Telugu Bible Quiz on Animals in the bible ➤బైబిలులోని జంతువులు

Q ➤ 1. ఒక జంతువు ప్రభువైన యేసుక్రీస్తుకు ఓ పేరును ఆపాదించింది. అది ఏ జంతువు?


Q ➤ 2. పొదలో కొమ్ములు తగులుకొన్నందుచేత దొరికిన జంతువు ఏది?


Q ➤ 3. ఓ ప్రవక్త దీనికడుపులో మూడు రోజులు ఉన్నాడు. దాని పేరు తెలుపుము?


Q ➤ 4. ఈ మృగము తన మచ్చలను మార్చుకొనజాలదు. అది ఏ మృగము?


Q ➤ 5. తనపై ఎక్కి స్వారీచేస్తున్న యజమానునితో మాట్లాడిన జంతువు ఏది?


Q ➤ 6. మృగములలో ఒకటి ఓ బలవంతునికి ఎదురై అతడిపై గర్జించింది; అప్పుడతడు దానిని - "ఒకడు మేకపిల్లను చీల్చునట్లు చీల్చి వేసెను." ఆ మృగము పేరు తెలుపుము?


Q ➤ 7. "ఒకడు సింహము నొద్దనుండి తప్పించుకొనగా__________ యెదురైనట్టు ఆ దినముండును."


Q ➤ 8. ఓ ఐగుప్తు రాజు తన స్వప్నములో పద్నాలుగు జంతువులను చూచాడు. ఏమిటా జంతువులు?


Q ➤ 9. "ఎద్దువలె అది గడ్డి మేయును." ఈ జంతువు పేరు తెలుపుము?


Q ➤ 10. యెహోవా మందసమునందు ఉన్న ఐదు బంగారపు జంతువులు ఏవి?


Q ➤ 11. అరణ్యములో పాపభారము మోసుకొని వెళ్ళే జంతువు ఏది?


Q ➤ 12. "మిద్యాను ఏయిఫా" ప్రాంతాల్లో సర్వసాధారణంగా కనిపించే జంతువులేవి?


Q ➤ 13. ఓ మనుష్యునియొక్క కురుపులు నాకిన జంతువులేవి?


Q ➤ 14. ఇస్సాకుయొక్క పెండ్లి కుమార్తె ఒక జంతువుపై ఎక్కివచ్చింది. ఏమిటది?


Q ➤ 15. ప్రకటన గ్రంథములో నాలుగు విభిన్నమైన రంగులుగల జంతువులు ఏవి?