మరొకరు ఎవరు?
,=> దానియేలు (28:2)
61➤ ఐగుప్తు రాజైన ఫరోకు ఇవ్వబడిన మరో పేరు ఏమిటి?
,=> పెద్ద మొసలి (29:3)
62➤ ఐగుప్తుకు మూల ప్రాంతం ఏది?
,=> పత్రాసు ప్రాంతం (29:14)
63➤ ఏ దేశంతో బబులోను రాజైన నెబుకద్నెజరు యుద్ధం చేసినా కాని జీతం పొందలేదు?
,=> తూరు (29:18)
64➤ ఐగుప్తు కోట ఏది?
,=> సీను (30:15)
65➤ ఏ ప్రాంతంలో పగలు చీకటిగా మారింది?
,=> తహపనేసు (30:18)
66➤ ఒకే ఒక్కనిగా ఉన్నప్పుడే దేశాన్ని స్వాస్థ్యముగా పొందినది ఎవరు?
,=> అబ్రాము (33:24)
67➤ వారికి వాద్యాన్ని వాయించి, మంచి స్వరంగల గాయకునివలె ఉన్నది ఎవరు?
,=> యెహెజ్కేలు (33:32)
68➤ కాపరులకు వ్యతిరేకంగా ప్రవచించిన ప్రవక్త ఎవరు?
,=> యెహెజ్కేలు (34:2)
69➤ ఏ పర్వతానికి వ్యతిరేకంగా యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించాడు?
,=> శేయీరు పర్వతం (35:2,3)
70➤ ఇశ్రాయేలు పర్వతాలనుగూర్చి ప్రవచించిన ప్రవక్త పేరేమిటి?
,=> యెహెజ్కేలు (36:8)
71➤ ఎండిపోయిన ఎముకలకు ఎవరు ప్రవచించారు?
,=> యెహెజ్కేలు (37:4)
72➤ గాలికి ప్రవచించినదెవరు?
,=> యెహెజ్కేలు (37:9)
73➤ కర్రముక్కమీద యూదాగురించి వ్రాసిన ప్రవక్త ఎవరు?
,=> యెహెజ్కేలు (37:16)
74➤ 'మేఘము కమ్మినట్లు నీవు దేశముమీదికి వచ్చెదవు'. ఎవరు?
,=> యుద్ధ సేనలు (38:9)
75➤ ప్రయాణస్థులు పోవు లోయగా ఏ లోయకు పేరు ఉంది?
,=> హమోనోగు లోయ (39:11)
76➤ గోగు ప్రజలను పాతిపెట్టిందెవరు?
,=> ఇశ్రాయేలు (39:11)
77➤ మృతుల దేహాలు పాతిపెట్టబడిన పట్టణం పేరు ఏమిటి?
,=> హమోనా (39:16)
78➤ మెరుస్తున్న ఇత్తడివంటి మనిషి దర్శనం ఎవరికి కలిగింది?
,=> యెహెజ్కేలు (40:3)
79➤ మందిరంలో ప్రవేశించడానికి దేవుడు వాడిన మార్గం ఏది?
,=> తూర్పు గుమ్మం (44:2)
80➤ లోపటి ఆవరణ గుమ్మంలోకి ప్రవేశించేటప్పుడు యాజకులు ధరించాల్సిన బట్టలేమిటి?
,=> జనుపనార బట్టలు (44:17)
81➤ పవిత్రతకు, అపవిత్రతకు మధ్య తేడాను ప్రజలకు బోధించాల్సింది ఎవరు?
,=> యాజకులు (44:23)
82➤ మందిరంలో ఏ భాగం నుండి నీళ్ళు క్రిందికి రావడం యెహెజ్కేలు చూశాడు?
,=> గడప క్రిందనుండి (47:1)
83➤ మందిరం ఉన్న పట్టణం పేరు ఏమిటి?
,=> యెహోవా ఉండు స్థలం (48:35)
84➤ 'యెహోవా చమ్మా' అనగా అర్థమేమిటి?
=> యెహోవా ఉండు స్థలం (48:35)