Telugu bible quiz questions and answers from 2 Chronicles

1➤ సొలొమోను మందిరాన్ని ఎక్కడ నిర్మించాడు?

=> మోరీయా పర్వతం (3:1)

2➤ ఎవరి ప్రార్థనవలన మందిరం యెహోవా మహిమతో నిండింది?

=> సొలొమోను (7:1)

3➤ ఏ యూదా రాజు ధైర్యం లేకుండా, శక్తి లేకుండా ఉన్నాడు?

=> రెహబాము (13:7)

4➤ ఏడు వందల ఎద్దులను, ఏడు వేల గొర్రెలను యెహోవాకు బలిగా అర్పించిన దెవరు?

=> ఆసా (15:10,11)

5➤ కొల్లగొట్టిన సొమ్ములోనుండి ఎవరు బలి అర్పించారు?

=> ఆసా (15:11)

6➤ లోకమందంతట సంచారం చేసేదేమిటి?

=> యెహోవా కనుదృష్టి (16:9)

7➤ యెహోవావద్ద విచారణ చేయకుండా తన రోగ విషయంలో వైద్యుల సహాయాన్ని వెదికిన రాజు ఎవరు?

=> ఆసా (16:12)

8➤ యూదాలో కోటలను, సామాగ్రిని నిలువ చేయు పట్టణాలను ఏ రాజు కట్టాడు?

=> యెహోషాపాతు (17:12)

9➤ యెహోవా సన్నిధిలో గడుపుటకు ఉపవాసాన్ని ప్రకటించినదెవరు?

=> యెహోషాపాతు (20:3)

10➤ దేవుని స్నేహితునిగా పేర్కొనబడింది ఎవరు?

=> అబ్రాహాము (20:7)

11➤ తన కడుపులో రోగంవలన చనిపోయినదెవరు?

=> యెహోరాము (21:18, 19)

12➤ తన సేవకుల చేతిలో మంచంలోనే హత్య చేయబడిన రాజు ఎవరు?

=> యోవాషు (24:25)

13➤ దుర్మార్గముగా ప్రవర్తించమని తన కుమారుణ్ణి ప్రోత్సహించిన తల్లి ఎవరు?

=> అతల్యా (22:3)

14➤ అరణ్యంలో దుర్గాలను నిర్మించినదెవరు?

=> ఉజ్జీయా (26:9, 10)

15➤ బలిపీఠం మీద దూపం వేసినందుకు ఎవరి నుదిటిమీద కుష్ఠు రోగం వచ్చింది?

=> ఉజ్జీయా (26:19)

16➤ ఆపత్కాలమందుకూడ మరింత అతిక్రమం చేసిందెవరు?

=> ఆహాజు (28:22)

17➤ యెహోవావలన ఏ పారసీక దేశపు మనస్సు ప్రేరేపించబడింది?

=> కోరేషు (36:22)