1➤ ఈ పుస్తక రచయిత ఎవరు?
,=> మీకా
2➤ మీకా పేరుకు అర్థం ఏమిటి?
,=> యెహోవాను పోలినవాడు ఎవరు
3➤ మీకా స్వస్థలం ఏది?
,=> మోరడ్రి (1:1)
4➤ మీకా పరిచర్య చేస్తున్నప్పుడు ఉన్న రాజులు ఎవరు?
,=> యోతాము, ఆహాజు, హిజ్కియా (1:1)
5➤ ఎవరు బయటకు వెళ్ళడానికి సందేహించారు?
,=> జయనాను నివాసులు (1:11)
6➤ యెహోవా మందిరంనుండి యెరూషలేము పట్టణ ద్వారానికి వచ్చిందేమిటి?
,=> కీడు (1:12)
7➤ పోగొట్టుకొన్న మేలుకు బాధపడిందెవరు?
,=> మారోతు ప్రజలు (1:12)
8➤ రథాలకు యుద్ధపు గుర్రాలను కట్టమని దేవుడు ఏ దేశంతో చెప్పాడు?
,=> లాకీషు (1:13)
9➤ ఏ పట్టణానికి బహుమానాలు ఇవ్వబడినవి?
,=> మోరెషెత్తతు (1:13)
10➤ అశ్లీలు అనగా అర్థమేమిటి?
,=> మోసపుచ్చు ఇండ్లు (1:14)
11➤ 'మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు' అని ఎవరు చెప్పారు?
,=> మీకా (2:6)
12➤ అంత్య దినాల్లో పర్వతంమీద ఏమి స్థిరపరచబడుతుంది?
,=> యెహోవా మందిరం (4:1)
13➤ ఎవరికి దేవుని మాటలు క్షేమసాధనములు?
,=> యథార్థముగా ప్రవర్తించువారికి (2:7
14➤ సీయోను కుమార్తెకు బలమైన దుర్గం ఏది?
,=> మందల గోపురం (4:8)
15➤ యేసు జన్మస్థలాన్ని గురించి ప్రవచించిన ప్రవక్త ఎవరు?
,=> మీకా (5:2)
16➤ మీకా ప్రవచనం ప్రకారం యేసు పుట్టుక ఎక్కడ చోటు చేసుకొంటుంది?
,=> బేత్లహేము ఎఫ్రతా (5:2)
17➤ దేవుడు తన ప్రజలనుండి అడిగేదేమిటి?
,=> కనికరం, దీన మనస్సు (6:8)
18➤ ఎవరిముందు తన నోటి ద్వారాలకు కాపుదల పెట్టుకోవాలి?
,=> భార్య (7:5)
19➤ మనిషికి విరోధులు ఎవరు?
=> తన స్వంత ఇంటి సభ్యులే (7:6)