1➤ ఎన్ని దుప్పట్లు కప్పినా వెచ్చదనం పొందుకోలేని రాజు ఎవరు?
,=> దావీదు (1:1)
2➤ వృద్ధాప్యంలో దావీదుకు సేవ చేసిన షూనే మీయురాలి పేరు ఏమిటి?
,=> అబీషగు (1:3,4)
3➤ వృద్ధాప్యంలో దావీదుకు వ్యతిరేకంగా తిరుగబడిన అతని కుమారుడెవరు?
,=> అదోనియా (1:5
4➤ రాజునవుతానని భావించి రథాలను, గుర్రపు రౌతులను సంపాదించుకొన్న దెవరు?
,=> అదోనియా (1:5)
5➤ సొలొమోను తల్లి ఎవరు?
,=> బలైబ (1:11)
6➤ దావీదుకు వారసుడు ఎవరు?
,=> సొలొమోను (1:30)
7➤ సొలొమోనును రాజుగా అభిషేకించిన యాజకుడు ఎవరు?
,=> సాదోకు (1:32)
8➤ దావీదు పేరుకంటే మరెవరి పేరు ఎక్కువ ఖ్యాతిని సంపాదించుకొంది?
,=> సొలొమోను (1:47)
9➤ తన ప్రాణాలను కాపాడుకోవడానికి బలిపీఠం కొమ్ములను పట్టుకొన్నదెవరు?
,=> అదోనియా (1:50,51)
10➤ యెహోవానుండి రాజ్యం సొలొమోనుకు వచ్చిందని ఏ రాకుమారుడు చెప్పాడు?
,=> అదోనియా (2:15)
11➤ దేవుని మందసాన్ని మోసినందుకు మరణం నుండి తప్పించబడిన యాజకుడు ఎవరు?
,=> అబ్యాతారు (2:26)
12➤ యెహోవా యాజకత్వం నుండి తొలగించబడిన యాజకుడు ఎవరు?
,=> అబ్యాతారు (2:27)
13➤ అబ్యాతారును యాజకత్వంనుండి తొలగించిన రాజు ఎవరు?
,=> సొలొమోను (2:27)
14➤ ఏలీ కుటుంబంనుండి వచ్చిన చివరి యాజకుడు ఎవరు?
,=> అబ్యాతారు (2:27)
15➤ యెహోవా గుడారంలో చావాలని నిర్ణయించుకొన్నదెవరు?
,=> యోవాబు (2:30)
16➤ తన స్వంత ఇంట్లో పాతి పెట్టబడిందెవరు?
,=> యోవాబు (2:33,34)
17➤ అరణ్యంలో ఇంటిని కట్టుకొని అక్కడే నివసించిన సైన్యాధిపతి ఎవరు?
,=> యోవాబు (2:34)
18➤ షిమీకు సరిహద్దుగా ఏ వాగు ఏర్పాటైంది?
,=> ద్రోను వాగు (2:36,37)
19➤ షిమీని ఎవరు చంపారు?
,=> బెనాయా (2:46)
20➤ యెహోవా సొలొమోనుకు ఎక్కడ ప్రత్యక్షమై వరాన్నిచ్చాడు?
,=> గిబియోను (3:5)
21➤ యెహోవాను సొలొమోను అడిగిన వరమేమిటి?
,=> జనులను పాలించడానికి వివేకంగల హృదయం (3:9)
22➤ సొలొమోను కాలంలో సంఘటనలను పొందుపరిచే శాస్త్రి లేఖికుడు ఎవరు?
,=> యెహోషాపాతు (4:3)
23➤ సొలొమోను సైన్యానికి సైన్యాధిపతి ఎవరు?
,=> బెనాయా (4:4)
24➤ సముద్ర దరినున్న ఇసుక రేణువులవలె విశాల హృదయాన్ని కలిగియున్న రాజు ఎవరు?
,=> సొలొమోను (4:29)
25➤ మనుష్యులందరి జ్ఞానంకంటే గొప్ప జ్ఞానాన్ని కలిగియున్నదెవరు?
