1➤ ఈ పుస్తక రచయిత ఎవరు?
,=> పౌలు
2➤ కొరింథీ విశ్వాసులతో పరిశుద్ధంగా, నిష్కాపట్యంతో నడుచుకొన్నదెవరు?
,=> పౌలు (1:12)
3➤ తీతును చూడటానికి పౌలు ఎక్కడికి వెళ్ళాడు?
,=> మాసిదోనియ (1:12, 13)
4➤ రక్షింపబడువారిపట్లను, నశించువారిపట్లను విశ్వాసులు ఏమైయున్నారు?
,=> దేవునికి క్రీస్తు సువాసన (2:15)
5➤ అక్షరం చంపితే ఆత్మ ఏమి ఇస్తాడు?
,=> జీవం (3:6)
6➤ పరిశుద్దాత్మ పరిచర్య ఎలా ఉంది?
,=> మహిమకరంగా (3:9)
7➤ ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏమి ఉంటుంది?
,=> స్వాతంత్ర్యం (3:17)
8➤ క్షణమాత్రముండు చులకని శ్రమ దేన్ని కలుగజేస్తుంది?
,=> నిత్యమైన మహిమను (4:18)
9➤ చేతితో చేయబడని నివాసం ఎక్కడ ఉంది?
,=> పరలోకంలో (5:1)
10➤ దేనిని ధరించాలని మనము ఆపేక్షతో మూల్గుతున్నాము?
,=> పరలోకంనుండి వచ్చే నివాసం (5:2)
11➤ 'క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది' అని ఎవరు చెప్పారు?
,=> పౌలు (5:14)
12➤ ఒక వ్యక్తి నూతన సృష్టిగా ఎప్పుడు మారుతాడు?
,=> అతడు క్రీస్తునందున్నయెడల (5:17)
13➤ దేవునితో మనలను సమాధానపరిచేది ఎవరు?
,=> క్రీస్తు (5:18)
14➤ దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా బ్రతిమాలేది ఎవరు?
,=> క్రీస్తు రాయబారులు (5:20)
15➤ ఎవరితో విశ్వాసులు జోడుగా ఉండవద్దు?
,=> అవిశ్వాసులతో (6:14)
16➤ దేనితో వెలుగుకు పొత్తు లేదు?
,=> చీకటితో (6:14)
17➤ దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంటే, మనం దేన్ని తొలగించాలి?
,=> కల్మషాన్ని (7:1)
18➤ దైవచిత్తానుసారమైన దుఃఖం దేన్ని కలుగజేస్తుంది?
,=> రక్షణ (7:10)
19➤ లోకసంబంధమైన దుఃఖం దేన్ని కలుగజేస్తుంది?
,=> మరణం (7:10)
20➤ పౌలు పత్రికవలన ఏ సంఘం దుఃఖపడింది?
,=> కొరింథీ సంఘం (7:9)
21➤ కొరింథీ సంఘం భయంతో, వణకుతో ఎవరిని చేర్చుకొంది?
,=> తీతు (7:14,15)
22➤ బహుశ్రమలవలన పరీక్షింపబడినప్పటికి ఏ సంఘం దాతృత్వంలో బహుగా విస్తరించింది?
,=> మాసిదోనియ సంఘం (8:1,2)
23➤ ఏ అపొస్తలుడు చందాలను సమీకరించడం మొదలుపెట్టాడు?
,=> తీతు (8:6)
24➤ ఉత్సాహంగా ఇచ్చువానికి దేవుడు ఏమి ఇస్తాడు?
,=> ప్రేమ (9:7)
25➤ ఏ విషయాన్ని బట్టి పౌలు దేవునికి స్తోత్రం చెల్లించాడు?
,=> చెప్పనశక్యం కాని దేవుని వరాన్నిబట్టి (9:15)
26➤ పౌలు పత్రికలు ఎలా ఉన్నాయి?
,=> ఘనంగా, బలీయంగా (10:10)
27➤ ఎవరు యోగ్యుడు?
,=> ప్రభువు మెచ్చుకొనువాడు (10:18)
28➤ కొరింథీ సంఘాన్ని ఒక్కడే పురుషుడైన క్రీస్తుకు ప్రధానం చేసిందెవరు?
,=> పౌలు (11:2)
29➤ పౌలు అపొస్తలుని స్థాయి ఏమిటి?
,=> అతి ప్రాముఖ్యమైన అపొస్తలుడు (11:5)
30➤ తన కుయుక్తితో హవ్వను మోసం చేసిందెవరు?
,=> సర్పం (11:3)
31➤ సాతాను ఏ వేషం ధరించుకొంటాడు?
,=> వెలుగుదూత వేషం (11:14)
32➤ యూదుల చేతిలో పౌలు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు?
,=> ఐదుసార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు (11:23,24)
33➤ ఓడ బ్రద్దలవడంవలన పౌలు ఎన్నిసార్లు శ్రమపడ్డాడు?
,=> మూడుసార్లు (11:25)
34➤ సంఘాలన్నిటిగురించిన చింత ఉన్న అపొస్తలుడు ఎవరు?
,=> పౌలు (11:28)
35➤ దమస్కులో పౌలును బంధించాలని ఆశించిన అధిపతి ఏ రాజు క్రింద ఉన్నాడు?
,=> అరెతే రాజు (11:32)
36➤ మూడవ ఆకాశానికి కొనిపోబడిన మనుష్యుని దర్శనం ఎవరికి కలిగింది?
,=> పౌలు (12:1-3)
37➤ ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందుకు అత్యధికంగా హెచ్చిపోకుండునట్లు ఎవరి శరీరంలో ఒక ముల్లు ఉంచబడింది?
,=> పౌలు (12:7)
38➤ పౌలు అత్యధికంగా హెచ్చిపోకుండునట్లు అతన్ని నలుగగొట్టడానికి ఎవరు నియమించబడ్డారు?
,=> సాతాను దూత (12:7)
39➤ 'నా కృప నీకు చాలును' అని ఎవరు ఎవరితో చెప్పారు?
,=> పౌలుతో క్రీస్తు చెప్పాడు (12:9)
40➤ ఎవరి శక్తి బలహీనతల్లో పరిపూర్ణమైనది?
,=> క్రీస్తు శక్తి (12:9)
41➤ 'మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి' అని ఎవరిని పౌలు హెచ్చరించాడు?
=> కొరింథీ సంఘాన్ని (13:5)