Telugu bible quiz questions and answers from Exodus


1➤
నిర్గమకాండంలో ఎన్ని అధ్యాయాలున్నాయి?

=> 40

2➤ ఈ పుస్తకంలో ఎన్ని వచనాలున్నాయి?

=> 1213

3➤ నిర్గమకాండం పుస్తక రచయిత ఎవరు?

=> మోషే (24:4)

4➤ నిర్గమకాండంలో మూల వచనం ఏది?

=> 12:13

5➤ నిర్గమకాండంలో ముఖ్యాంశం ఏమిటి?

=> ఇశ్రాయేలు విడుదల

6➤ హెబ్రీయుల మగ సంతానాన్ని చంపడానికి ఫరో నియమించిన మంత్రసానులు ఎవరు?

=> షిప్రా, పూయా (1:15)

7➤ మోషేని ఎంత కాలం దాచిపెట్టారు?

=> మూడు నెలలు (2:2)

8➤ మోషేను దాచిన పెట్టెను తయారుచేయడానికి వాడిన పదార్థం ఏమిటి?

=> జమ్ము, జిగటమన్ను, కీలు (2:3)

9➤ తన స్వంత బిడ్డకు పాలివ్వడానికి జీతం పొందిన తల్లి ఎవరు?

=> యోకెబెదు (2:9; 6:20)

10➤ 'నీటిలోనుండి ఇతన్ని తీసితిని' అనే అర్థంగల పేరు ఏమిటి?

=> మోషే (2:10)

11➤ ఒక ఐగుప్తీయుణ్ణి చంపిన తరువాత మోషే ఎక్కడికి పారిపోయాడు?

=> మిద్యాను (2:14, 15)

12➤ మోషే కుమారుని పేరు చెప్పండి?

=> గెగ్జము (2:22)

13➤ మోషే భార్య ఎవరు?

=> సిప్పోరా (2:21)

14➤ ఏ పర్వతం దేవుని పర్వతంగా పేర్కొనబడింది?

=> హోరేబు (3:1)

15➤ నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడను అని చెప్పుకొన్న వ్యక్తి ఎవరు?

=> మోషే (4:10)

16➤ 'నేను ఉన్నవాడను అనువాడనై యున్నాను' అని ఎవరు ఎవరితో చెప్పారు?

=> మోషేతో దేవుడు చెప్పాడు (3:14)

17➤ మోషే తన చేతి కర్రను నేలమీద పడేసినప్పుడు అది దేనిగా మారింది?

=> పాము (4:2,3)

18➤ మోషే అన్న ఎవరు?

=> అహరోను (4:14)

19➤ నీవు రక్తసంబంధమైన పెనిమిటి అని చెప్పింది ఎవరు?

=> సిప్పోరా (4:25)

20➤ 'నేను యెహోవాను ఎరుగను' అని చెప్పిందెవరు?

=> ఫరో (5:2)

21➤ అహరోను భార్య ఎవరు?

=> ఎలీషెబ (6:23)

22➤ ఎవరికి దేవునిగా మోషేను దేవుడు చేశాడు?

=> ఫరో (7:1)

23➤ మోషేకు ప్రవక్తగా నియమించబడింది ఎవరు?

=> అహరోను (7:1)

24➤ ఐగుప్తుకు పంపబడిన మొదటి తెగులు ఏమిటి?

=> నీళ్ళను రక్తంగా మార్చడం (7:20)

25➤ ఐగుప్తుకు పంపబడిన రెండవ తెగులు ఏమిటి?

=> కప్పలు (8:2)

26➤ ఐదవ తెగులు ఏమిటి?

=> బాధాకరమైన తెగులు (9:3)

27➤ ఆరవ తెగులు ఏమిటి?

=> బాధాకరమైన వడగండ్లు (9:18)

28➤ పెద్ద వడగండ్లనుండి మినహాయింపబడిన స్థలం ఏది?

=> గోషెను (9:26)

29➤ ఏడవ తెగులు ఏమిటి?

=> మిడుతలు (10:4)

30➤ 'నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువు' అని ఎవరితో ఎవరు చెప్పారు?