,=> సొలొమోను (4:30)
26➤ జ్ఞానులందరికంటే జ్ఞానవంతుడు ఎవరు?
,=> సొలొమోను (4:31)
27➤ యెహోవా మందిరాన్ని సొలొమోను ఎప్పుడు నిర్మించాడు?
,=> జీప్ అనే రెండో నెలలో (6:1)
28➤ సొలొమోను నిర్మించిన యెహోవా మందిర పరిమాణం ఎంత?
,=> 60 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు (6:2)
29➤ కెరూబులను తయారుచేయడానికి సొలొమోను వాడిన చెక్క ఏమిటి?
,=> ఒలీవ చెక్క (6:23)
30➤ లెబానోను అరణ్య నగరును కట్టించిందెవరు?
,=> సొలొమోను (7:2)
31➤ ఇత్తడితో పోత పోయబడిన సముద్రాన్ని నిర్మించిందెవరు?
,=> సొలొమోను (7:23)
32➤ ఐగుప్తు రాజైన ఫరో అగ్నితో కాల్చిన ప్రాంతం ఏది?
,=> గెజెరు (9:16)
33➤ వ్యాపారం కోసం ఓడలు నిర్మించిన రాజు పేరేమిటి?
,=> సొలొమోను (9:26)
34➤ ఎక్కడనుండి సొలొమోను ఓడలో బంగారాన్ని తెచ్చాడు?
,=> ఓఫీరు (9:27,28)
35➤ సంగీత వాయిద్యాలను తయారుచేయడానికి సొలొమోను వాడిన చెక్క ఏది?
,=> చందనపు మ్రాను (10:12)
36➤ దంతముతో గొప్ప సింహాసనాన్ని నిర్మించిందెవరు?
,=> సొలొమోను (10:18)
37➤ వెండిని సాధారణ రాళ్ళుగా చేసిన రాజు ఎవరు?
,=> సొలొమోను (10:27)
38➤ ఎక్కడనుండి సొలొమోను రథాలను కొన్నాడు?
,=> ఐగుప్తు (10:29)
39➤ సొలొమోనుకు విరోధిగా దేవుడు ఎవరిని లేపాడు?
,=> హదదు (11:14)
40➤ తాను ధరించిన క్రొత్త వస్త్రాన్ని పన్నెండు ముక్కలుగా చేసిన ప్రవక్త ఎవరు?
,=> అహీయా (11:30)
41➤ చీలిన సొలొమోను రాజ్యంలో ఒక భాగాన్ని ఎవరు పొందుకొన్నారు?
,=> యెరోబాము (11:31)
42➤ సొలొమోను తరువాత అతనికి వారసునిగా రాజైన కుమారుడు ఎవరు?
,=> రెహబాము (11:43)
43➤ 'నా తండ్రి నడుముకంటే నా చిటికెన వ్రేలు పెద్దదిగా ఉండును' అని చెప్పిందెవరు?
,=> రెహబాము (12:6-10)
44➤ పెద్దల సలహాను తిరస్కరించి యవ్వనస్థుల సలహానే తీసుకోవడానికి మొగ్గుచూపిన రాజు ఎవరు?
,=> రెహబాము (12:6-8)
45➤ రెండు బంగారు దూడలను చేయించి ఒకటి బేతెలులో, మరొకటి దానులో పెట్టింది ఎవరు?
,=> యరోబాము (12:27,28)
46➤ ప్రవక్తను బంధించడానికి చేతులు చాచినందుకు అతని చేతులు ఎండిపోయాయి. అతడెవరు?
,=> యరోబాము (13:4)
47➤ మారువేషంలో ప్రవక్తవద్దకు వెళ్ళిన స్త్రీ ఏ రాజు భార్య?
,=> యరోబాము భార్య (14:2)
48➤ పెంట ఊడ్చివేయబడునట్లుగా ఎవరి ఇల్లు నాశనం చేయబడింది?
,=> యరోబాము ఇల్లు (14:10)
49➤ రెహబాము తల్లి పేరు ఏమిటి?
