Telugu bible quiz questions and answers from 2 Kings

1➤ తన మేడగది కిటికీలోనుండి క్రిందపడి రోగియైన రాజు ఎవరు?

=> అహజ్యా (1:2)

2➤ ఆకాశంనుండి అగ్నిని దింపి ఇద్దరు అధిపతులను, మరో వంద మందిని దహించేలా చేసిన ప్రవక్త ఎవరు?

=> ఏలీయా (1:10)

3➤ సుడిగాలితో ఆకాశానికి కొనిపోబడిన ప్రవక్త ఎవరు?

=> ఏలీయా (2:1)

4➤ ఏలియా తన ప్రయాణాన్ని ఎలీషాతో ఎక్కడనుండి మొదలుపెట్టాడు?

=> గిల్గాలు (2:1)

5➤ ఏలీయా ఆత్మలో రెండు పాళ్ళకోసం అడిగిన వక్త ఎవరు?

=> ఎలీషా (2:9)

6➤ చావు లేకుండా పరలోకానికి తీసుకోబడిన రెండవ వ్యక్తి ఎవరు?

=> ఏలీయా (2:11)

7➤ ఏలీయా దుప్పటితో మొర్దాను నదిని ఎవరు చీల్చారు?

=> ఎలీషా (2:14)

8➤ రమ్యమైన పట్టణంగా ఏది పేర్కొనబడింది?

=> యెరికో (2:19)

9➤ యెరికో నీళ్ళలోకి ఉప్పును చల్లి దాన్ని బాగు చేసిన ప్రవక్త ఎవరు?

=> ఎలీషా (2:21)

10➤ 'బోడివాడా' అని ఎగతాళి చేయబడిన ప్రవక్త ఎవరు?

=> ఎలీషా (2:23)

11➤ ఎలీషాను ఎగతాళి చేసినందుకు 42మంది బాలురను ఏవి చంపాయి?

=> రెండు ఆడ ఎలుగుబంట్లు (2:24)

12➤ ఒక లక్ష గొర్రెపిల్లల బొచ్చులను, మరియు ఒక లక్ష గొర్రె పొట్టేళ్ళను మోయాబు రాజైన మేషా ఎవరికి పన్నుగా ఇచ్చేవాడు?

=> ఆహాబు (3:4)

13➤ ఏలీయా చేతులమీద నీరు పోసిన ప్రవక్త ఎవరు?

=> ఎలీషా (3:11)

14➤ ఒక విద్వాంసుడు వీణె వాయిస్తుండగా ప్రవచించిన ప్రవక్త ఎవరు?

=> ఎలీషా (3:15,16)

15➤ ఏదోము అరణ్యాన్ని ఏ ప్రవక్త నీళ్ళతో నింపాడు?

=> ఎలీషా (3:20)

16➤ యుద్ధంలో గెలువడానికి తన కుమారుణ్ణి దహన బలిగా అర్పించిన రాజు ఎవరు?

=> మేషా (3:4,27)

17➤ విధవరాలి ఇంటిని నూనెతో ఎవరు దీవించారు?

=> ఎలీషా (4:7)

18➤ ఎలీషా కోసం మేడ గది కట్టించిందెవరు?

=> షూనేము స్త్రీ (4:10)

19➤ ఎలీషా సేవకుని పేరేమిటి?

=> గెహజీ (4:12)

20➤ 'కుండలో విషమున్నది' అని ఎవరికి సేవకుడు మొర పెట్టాడు?

=> ఎలీషా (4:40)

21➤ సిరియా రాజు సైన్యాధిపతి ఎవరు?

=> నయమాను (5:1)

22➤ ఏ నదిలో స్నానం చేయమని నమయానుతో ఎలీషా చెప్పాడు?

=> యొర్దాను నది (5:10)

23➤ దమస్కు యొక్క ముఖ్య నదులేమిటి?

=> అబానా, ఫర్పరు (5:12)

24➤ సిరియారాజు దృష్టిలో ఘనుడై దయ పొందిన గొప్ప వ్యక్తి ఎవరు?

=> నయమాను (5:1)

25➤ ఇశ్రాయేలునుండి రెండు కంచర గాడిదలు మోయగల మన్నును ఇవ్వమని మనవి చేసిందెవరు?

=> నయమాను (5:17)

26➤ నయమాను కుష్ఠు రోగం ఎవరికి వచ్చింది?

=> గెహజీ (5:27)

27➤ చెట్లను కోయడానికి ప్రవక్త శిష్యులు ఎక్కడికి వెళ్ళారు?

=> యొర్దాను (6:2)

28➤ నీళ్ళలో ఒక కొమ్మను విసిరి నీళ్ళనుండి గొడ్డలిని ఏ ప్రవక్త తీశాడు?

=> ఎలీషా (6:6,7)

29➤ ఎలీషాను పట్టుకోవడానికి సిరియనులు ప్రజలను ఎక్కడికి పంపారు?

=> దోతాను (6:13)

30➤ 'వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువు'మని ఎవరు ప్రార్థించారు?

=> ఎలీషా (6:17)

31➤ దేవునికి ఎలీషా ప్రార్థించినప్పుడు ఎవరు గ్రుడ్డివారైనారు?

=> దండువారు (6:18)

32➤ 'నేటి దినము శుభవర్తమానముగల దినము. మనము ఊరుకొననేల?” అని ఎవరు చెప్పారు?

=> కుష్ఠురోగులు (7:8,9)

33➤ ఎవరిని ఎలీషా తేరిచూచి ఏడ్చాడు?

=> హజాయేలు (8:11)

34➤ ఏక కాలంలో యూదాలో రాజులుగా పాలించిన తండ్రి, కుమారుడు ఎవరు?

=> యెహోషాపాతు, యెహోరాము (8:16)

35➤ తన రథంలోనే ఒరిగి చనిపోయింది ఎవరు?

=> యెహోరాము (9:24)

36➤ తోట ఇల్లు మార్గంలో పారిపోయిన రాజు ఎవరు?

=> అహజ్యా (9:27)

37➤ హత్య చేయబడక ముందు తన కండ్లకు రంగు వేసుకొని తలను అలంకరించు కొన్న రాణి ఎవరు?

=> యెజెబెలు (9:30)

38➤ భూమిలోని పెంటవలె ఏ స్త్రీ మృతదేహం ఉంది?

=> యెజెబెలు (9:34-37)

39➤ బయలు గుడిని పడగొట్టి దాన్ని పెంట యిల్లుగా మార్చిన రాజు ఎవరు?

=> యెహూ (10:27)

40➤ తన వస్త్రాలను చింపుకొని 'ద్రోహం' 'ద్రోహం' అని కేకలు వేసిన స్త్రీ ఎవరు?

=> అతల్యా (11:13, 14)

41➤ ఏడు సంవత్సరాల ప్రాయంలోనే రాజుగా మారిన వ్యక్తి ఎవరు?

=> యోవాషు (11:21)

42➤ యూదాలో పాలించిన ఏకైక రాణి ఎవరు?

=> అతల్యా (11:3)

43➤ మిల్లో ఇంట్లో చంపబడిన రాజు ఎవరు?

=> యోవాషు (12:20)

44➤ యెహోవా అనుగ్రహాన్ని వెదికిన రాజు ఎవరు?

=> యెహోయాహాజు (13:4)

45➤ రోగంతో బాధపడుతూ మరణించిన ప్రవక్త ఎవరు?

=> ఎలీషా (13:14)

46➤ ఎలీషాను చూడటానికి వెళ్ళినప్పుడు కన్నీరు విడిచిన రాజు ఎవరు?

=> యెహోయాషు (13:14)

47➤ రోగంతో మంచంమీద పడియున్న ఎలీషాను దర్శించిన రాజు ఎవరు?

=> యెహోయాషు (13:14)

48➤ 'నా తండ్రీ, నా తండ్రీ, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులును నీవే' అని ఎవరితో ఎవరు చెప్పారు?

=> ఎలీషాతో యెహోయాషు చెప్పాడు (13:14)

49➤ కిటికీగుండా బాణాన్ని వేసిన రాజు ఎవరు?

=> యెహోయాషు (13:16, 17)

50➤ బాణాలను నేలకు కొట్టినదెవరు?

=> యెహోయాషు (13:18)

51➤ ఎవరి ఎముకలు శవానికి తగిలినప్పుడు దానికి జీవం వచ్చింది?

=> ఎలీషా (13:21)

52➤ యెరూషలేము ప్రాకారాలను కూలగొట్టిన ఇశ్రాయేలు రాజు ఎవరు?

=> యెహోయాషు (14:13)

53➤ యూదారాజైన అమజ్యా ఎక్కడ హత్య చేయబడ్డాడు?

=> లాకీషు పట్టణం (14:19)

54➤ ఏ రాజు కాలంలో యోనా ప్రవక్త జీవించాడు?

