Q ➤ 1. ప్రభువైన యేసు శోధింపబడిన ప్రదేశము ఏది?
Q ➤ 2. ప్రభువైన యేసు ఒక పట్టణమునుండి వెళ్ళగొట్టబడెను. అది ఏ పట్టణము?
Q ➤ 3. "ఆయన వాక్యము అధికారముతో కూడినదైయుండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి" - అని బైబిలులో వ్రాయబడినది. ఇలా ఆశ్చర్యపడిన ప్రజలు ఏ ప్రదేశమునకు చెందినవారు?
Q ➤ 4. మొదటి పునరుత్థాన దినమున ఇద్దరు మనుష్యులు ఒక గ్రామమునకు వెళ్తూ మాట్లాడుకొన్నారు? అది ఏ గ్రామ మార్గము?
Q ➤ 5. శిష్యులలో ముగ్గురు ఈ ప్రదేశమునకు చెందినవారే. అది ఏ ప్రదేశము?
Q ➤ 6. యేసు తన మొట్టమొదటి సూచక క్రియను జరిగించిన స్థలమేది?
Q ➤ 7. యేసు ఓ శవ యాత్రను ఏ గ్రామ గవిని దగ్గర ఎదుర్కొన్నాడు?
Q ➤ 8. యాకోబు బావికి సమీప పట్టణము ఏది?
Q ➤ 9. మార్త మరియు మరియల స్వగ్రామము ఏది?
Q ➤ 10. “కపాలస్థలము అను చోటు" - ఎక్కడ ఉంది?
Q ➤ 11. శిష్యులలో ఏడుగురు చేపలవేటకు వెళ్ళిన ప్రదేశము ఏది?
Q ➤ 12. "మనుష్యకుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారు?" అని యేసు ఇక్కడ తన శిష్యులను అడిగాడు. ఎక్కడ?
Q ➤ 13. ప్రభువైన యేసు ఈ పట్టణమును గూర్చి విలపించాడు. అది ఏ పట్టణము?
Q ➤ 14. యేసు తన సువార్తసేవను ఏ ప్రదేశమునందు ప్రారంభించాడు?
Q ➤ 15. గెరాసేనుల దేశవాసియైన దయ్యము పట్టిన మనుష్యుడు ప్రభువైన యేసు తనకు చేసిన అద్భుతాన్ని బహిరంగ పర్చింది ఎక్కడ?