,=> నయమా (14:21)
50➤ యెరూషలేము ఖజానాను మొదట తీసుకెళ్ళింది ఎవరు?
,=> ఐగుప్తు రాజైన షీషకు (14:25,26)
51➤ తన అవ్వను రాణిగారి తల్లి హోదానుండి తొలగించిన రాజు ఎవరు?
,=> ఆసా (15:8-13)
52➤ వృద్ధాప్యంలో పాదాల్లో రోగం వచ్చిన రాజు ఎవరు?
,=> ఆసా (15:23)
53➤ ఇశ్రాయేలు రాజైన నాదాబును చంపింది ఎవరు?
,=> బయెషా (15:27)
54➤ దేవుడు ఎవరిని మట్టిలోనుండి తీసి ఇశ్రాయేలు దేశానికి అధికారిగా చేశాడు?
,=> బయెషా (16:1,2)
55➤ ద్రాక్షారసం త్రాగి మత్తుడైన రాజు పేరు ఏమిటి?
,=> ఏలా (16:9)
56➤ 7 రోజులుమాత్రమే ఇశ్రాయేలును పాలించిందెవరు?
,=> జిబ్స్ (16:15)
57➤ ఏ రాజు తన రాజ భవంతిని తగలబెట్టి చనిపోయాడు?
,=> జిఘీ (16:18)
58➤ తీబ్నీని చంపిన తరువాత ఎవరు ఇశ్రాయేలుకు రాజైనారు?
,=> ఒఖీ (16:22)
59➤ షోమ్రోను కొండను కొని దానిమీద పట్టణాన్ని నిర్మించిన రాజు ఎవరు?
,=> ఒత్రీ (16:23,24)
60➤ ఆహాబు భార్య ఎవరు?
,=> యెజెబెలు (16:31)
61➤ యెహోషువ శపించిన యెరికో పట్టణాన్ని కట్టించిందెవరు?
,=> హీయేలు (16:34)
62➤ శపించబడిన యెరికో పట్టణాన్ని పునర్నిర్మిస్తున్నప్పుడు ఉన్న రాజు ఎవరు?
,=> ఆహాబు (16:34)
63➤ యెరికో పట్టణ పునాదులను వేసినప్పుడు ఎవరు మరణించారు?
,=> అబీరాము (16:34)
64➤ ఏలీయా ప్రవక్త స్వస్థలం ఏది?
,=> గిలాదుకు చెందిన తిస్బీ (17:1)
65➤ ఆహాబు కాలంలో ఉన్న శక్తివంతమైన ప్రవక్త ఎవరు?
,=> ఏలీయా (17:1)
66➤ ఏలీయా పేరుకు అర్థం ఏమిటి?
,=> యెహోవా ప్రభువు (17:1)
67➤ తాను తిరిగి మాట చెప్పేంతవరకు మంచైనను, వర్షమైనను ఉండదని ఎవరు ప్రవచించారు?
,=> ఏలీయా (17:1)
68➤ ఏలీయా ఎక్కడ దాక్కొన్నాడు?
,=> కెరీతు వాగు దగ్గర (17:3)
69➤ ఏ ప్రవక్త కాకులచేత పోషించబడ్డాడు?
,=> ఏలీయా (17:4)
70➤ ఒక విధవరాలిద్వారా దేవుడు ఏలీయాకు ఎక్కడ ఆహారాన్ని అందించాడు?
,=> సారెపతు (17:9)
71➤ చనిపోయిన విధవరాలి కుమారున్ని లేపిన ప్రవక్త ఎవరు?
,=> ఏలీయా (17:22)
72➤ రాజుల కాలంలో ఏ ప్రాంతం గొప్ప కరువుతో క్షీణించింది?
,=> షోమ్రోను (18:2)
73➤ వందమంది ప్రవక్తలను దాచి వారికి అన్న పానీయాలిచ్చిన వ్యక్తి ఎవరు?
,=> ఓబద్యా (18:4)
74➤ పశువులకు గడ్డిని వెదికిన రాజు ఎవరు?
