1➤ సమూయేలు పేరుకు అర్థం ఏమిటి?
,=> దేవునిచేత ఆలకించబడినవాడు
2➤ ఎల్కానా భార్యలు ఎవరు?
,=> హన్నా, పెనిన్నా (1:2)
3➤ ఆరాధించడానికి ఎల్కానా ఎక్కడికి వెళ్ళేవాడు?
,=> షిలోహు (1:3)
4➤ బలినర్పించినప్పుడు తన భార్యా పిల్లలకు భాగం ఇచ్చిందెవరు?
,=> ఎల్కానా (1:4)
5➤ బహు దుఃఖంతో దేవునిముందు ప్రార్థించిన స్త్రీ ఎవరు?
,=> హన్నా (1:10)
6➤ “పది మంది కుమాళ్ళకంటే నేను నీకు విశేషమైన వాడను కానా” అని ఎవరు ఎవరితో చెప్పారు?
,=> హన్నాతో ఎల్కానా చెప్పాడు (1:8)
7➤ హన్నా ప్రార్థనకు జవాబుగా దేవుడు ఆమెకిచ్చిన కుమారుడు ఎవరు?
,=> సమూయేలు (1:20)
8➤ యెహోవా దయయందును, మనుష్యుల దయయందును వర్దిల్లుతూ ఎదిగి ందెవరు?
,=> సమూయేలు (2:26)
9➤ దేవునికంటే తన స్వంత కుమారులను ఎక్కువగా ప్రేమించిందెవరు?
,=> ఏలీ (2:29)
10➤ వెనుకకు పడి మెడ విరిగి చనిపోయిన యాజకుడు ఎవరు?
,=> ఏలీ (4:18)
11➤ ఏ పట్టణస్థుల మొరలు ఆకాశానికి వినబడ్డాయి?
,=> ఎక్రోను (5:10-12)
12➤ ఏ మందిరంలో ఫిలిపీయులు దేవుని మందసాన్ని ఉంచారు?
,=> దాగోను మందిరం (5:2)
13➤ యెహోవా మందసాన్ని తెరచి చూచినందుకు ఎవరు చనిపోయారు?
,=> బేతైమెషువారు (6:19)
14➤ ఎవరి ఇంట్లో మందసం పెట్టబడింది?
,=> అబీనాదాబు (7:1)
15➤ యెహోవా మందసాన్ని కాపాడటానికి ప్రతిష్టించబడిన వ్యక్తి ఎవరు?
,=> ఎలియాజరు (7:1)
16➤ మిస్పాకు, షేనుకు మధ్య నిలిపిన రాయిని సమూయేలు ఏమని పిలిచాడు?
,=> ఎబెనెజరు (7:12)
17➤ తాను బ్రదికియున్నంతకాలం ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్న దెవరు?
,=> సమూయేలు (7:15)
18➤ సమూయేలు ఇల్లు ఎక్కడ?
,=> రామా (7:17)
19➤ ఇశ్రాయేలుకు న్యాయాధిపతులుగా ఉన్న తండ్రి, కుమారులు ఎవరు?
,=> సమూయేలు, అతని కుమారులు (8:1)
20➤ ఇశ్రాయేలుకు చివరి న్యాయాధిపతి ఎవరు?
,=> సమూయేలు (7:15-17)
21➤ లంచాలు తీసుకొన్న న్యాయాధిపతులు ఎవరు?
,=> యోవేలు, అబీయా (8:2,3)
22➤ సౌలు ఏ గోత్రానికి చెందినవాడు?
,=> బెన్యామీను (9:1,2)
23➤ సౌలు ఎవరి కుమారుడు?
,=> కీషు (9:3)
24➤ ఇశ్రాయేలీయులలో భుజములు మొదలుకొని పైకి ఇతరులకంటే ఎత్తుగా ఉండి బహు సౌందర్యముగా ఉన్న వ్యక్తి ఎవరు?
,=> సౌలు (9:2)
25➤ ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో అతి చిన్న గోత్రం ఏది?
,=> బెన్యామీను (9:21)
26➤ ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరు?
,=> సౌలు (9:27; 10:1)
27➤ “దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పువరకు నీవు ఇక్కడ నిలిచి యుండుము” అని ఎవరితో ఎవరు చెప్పారు?
,=> సౌలుతో సమూయేలు చెప్పాడు (9:27)
28➤ సౌలును రాజుగా ఏ యాజకుడు అభిషేకించాడు?
,=> సమూయేలు (10:1)
29➤ సౌలును రాజుగా సమూయేలు ఎక్కడ అభిషేకించాడు?
,=> మిస్పా (10:17)
30➤ ఇశ్రాయేలీయులందరి కుడి కండ్లను ఊడదీయడానికి ప్రయత్నించినది ఎవరు?
,=> నాహాషు (11:1,2)
31➤ కాడి ఎడ్లను ముక్కలుచేసి వాటిని ఇశ్రాయేలు దేశమంతా పంపినదెవరు?
,=> సౌలు (11:7)
32➤ ఉరుము, వర్షం కోసం ప్రార్థించిందెవరు?
,=> సమూయేలు (12:18)
33➤ సౌలు కుమారుడెవరు?
,=> యోనాతాను (13:2)
34➤ సమూయేలుకు లోబడకుండా సౌలు ఎక్కడ బలి అర్పించాడు?
,=> గిల్లాలు (13:8,9)
35➤ దానిమ్మ చెట్టు కింద కూర్చొన్న రాజు ఎవరు?
,=> సౌలు (14:2)
36➤ మరణంనుండి ఇశ్రాయేలును తప్పించిన రాకుమారుడు ఎవరు?
,=> యోనాతాను (14:45)
37➤ సౌలు సేనలకు సైన్యాధిపతి ఎవరు?
