"వెంబడించు" అను అంశాము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu bible quiz | Bible Quiz in Telugu

1/15
యేసు - ఎవడైనను నన్ను "వెంబడింప" గోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, దేనిని నెత్తి కొని నన్ను వెంబడింపవలెను?
A తన కిరీటమును
B తన జీవితమును
C తన సిలువను
D తన బాధ్యతను
2/15
నా ప్రాణము నిన్ను అంటి "వెంబడించు" చున్నదని ఎవరు అనెను?
A యోబు
B సమూయేలు
C దావీదు
D యోనాతాను
3/15
యేసు - నన్ను "వెంబడించు" వాడు చీకటిలో నడువక ఏమి కలిగి యుండును?
A జివపు మూట
B జీవపు వెలుగు
C జీవపు డంబము
D జీవపు యూట
4/15
అహంకారము "వెంబడి" ఏమి వచ్చును?
A తిరస్కారము
B అవమానము
C తిరుగుబాటు
D అవిధేయత
5/15
దేనిని జరిగించుటకై సమూహమును "వెంబడించ" వద్దు?
A నీతికార్యము
B దుష్కార్యము
C నరహత్య
D వ్యభిచారము
6/15
ఎవరు యెహోవాను హత్తుకొని, ఆయనను "వెంబడించుట"లో వెనుక తీయలేదు?
A యోవాబు
B అబ్షాలోము
C హిజ్కియా
D అమ్నోను
7/15
ఎవరు సమస్తమును విడిచిపెట్టి, లేచి, యేసును "వెంబడించెను"?
A సౌలు
B లేవీయను ఒక సుంకరి
C తోమా
D యోనా
8/15
యేసు నా "వెంబడి" రండి, నేను మిమ్మును ఎవరిని పట్టుజాలరులనుగా చేతునని శిష్యులతో చెప్పెను?
A మనుష్యులను
B దేవదూతలను
C అధికారులను
D ధనవంతులను
9/15
ఎవరు ఇశ్రాయేలువారి చర్యలను "వెంబడింపక" దేవుని ఆజ్ఞలననుసరించి నడుచుకొనెను?
A మనషె
B యెహోషాపాతు
C బెంహదదు
D ఎలీషాపాతు
10/15
ఎవరి యెడల యేసు చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను "వెంబడించిరి"?
A శిష్యుల
B బీదల
C రోగుల
D దీనుల
11/15
నీవు ఇతర దేవతలను "వెంబడింప" వలదని ఎవరికి ఆజ్ఞాపించినను అతని హృదయము దేవుని యొద్ద నుండి తొలగిపోయెను?
A యెహోషువా
B సొలొమోను
C యెహోయాదా
D జెరుబ్బాబెలు
12/15
నేను పోయి నా తలిదండ్రులను ముద్దుపెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను "వెంబడించెదనని" ఎవరు ఎవరితో అనెను?
A శిష్యుడు యేసుతో
B ఏలీయా ఎలీషాతో
C సీమోను యాకోబుతో
D ఎలీషా ఏలీయాతో
13/15
నా " వెంబడి" రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దని ఎవరు ఎవరితో అనెను?
A రూతు బోయజు తో
B రూతు నయోమితో
C రూతు ఓర్ఫాతో
D అనయోమి రూతుతో
14/15
మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను "వెంబడించితిమి" గనుక మాకేమి దొరకునని ఎవరు యేసును అడుగెను?
A యాకోబు
B పేతురు
C యోహాను
D తిమోతి
15/15
యేసు - ఏవి నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను "వెంబడించును" ?
A మేకలు
B పొట్టేలు
C గొర్రెలు
D మందలు
Result: