Telugu Bible Quiz on Food items in the bible ➤బైబిలులోని ఆహారపదార్ధములు పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1. ప్రభువైన యేసు పునరుత్థానుడైన తరువాత కాల్చిన ముక్కను ఒకదానిని భుజించాడు. ఏమిటది? కాని


Q ➤ 2."_____________ దానికొరకు మీరేల రూకలిచ్చెదరు” అని ఓ ప్రవక్త తన బోధ వింటున్నవారితో చెప్పాడు. ఏమిటది?


Q ➤ 3. యాయేలు, తన దేశానికి శత్రువైనవాడికి "సర్దారులకు తగిన పాత్ర. ఏ ఆహారమును తెచ్చి ఇచ్చింది?


Q ➤ 4. ఓ బలవంతుడు సింహపు కళేబరములో ఏ పదార్ధమును కనుగొన్నాడు?


Q ➤ 5. ఏలీయాకు కాకులు రొట్టెతోపాటు దేనిని తెచ్చిపెట్టాయి?


Q ➤ 6. ఫరోయొక్క భక్ష్యకారుడు తన స్వప్నమందు ఓ బుట్ట నిండా వేటిని మోస్తున్నాడు?


Q ➤ 7. పరలోకమునుండి వచ్చిన ముగ్గురు అతిథులకు దప్పిక తీర్చుటకై అబ్రాహాము ఏ పానీయాన్ని తెచ్చి ఇచ్చాడు?


Q ➤ 8. మనుష్యులు "పల్లేరు చెట్లలో __________అని ప్రభువైన యేసు ప్రశ్నించాడు? పండ్లను కోయుదురా?"


Q ➤ 9. ఏశావు తన జేష్టత్వపు హక్కును దేనికొరకు అమ్ముకున్నాడు?


Q ➤ 10. ఇద్దరు మనుష్యులు ఏ పండ్ల గెలను మోసుకొని ఇశ్రాయేలీయులు పాళెమునకు తెచ్చారు?


Q ➤ 11. మనుష్యులు ఏ చచ్చు ధాన్యమును అమ్ముతుండగా ఆమోసు ప్రవక్త వారిని గద్దించాడు?


Q ➤ 12. ఇస్సాకు తనకొరకు అడవికి పోయి దేనిని తెమ్మని ఏశావును పంపాడు?


Q ➤ 13. గిద్యోను ఓ దేవదూత నిమిత్తమై ఒక ఆహారపదార్థమును పాత్రలో తెచ్చాడు, కానీ ఆ దేవదూత దానిని క్రింద పోయుమని అతనితో చెప్పాడు. ఏమిటది?


Q ➤ 14. అరణ్యములో ఇశ్రాయేలీయులు ఐగుప్తులోని ఓ పండును గుర్తుచేసు కున్నారు. దాని పేరు తెలుపుము?


Q ➤ 15. దావీదు చెఱపట్టబడిన ఓ ఐగుప్తీయునికి రెండు పండ్ల గెలల్ని ఇచ్చాడు. అవి ఏ పండ్లు?