=> మోషేతో ఫరో చెప్పాడు (10:28)

31➤ ఇశ్రాయేలు ప్రజలు పస్కాపండుగను ఎప్పుడు ఆచరించాలి?

=> అబిబ్ నెలలో 14వ రోజున (12:6)

32➤ పదవ తెగులు ఏమిటి?

=> తొలి సంతానాన్ని సంహరించడం (12:12)

33➤ హెబ్రీయుల క్యాలెండరులో మొదటి నెలగా పరిగణించబడే నెల ఏది?

=> అబీబు (12:2)

34➤ ఐగుప్తునుండి ఇశ్రాయేలీయులు తమ ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు ఎంతమంది పురుషులున్నారు?

=> ఆరు లక్షలు (12:37)

35➤ ఇశ్రాయేలీయులు తమ ప్రయాణాన్ని మొదలు పెట్టిన స్థలం పేరేమిటి?

=> రామసేసు (12:37)

36➤ కనానుకు ప్రయాణిస్తున్నప్పుడు మోషేతో ఇశ్రాయేలీయులు సణిగిన మొదటి ప్రశ్న ఏమిటి?

=> 'ఐగుప్తులో సమాధులు లేవని యీ యరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా?' (14:11)

37➤ ఇశ్రాయేలీయులు నడుచుకొంటూ వెళ్ళిన సముద్రం ఏది?

=> ఎర్ర సముద్రం (14:16)

38➤ ఇశ్రాయేలీయులకోసం ఐగుప్తీయులతో యుద్ధం చేసిందెవరు?

=> యెహోవా (14:25)

39➤ ఇశ్రాయేలులో మొదటి ప్రవక్తిని ఎవరు?

=> మిర్యాము (15:20)

40➤ మిర్యాము పాట ఏమిటి?

=> విమోచనా గీతం (15:20,21)

41➤ ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత ఇశ్రాయేలీయులు మొదట ఎక్కడికి వెళ్ళారు?

=> షూరు (15:22)

42➤ చేదు నీళ్ళను మధురమైన నీళ్ళుగా మార్చింది ఎక్కడ?

=> మారా (15:23-25)

43➤ ఎన్ని సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయులు మన్నాను తిన్నారు?

=> 40 సంవత్సరాలు (16:35)

44➤ మొదటిసారి ఇశ్రాయేలీయులు మన్నాను తిన్న స్థలం పేరు చెప్పండి?

=> సీను అరణ్యం (16:1-4)

45➤ పన్నెండు నీటి బుగ్గలను, డెబ్బై యీత చెట్లను ప్రజలు ఎక్కడ కనుగొన్నారు?

=> ఏలీము (15:27)

46➤ ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు వారు ఎలాంటి పక్షి మాంసాన్ని పొందుకొన్నారు?

=> పూరేడులు (16:13)

47➤ 'మస్సా' అనగా అర్థం ఏమిటి?

=> శోధన (17:7)

48➤ 'మెరీబా' అనే పదానికి అర్థం ఏమిటి?

=> వాదము (17:7)

49➤ అమాలేకీయులపై యుద్ధంలో గెలవడానికి మోషే చేతులను పైకి ఎత్తి పట్టు కోవడంలో తోడ్పడిన ఇద్దరు వ్యక్తులు ఎవరు?

=> అహరోను, హూరు (17:12)

50➤ బైబిలులో ప్రస్తావించబడిన మొదటి రచయిత ఎవరు?

=> మోషే (17:14)

51➤ హోరేబులో మోషే చేసిన బలిపీఠానికి అతడిచ్చిన పేరు ఏమిటి?

=> యెహోవా నిస్సీ (17:15)

52➤ సీనాయి పర్వతానికి ఉన్న మరో పేరేమిటి?

=> హోరేబు (19:1,2) నిర్గమ 33:1-6; ద్వితీ 4:10

53➤ ప్రజలందరి సమక్షంలో యెహోవా ఏ పర్వతంమీద దిగాడు?

=> సీనాయి పర్వతం (19:16-18)

54➤ ఇశ్రాయేలుకు పది ఆజ్ఞలు ఎక్కడ ఇవ్వబడ్డాయి?