=> యెహోయాషు కుమారుడగు యరొబాము (14:24,25)

55➤ మరణంవరకు కుష్టురోగిగా యెహోవాచేత బాధించబడిన రాజు ఎవరు?

=> అజర్యా (15:1,5)

56➤ గర్భిణులందరి గర్భాలను చింపిందెవరు?

=> మెనహేము (15:16)

57➤ ధనవంతులైన ప్రజలనుండి ధనాన్ని ప్రోగుచేసిన రాజు ఎవరు?

=> మెనహేము (15:20)

58➤ అగ్నిలో తన స్వంత కుమారున్ని బలిగా ఏ యూదా రాజు అర్పించాడు?

=> ఆహాజు (16:1-3)

59➤ అష్నూరు రాజుకు పన్ను చెల్లించిన ఇశ్రాయేలు రాజు ఎవరు?

=> హోషేయ (17:3)

60➤ ఏ ఇంటినుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడగొట్టాడు?

=> దావీదు ఇల్లు

61➤ యెహోవాను ఆరాధించనందుకు దేవుడు సింహాలను పంపి ఎవరిని చంపాడు?

=> షోమ్రోను పట్టణస్థులను (17:25)

62➤ మోషే చేసిన ఇత్తడి స్పరం పేరు ఏమిటి?

=> నెహుస్థానము (18:4,5)

63➤ మోషే తయారుచేసిన ఇత్తడి సర్పాన్ని ముక్కలుగా విరగొట్టింది ఎవరు?

=> హిజ్కియా (18:1-4)

64➤ తన బట్టలను చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరానికి వెళ్ళిన రాజు ఎవరు?

=> హిజ్కియా (19:1)

65➤ హిజ్కియా కాలంలో జీవించిన ప్రవక్త ఎవరు?

=> యెషయా (19:1,2)

66➤ “ఈ దినము శ్రమయు, శిక్షయు, దూషణయు గల దినం” అని చెప్పిందెవరు?

=> హిజ్కియా (19:3)

67➤ తన దేవత గుళ్ళో ఆరాధిస్తున్నప్పుడు చంపబడిన రాజు ఎవరు?

=> అషూరు రాజైన సనెరీబు (19:36,37)

68➤ తన పిల్లల చేతిలో హతమైన రాజు ఎవరు?

=> అషూరు రాజైన సనెరీబు (19:37)

69➤ ఏ రాజు జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్షు పొడిగించబడింది?

=> హిజ్కియా (20:4-6)

70➤ ఎవరి గడియారపు పలకమీద నీడ 10 మెట్లు వెనక్కి వెళ్ళింది?

=> ఆహాజు (20:11)

71➤ కొలను తవ్వి, కాలువ వేయించి పట్టణంలోకి నీళ్ళను రప్పించిన రాజు ఎవరు?

=> హిజ్కియా (20:20)

72➤ ఎక్కువ కాలం ఇశ్రాయేలును పాలించిన రాజు ఎవరు?

=> మనషే (21:1) (55 సంవత్సరాలు)

73➤ నక్షత్రాలను మొక్కి వాటిని పూజించిన రాజు ఎవరు?

=> మనషే (21:3)

74➤ ఇశ్రాయేలును చెడు మార్గంలో నడిపించిందెవరు?

=> మనషే (21:9)

75➤ తన సేవకుల చేతిలో ఇంట్లోనే హత్యకు గురైన రాజు ఎవరు?

=> ఆమోను (21:23)

76➤ రాజు సముఖంలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివిన శాస్త్రి ఎవరు?

=> మోఫాను (21:10, 12)

77➤ మోషే ధర్మశాస్త్రం ప్రకారం తన పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో యెహోవావైపు తిరిగిన రాజు ఎవరు?

=> యోషీయా (23:25)

78➤ ఫరో రాజు ఎల్యాకీముకు ఇచ్చిన మరో క్రొత్త పేరు ఏమిటి?

=> యెహోయాకీము (23:34)

79➤ ఫరో ఆజ్ఞ ప్రకారం దేశ ప్రజలనుండి వెండిని తీసుకొన్నదెవరు?

=> యెహోయాకీము (23:35)

80➤ ఏ రాజు కండ్ల ముందే అతని కుమారులు చంపబడ్డారు?

=> సిద్కియా (25:7)

81➤ బబులోను రాజు ఏ రాజు కండ్లను ఊడదీశాడు?

=> సిద్కియా (25:7)

82➤ తాను మరణించేంతవరకు బబులోను రాజు బల్లవద్ద భోజనం చేసిన రాజు ఎవరు?

=> యెహోయాకీను (25:29)