,=> అబ్నేరు (14:50)
38➤ రాత్రంతా యెహోవాకు మొర పెట్టిన యాజకుడు ఎవరు?
,=> సమూయేలు (15:11)
39➤ సోదె చెప్పుట అనే పాపంతో సమానమైన పాపం ఏది?
,=> తిరుగుబాటు (15:23)
40➤ ఇశ్రాయేలులో ఒక రాజును అభిషేకించినందుకు దేవుడు దుఃఖించాడు. ఆ రాజు ఎవరు?
,=> సౌలు (15:35)
41➤ దావీదు తండ్రి ఎవరు?
,=> యెషయి (16:1)
42➤ దావీదు పేరుకు అర్థం ఏమిటి?
,=> ప్రేమించబడినవాడు
43➤ ఎర్రనివానిగా, చక్కని నేత్రాలుగలవానిగా, చూచుటకు సుందరంగా ఉన్న వ్యక్తి ఎవరు?
,=> దావీదు (16:12)
44➤ దురాత్మతో పట్టబడిన రాజు ఎవరు?
,=> సౌలు (16:14)
45➤ సౌలు దురాత్మతో పట్టబడినప్పుడు ఎవరు సితారాను వాయించారు?
,=> దావీదు (16:23)
46➤ దావీదు గొల్యాతును ఎక్కడ చంపాడు?
,=> ఏలా లోయ (17:2-4)
47➤ గొల్యాతు స్వస్థలం ఏది?
,=> గాతు (17:4)
48➤ రాజుగా మారిన కాపరి పేరేమిటి?
,=> దావీదు (17:15)
49➤ యుద్ధభూమిలో దావీదుపై కోపపడిన దావీదు పెద్దన్న ఎవరు?
,=> ఏలీయాబు (17:28)
50➤ 'నేను కుక్కనా?” అని అడిగిందెవరు?
,=> గొల్యాతు (17:43)
51➤ తన స్వంత ప్రాణంగా యోనాతాను ఎవరిని ప్రేమించాడు?
,=> దావీదు (18:1)
52➤ దావీదును ప్రేమించిన సౌలు కుమార్తె ఎవరు?
,=> మీకాలు (18:20)
53➤ సౌలు ఎక్కడ ప్రవచించాడు?
,=> రామా దగ్గరనున్న నాయోతు (19:23)
54➤ తన వస్త్రాలను తీసివేసి రాత్రింబగళ్ళు ప్రవచించిన రాజు ఎవరు?
,=> సౌలు (19:24)
55➤ 'నిజముగా నాకును మరణమునకును అడుగుమాత్రమున్నది' అని చెప్పిందెవరు?
,=> దావీదు (20:3)
56➤ దావీదుకు ప్రాణ స్నేహితుడు ఎవరు?
,=> యోనాతాను (20:17)
57➤ దావీదు, యోనాతాలు ఒకరినొకరు ముద్దు పెట్టుకొని ఎక్కడ ఏడ్చారు?
,=> ఏబెలు (20:41)
58➤ నోబులో ఉన్న యాజకుడు ఎవరు?
,=> అహీమెలెకు (21:1)
59➤ యాజకులకుమాత్రమే చెందిన ప్రతిష్టితమైన రొట్టెలను తిన్న రాజు ఎవరు?
,=> (దావీదు 21:6)
60➤ సౌలు సేవకుడు ఎవరు?
,=> హాయేగు (21:7)
61➤ ఒక పిచ్చివానివలె దావీదు ఏ రాజు ముందు నటించాడు?
,=> ఆకీషు రాజు (21:13,14)
62➤ ఇబ్బందిగల ప్రజలకు, అప్పులు చేసిన ప్రజలకు, అసంతృప్త ప్రజలకు నాయకుడు ఎవరు?
,=> దావీదు (22:2)
63➤ యెహోవా యాజకులను చంపమని ఆదేశించిన రాజు ఎవరు?
,=> సౌలు (22:9,17)
64➤ యాజకుల పట్టణంగా పేర్కొనబడిన పట్టణమేది?
,=> నోబు (22:19)
65➤ అరణ్యంలోని కొండ స్థలాల్లో జీవించిన రాజు ఎవరు?
,=> దావీదు (23:14)
66➤ ''యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువు' అని ఎవరి గురించి దావీదు అభినం దించాడు?
,=> సౌలు (24:6)
67➤ సుబుద్ధి, అందమైన రూపంగల స్త్రీ ఎవరు?
,=> అబీగయీలు (25:3)
68➤ అతని పేరువలె మూర్ఖుడైన వ్యక్తి ఎవరు?
,=> నాబాలు (25:25)
69➤ దావీదు నివసించడానికి ఆకీషు రాజు అతనికిచ్చిన స్థలం ఏది?
,=> సిక్లగు గ్రామం (27:5, 6)
70➤ దావీదు తనకు సదాకాలం దాసునిగా ఉంటాడని భావించిన రాజు ఎవరు?
,=> ఆకీషు (27:12)
71➤ ఏ పర్వతంవద్ద ఇశ్రాయేలీయులు హతం చేయబడ్డారు?
,=> గిల్బోవ పర్వతం (31:1)
72➤ ఏ రాజు ఆత్మహత్య చేసుకొన్నాడు?
,=> సౌలు (31:4)
73➤ సౌలు, అతని కుమారుడు ఎక్కడ చంపబడ్డారు?
,=> గిల్బోవ పర్వతం (31:8)
74➤ సౌలు మృత దేహం ఎక్కడ తగిలించబడింది?
,=> బేతాను పట్టణగోడ (31:10)
75➤ సౌలు, అతని కుమారుల కోసం ఉపవాసమున్నది ఎవరు?
=> యాబేషు ప్రజలు (31:13)