,=> ఆహాబు (18:5,6)
75➤ బదరీ చెట్టు క్రింద కూర్చొని చనిపోవాలని ఆశించిన ప్రవక్త పేరేమిటి?
,=> ఏలీయా (194)
76➤ బయలు ప్రవక్తలను ఏలీయా ఎక్కడికి పిలిచాడు?
,=> కర్మలు పర్వతం (18:19)
77➤ ఏలీయాను బెదిరించిన స్త్రీ ఎవరు?
,=> యెజెబెలు (19:2)
78➤ యెహోవా దూతద్వారా కాల్చబడిన రొట్టెతో పోషించబడిన ప్రవక్త పేరు ఏమిటి?
,=> ఏలీయా (19:5,6)
79➤ హోరేబు పర్వతంవరకు 40 రోజులపాటు నడిచిన ప్రవక్త ఎవరు?
,=> ఏలీయా (19:8)
80➤ యెహోవాముందు దుప్పటితో తన ముఖాన్ని కప్పుకొన్న ప్రవక్త ఎవరు?
,=> ఏలీయా (19:13)
81➤ ఏలీయా తరువాత ప్రవక్తగా అభిషేకించబడినది ఎవరు?
,=> ఎలీషా (19:16)
82➤ ఎలీషా స్వస్థలం ఎక్కడ?
,=> ఆబేల్మె హోలా (19:16)
83➤ ఎలీషా తండ్రి పేరు మీరు చెప్పగలరా?
,=> షాపాతు (19:16)
84➤ పన్నెండు అరకల ఎడ్లతో పొలాన్ని దున్నింది ఎవరు?
,=> ఎలీషా (19:19)
85➤ కాడి ఎడ్లను ప్రజలకు మాంసంగా వండిన ప్రవక్త పేరు ఏమిటి?
,=> ఎలీషా (19:21)
86➤ కూరగాయల తోటకోసం ఆహాబు ఎవరి ద్రాక్షా తోటను అడిగాడు?
,=> నాబోతు (21:2)
87➤ భర్త పేరుతో ఉత్తరాన్ని వ్రాసిన స్త్రీ ఎవరు?
,=> యెజెబెలు (21:8)
88➤ కీడు చేయమని తన భర్తను ప్రేరేపించిన భార్య?
,=> యెజెబెలు (21:25)
89➤ కీడు చేయడానికి తన్నుతాను అమ్ముకొన్న రాజు ఎవరు?
,=> ఆహాబు (21:25)
90➤ తన తండ్రి పిత్రార్జితాన్ని అమ్మనని ఎవరు చెప్పారు?
,=> నాబోతు (21:4)
91➤ ఆహాబుచేత చెరసాలలో వేయబడిన యాజకుడు ఎవరు?
,=> మీకాయా (22:26,27)
92➤ సత్యం చెప్పినందుకు ఎవరిని సిద్కియా ప్రవక్త కొట్టాడు?
,=> మీకాయా (22:24)
93➤ ఆహాబు తరువాత ఇశ్రాయేలుకు ఎవరు రాజైనారు?
,=> అహజ్యా (22:40)
94➤ కష్టమైన అన్నం, నీళ్ళు ఏ ప్రవక్తకు ఇవ్వబడ్డాయి?
,=> మీకాయా (22:27)
95➤ యుద్ధరంగంలో మొర పెట్టిన రాజు ఎవరు?
,=> యెహోషాపాతు (22:32)
96➤ దంతంతో ఇంటిని నిర్మించుకొన్న రాజు ఎవరు?
,=> ఆహాబు (22:39)
97➤ యెఱ్ఱయేలు గోడవద్ద కుక్కలు ఎవరి శరీరాన్ని తిన్నాయి?
,=> యెజెబెలు (21:23)
98➤ రాజు లేనందుకు ఏ దేశం ప్రధానిచేత పాలించబడింది?
,=> ఏదోము దేశం (22:47)
99➤ ఏ రాజు ఓడలు బద్ధలైనాయి?
,=> యెహోషాపాతు (22:48)
100➤ ఎలీషా తండ్రి పేరు?
=> షాపాతు