Q ➤ 1. “ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని” ఒక రోగి ప్రభువైన యేసును అడిగాడు. ఎవరా రోగి?
Q ➤ 2. ప్రభువైన యేసు సీమోను పేతురుకు దగ్గర బంధువురాలిని స్వస్థపరచాడు. ఆమె పేతురుకు ఏమౌతుంది?
Q ➤ 3. వారు సముద్రములో మునిగిపోతామని భయపడ్డారు. ఎవరు వారు?
Q ➤ 4. కొందరు ఒక రోగిని నలుగురిచేత మోయించుకొని యేసునొద్దకు తీసికొని వచ్చారు. అతనికున్న జబ్బేమిటి?
Q ➤ 5. యేసు ఒక వ్యక్తిని గెరాసేనుల దేశమందు కలుసుకున్నాడు. ఎవరా వ్యక్తి?
Q ➤ 6. ఒక స్త్రీ ప్రభువైన యేసుయొక్క వస్త్రపు చెంగును ముట్టి స్వస్థతనొందినది. ఆమెకున్న రోగమేమిటి? ఎన్ని సంవత్సరములనుండి బాధపడుతున్నది?
Q ➤ 7. యేసు ఇతణ్ణి ఆచారములనుండి వెలుపటికి పిలిచి "నన్ను వెంబడిం చుము" అని చెప్పాడు. ఆ వ్యక్తి పేరేమిటి?
Q ➤ 8. ఆయన శిష్యులు అతణ్ణి స్వస్థపరచలేకపోయారు. ఎవరా వ్యక్తి?
Q ➤ 9. ఇతడు రహదారి ప్రక్కనే కూర్చొని భిక్షమడుగుకొనుచున్నాడు. ఎవరతడు?
Q ➤ 10. యేసును చూచుటకై ఇతడు ఓ చెట్టు ఎక్కాడు. ఇతని పేరేమిటి?
Q ➤ 11. యేసు ఇతనితో “ఎప్ఫతా" (తెరుచుకో) అని చెప్పాడు. ఎవరితో?
Q ➤ 12. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తెగల యొక స్త్రీ తన కుమార్తెను స్వస్థపరచ వలసినదిగా ప్రభువైన యేసుయొద్దకు వచ్చినది. ఎవరా స్త్రీ?
Q ➤ 13. “నీవు నీ రాజ్యముతో వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికో” అని ఇతడు యేసుకు మొర్రపెట్టుకున్నాడు. ఎవరతడు?
Q ➤ 14. సిలోయము అను కోనేటిలో కడుగుకునేందుకు యేసు ఇతణ్ణి పంపించాడు. ఎవరతను?
Q ➤ 15. తాను పునరుత్థానమునొందిన ఏడు దినముల అనంతరము ప్రభువైన యేసు ఈ వ్యక్తికి దర్శనమిచ్చాడు. ఎవరా వ్యక్తి?
Q ➤