Telugu bible quiz questions and answers from 2 Samuel

1➤ 'నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది' అని ఎవరితో ఎవరు చెప్పారు?

=> అమాలేకీయునితో దావీదు చెప్పాడు (1:16)

2➤ సౌలు, యోనాతానుల మరణాన్ని గురించి ఎక్కడ ప్రకటించవద్దని దావీదు చెప్పాడు?

=> గాతు (1:20)

3➤ పక్షిరాజుకంటే వడిగలవారు ఎవరు?

=> సౌలు, యోనాతాను (1:23)

4➤ తమ మరణంలో ఒకరినొకరు ఎడబాయని తండ్రి, కుమారుడు ఎవరు?

=> సౌలు, యోనాతాను (1:23)

5➤ ఎక్కడ దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు?

=> హెబ్రోను (2:3, 4)

6➤ సౌలు తరువాత ఇశ్రాయేలు రాజు ఎవరు?

=> ఇషో షెతు (2:9)

7➤ అడవి లేడియంత తేలికగా పరుగెత్తగలవాడు ఎవరు?

=> ఆశాహేలు (2:18)

8➤ అబాలోము పేరుకు అర్థం ఏమిటి?

=> సమాధాన తండ్రి

9➤ దావీదు జ్యేష్ఠ పుత్రుడు ఎవరు?

=> అమ్నోను (3:2)

10➤ సౌలు కాక దావీదుకు మామగా ఉన్న మరో రాజు ఎవరు?

=> తల్మయి (3:3)

11➤ అబాలోము తల్లి ఎవరు?

=> మయకా (3:3)

12➤ వందమంది ఫిలిపీయుల ముందోళ్ళతో దావీదు ఎవరిని పెండ్లి చేసుకొన్నాడు?

=> మీకాలు (3:14)

13➤ అబ్నేరు సమాధివద్ద ఎలుగెత్తి యేడ్చిన రాజు ఎవరు?

=> దావీదు (3:32)

14➤ 'పట్టాభిషేకము నొందినవాడనైనను, నేడు నేను బలహీనుడనైతిని' అని చెప్పిందెవరు?

=> దావీదు (3:39)

15➤ యోనాతాను యొక్క కుంటి కుమారుడు ఎవరు?

=> మెక్లబోషెతు (4:4)

16➤ గోధుమలు తీసుకోవడానికి వచ్చినట్లు నటించి ఇష్బో షెతును చంపిందెవరు?

=> రేకాబు, బయనా (4:5)

17➤ అబ్నేరు సమాధిలో ఎవరి తల సమాధి చేయబడింది?

=> ఇష్బోషెతు (4:12)

18➤ దావీదు ఇశ్రాయేలును ఎన్ని సంవత్సరాలు పాలించాడు?

=> 40 సంవత్సరాలు (5:4)

19➤ ఏ రాజు గుడ్డివారిని, కుంటివారిని ద్వేషించాడు?

=> దావీదు (5:8)

20➤ దావీదు కోసం ఒక నగరి/ఇల్లును కట్టిందెవరు?

=> హీరము (5:11)

21➤ సొలొమోను పేరుకు అర్థం ఏమిటి?

=> సమాధానం

22➤ జల ప్రవాహాలు కొట్టుకొనిపోవునట్లు దావీదు తన శత్రువులను ఎక్కడ ఓడించాడు?

=> బయల్పెరాజీము (5:20)

23➤ ఎద్దులు మోస్తున్న దేవుని మందసం ఎక్కడ తడబడింది?

=> నాకోను కళ్ళెము దగ్గర (6:6)

24➤ చేయిచాచి దేవుని మందసాన్ని పట్టుకొన్నందుకు చనిపోయింది ఎవరు?

=> ఉజ్జా (6: 6,7)

25➤ పట్టణంలోకి దేవుని మందసం వస్తుండగా కిటికీనుండి చూసిందెవరు?

=> మీకాలు (6:16)

26➤ తన హృదయంలో దావీదును అవమానించిందెవరు?

=> మీకాలు (6:16)

27➤ దేవుని మందసంవలన ఎవరి ఇల్లు ఆశీర్వదించబడింది?

=> ఓబేదెదోము (6:12)

28➤ పిల్లలు కనకుండా మరణించిన దావీదు భార్య ఎవరు?

=> మీకాలు (6:22)

29➤ హదదెజరు రాజు గుర్రాల చీలమండ నరాలను తెంచిందెవరు?

=> దావీదు (8:4)

30➤ దావీదు లేఖికుడు ఎవరు?

=> శెరాయా (8:17)

31➤ 'చచ్చిన కుక్కవంటి వాడనైన నాయెడల నీవు దయ చూపుటకు నీ దాసుడగు నేను ఎంతటివాడను?” అని చెప్పిందెవరు?

=> మెఫీబోషెతు (9:6-8)

32➤ రాజు బల్లవద్ద అన్ని వేళలా భోజనం చేసిన రాజ కుమారుడు ఎవరు?

=> మెఫీబోషెతు (9:11)

33➤ దావీదు సేవకులకు సగం గడ్డం గొరిగించి వారిని అవమానించిందెవరు?

=> హానూను (10:4)

34➤ హదదెజరు రాజు సైన్యానికి సైన్యాధిపతి ఎవరు?

=> షోబకు (10:17)

35➤ అమ్మోనీయులను నాశనం చేసిన సైన్యాధిపతి ఎవరు?

=> యోవాబు (11:1)

36➤ బతైబ భర్త ఎవరు?