=> సీనాయి (20:1)

55➤ దేవుని ఆజ్ఞలకు లోబడటంవలన ఎన్ని తరాలు దేవుని కరుణను పొందు కొంటారు?

=> వేయి తరాలవరకు (20:6)

56➤ బలిపీఠాన్ని స్తంభాన్ని నిర్మించింది ఎవరు?

=> మోషే (24:4)

57➤ సీనాయి పర్వతంపై దేవునితో మోషే ఎన్ని రోజులు గడిపాడు?

=> 40 రాత్రింబగళ్ళు (24:18)

58➤ ప్రత్యక్ష గుడారంలోని మందసాన్ని తయారుచేయడానికి వాడిన కర్ర ఏమిటి?

=> తుమ్మకర్ర (25:10)

59➤ దీపంలో ఎలాంటి నూనె వాడబడింది?

=> ఒలీవల నూనె (27:20)

60➤ అహరోను భుజాలమీద ఉన్న రత్నాల పేర్లు ఏమిటి?

=> జ్ఞాపకార్ధ రత్నాలు (28:12)

61➤ ఏ రత్నంలో పన్నెండు ఇశ్రాయేలీయుల తెగల పేర్లు వ్రాయబడ్డాయి?

=> లేత పచ్చ రత్నాలు (28:9)

62➤ 'ఊరీము తుమ్మీము' పదానికున్న అర్థం ఏమిటి?

=> వెలుగు, పరిపూర్ణత (28:30)

63➤ యాజకుని పవిత్రత కోసం అర్పించాల్సిన అర్పణ ఏమిటి?

=> అల్లాడింపబడు నైవేద్యము (29:24)

64➤ ప్రత్యక్ష గుడార నిర్మాణం కోసం దేవుడు ఎన్నుకొన్న గోత్రాలు ఏవి?

=> యూదా, దాను (31:2, 6)

65➤ దేవుని స్వహస్తంతో వ్రాయబడి మోషే హస్తాలకు ఏమి ఇవ్వబడ్డాయి?

=> రెండు రాతి పలకలు (31:8)

66➤ 'జ్ఞాన విద్యా వివేకములతో, దేవుని ఆత్మతో నింపబడి ప్రత్యక్ష గుడారంకోసం ఎన్నుకోబడిన' పనివాడు ఎవరు?

=> బెసలేలు (31:2-5)

67➤ పది ఆజ్ఞలు వ్రాయబడిన పలకలకు గల మరో పేరు ఏమిటి?

=> సాక్ష్యార్థపు పలకలు (31:18)

68➤ ఇశ్రాయేలీయులకోసం బంగారంతో పోత పోసిన దూడను చేసిందెవరు?

=> అహరోను (32:4)

69➤ శిబిరంలో యుద్ధ కేకలు వినబడుతున్నాయని మోషేతో చెప్పిందెవరు?

=> యెహోషువ (32:17)

70➤ మోషే పది ఆజ్ఞలుగల పలకలను ఎక్కడ పడవేశాడు?

=> సీనాయి పర్వతం క్రింద (32:19)

71➤ ఇశ్రాయేలు ప్రజలు తమ ఆభరణాలను ఎక్కడ తీసివేశారు?

=> హోరేబు (33:6)

72➤ గుడారంలో నుండి బయటికి రాని సేవకుని పేరేమిటి?

=> యెహోషువ (33:11)

73➤ పది ఆజ్ఞలను రెండోసారి వ్రాయడానికి రెండు పలకలను చెక్కినదెవరు?

=> మోషే (34:1)

74➤ తన ముఖచర్మం ప్రకాశిస్తుందనే సంగతి తెలియనిది ఎవరికి?

=> మోషే (34:29)

75➤ ప్రత్యక్ష గుడార నిర్మాణం కోసం నియమించబడిన ఇద్దరు ప్రజ్ఞావంతులు ఎవరు?

=> బెసలేలు, అహోలీయాబు (36:1)

76➤ దీపవృక్షాన్ని చేయడానికి వాడిన పదార్థం ఏమిటి?

=> మేలిమి బంగారం (37:17)