=> ఊరియా (11:3)

37➤ వ్యభిచార పాపం విషయంలో దావీదును ఒప్పింపజేసింది ఎవరు?

=> నాతాను (12:1)

38➤ 'నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు' అని చెప్పిందెవరు?

=> దావీదు (12:5) ,

39➤ తన కుమారుని కోసం ఉపవాస ప్రార్థన చేసిన రాజు ఎవరు?

=> దావీదు (12:17)

40➤ దావీదు, బత్నైబకు పుట్టినదెవరు?

=> సొలొమోను (12:24)

41➤ సొలొమోనుకున్న మరో పేరేమిటి?

=> యదీద్యా (12:25)

42➤ రోగిగా ఉన్నట్లు నటించిన రాకుమారుడు ఎవరు?

=> అమ్నోను (13:6)

43➤ దావీదు కుమారుల్లో ఎవరు దేవునిచేత ఎక్కువగా ప్రేమించబడ్డారు?

=> సొలొమోను (12:25)

44➤ తన అన్న ముందు పిండిని కలిపి రొట్టెలు చేసిన స్త్రీ ఎవరు?

=> తామారు (13:8,9)

45➤ తన చెల్లెలిని బయటికి పంపించి తలుపు మూసిందెవరు?

=> అమ్నోను (13:17)

46➤ తన తలమీద బూడిద పోసుకొని గట్టిగా ఏడ్చిన స్త్రీ ఎవరు?

=> తామారు (13:19)

47➤ గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళిన రాజకుమారుడు ఎవరు?

=> అబాలోము (13:23)

48➤ విందుకు వెళ్ళకుండా తన కుమారున్ని దీవించిందెవరు?

=> దావీదు (13:25)

49➤ దేవదూతల జ్ఞానమువంటి జ్ఞానము గలవాడు ఎవరు?

=> దావీదు (14:20)

50➤ ఇశ్రాయేలులో అందమైన రూపాన్ని కలిగియున్నందుకు మెచ్చుకోబడిన రాజకుమారుడెవరు?

=> అబాలోము (14:25)

51➤ తన తలవెంట్రుకలు తనకు భారంగా ఉన్నప్పుడే వాటిని కత్తిరించే రాజ కుమారుడు ఎవరు?

=> అబాలోము (14:26)

52➤ యోవాబు పొలాన్ని తగలబెట్టమని ఆదేశించినదెవరు?

=> అబాలోము (14:30)

53➤ ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా మారాలని స్వయంగా ప్రయత్నించిన రాజ కుమారుడెవరు?

=> అబాలోము (15:4)

54➤ ఇశ్రాయేలు ప్రజల హృదయాలను కొల్లగొట్టినదెవరు?

=> అబాలోము (15:6)

55➤ అహీతో పెలు ఏ రాజు మంత్రి?

=> దావీదు (15:12)

56➤ తన స్వస్థలాన్ని వదలి పరదేశిగా ఉండే గిత్తీయుడు ఎవరు?

=> ఇత్తయి (15:19)

57➤ చచ్చినా, బ్రతికినా దావీదుతోనే ఉంటానని దావీదుకు ప్రమాణం చేసిందెవరు?

=> ఇత్తయి (15:21)

58➤ 'దీర్ఘదర్శిగా/ ప్రపక్తగా' దావీదు ఎవరిని పిలిచాడు?

=> సాదోకు (15:27)

59➤ తల కప్పుకొని, చెప్పులు లేకుండా కాలి నడకన వెళ్ళిన రాజు ఎవరు?

=> దావీదు (15:30)

60➤ ఎవరి ఆలోచనను చెడగొట్టమని దావీదు ప్రార్థించాడు?

=> అహీతో పెలు (15:31)

61➤ అహీతో పెలు ఆలోచనను చెడగొట్టిందెవరు?

=> హూఖ్ (15:32,34)

62➤ దావీదు దేవున్ని ఆరాధిస్తుండగా, తన బట్టలు చింపుకొని తలమీద దుమ్ము పోసుకొని దావీదువద్దకు వచ్చినదెవరు?

=> హూణ్ణి (15:32)

63➤ అరణ్యంలో దావీదును దర్శించిన సేవకుడు ఎవరు?

=> సీబా (16:1)

64➤ దావీదును, అతని మనుష్యులను శపించిందెవరు?

=> షిమీ (16:13)

65➤ తన పిల్లలను పోగొట్టుకొన్న ఎలుగుబంటివలె ఎవరు ఉన్నారు?

=> దావీదు (17:8)

66➤ బావిలో దాగిన యాజకుల పేర్లు చెప్పండి?

=> యోనాతాను, అహిమయస్సు (17:17,18)

67➤ తన ఇంటిని చక్కబెట్టుకొని, ఆ తరువాత ఉరి వేసుకొన్నదెవరు?

=> అహీతో పెలు (17:23)

68➤ అబాలోము సైన్యానికి అధిపతి ఎవరు?

=> అమాశా (17:25)

69➤ తన నిమిత్తం సౌమ్యంగా ప్రవర్తించమని దావీదు ఎవరి గురించి చెప్పాడు?

=> అబాలోము (18:5)

70➤ మస్తకి చెట్టుమీద ఎవరి తల వేలాడింది?

=> అబాలోము (18:9)

71➤ 'పాపము చేసినవాడను నేనే ... గొర్రెలవంటి వీరేమి చేసిరి?” అని చెప్పిందెవరు?

=> దావీదు (24:17)

72➤ వెలలేని దానిని దహన బలిగా అర్పించవద్దని నిర్ణయించుకొన్నదెవరు?

=> దావీదు (24:24)