Telugu bible quiz questions and answers from Song of Solomon
పరమగీతముల గ్రంథము యొక్క వివరణ
పరిచయము
పరిశుద్ధ గ్రంధమైన బైబిల్ లో పరమగీతములు 22వ పుస్తకము. సామాన్యులకు అర్థం కాని గ్రంథాలలో ఈ పుస్తకము ఒకటి. బైబిల్ లోని 66 గ్రంథాలలోనూ కొన్ని గ్రంథాలు భాషా, భావము తేలికగా అర్ధము కావు. *హెబ్రీ భాషలో దీనిపేరు SHLR HASHRIM అని, గ్రీకులో ASMA ASMATON అని, లాటిన్ భాషలో CANTICUM అని పిలవబడుతుంది.* *ఈ పేర్లు అన్నిటికి అర్థము ఒక్కటే పాటలకు పాట అని అర్థము.* అంతేకాదు దీనిని సొలోమోను పాట అని, వధూవరుల సంభాషణ పాట అని కూడా అంటారు. పరమగీతము యేసుక్రీస్తు సంఘానికి గల పవిత్ర స్నేహాన్ని వివరించే మృదుమధురమైన సంభాషణ పాట. పరమగీతము అంటే అత్యున్నత గీతము అని అర్థం చేసుకోవాలి, సొలోమోను యవ్వన దశలో అంటే రాజుగా పట్టాభిషేకం పొందడానికి ముందుగా రాసిన గ్రంధం. మానవ వివాహములోని ప్రేమ యొక్క పరిశుద్ధతను గౌరవమును మరియు సంతోషమును చూపించుటకు పరిశుద్ధాత్మ దేవుని చేత వ్రాయబడిన గ్రంథమిది. వరుడు క్రీస్తు ప్రభువు వారు, వధువు సార్వత్రిక సంఘము..
రచయిత లేదా గ్రంధకర్త
సొలోమోను (1:1,5; 3:7,9,11; 8:11-12)
రచనా కాలము
క్రీస్తు పూర్వము 965 వ సంవత్సరంలో రాసి ఉండవచ్చు. (ఇది సొలోమోను యవ్వనదశ)
అంశము
ప్రియమైన, వివాహ సంబంధమైన ప్రేమ
అధ్యాయాలు
8 ఎనిమిది
వచనాలు
116 నూట పదహారు
మూల వాక్యము
(పరమ 7:10) నేను నా ప్రియునిదానను అతడు నాయందు ఆశాబద్ధుడు.
(పరమ 8:6-7) ప్రేమ మరణమంత బలవంతమైనది ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్నిజ్వాలా సమములు అది యెహోవా పుట్టించు జ్వాల నీ హృదయముమీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము.
అగాధసముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు ప్రేమకై యొకడు తన స్వాస్థ్యమంత ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును.
మూలపదము
వివాహ పరిధిలోని సంతోషము, ప్రేమ పరిపక్వత, వధువు సంఘముపై వరుడు క్రీస్తు ప్రేమ.
ముఖ్యమైన మనుషులు
సొలొమోను రాజు, షూలమ్మీతి, షూలమ్మీతి యొక్క సహోదరులు, ఎరుషలేము కుమార్తెలు.
ముఖ్యమైన అధ్యాయము
ఈ గ్రంథం అంతయు ఒకటే పొడవైన కవిత్వము అగుటవలన ముఖ్యమైన అధ్యాయము అంటే దేనిని మనము చెప్పలేము కనుక ఎనిమిది అధ్యాయాలు ముఖ్యమైనవే..
గ్రంథ విభజన
మాటల్లో వెల్లడి అయిన ప్రేమ (1:2-4)
ఆందోళన చెందిన ప్రేమ (1:5-7)
కలయికలోని ప్రేమ (1:9-2:7)
ఎదురు చూచి, ఆహ్వానాన్ని పొందిన ప్రేమ (2:8-3:1)
పరీక్షకు లోనై నిరూపణ అయిన ప్రేమ (3:1-5)
శోభాయమానమైన రీతిలో వ్యక్తపరచిన ప్రేమ (3:6-11)
ప్రియురాలిలో ప్రియుని ఆనందం (4:1-16)
ప్రేమలోని తృప్తి (5:1)
బలహీనపడి బలం తిరిగి పుంజుకున్న ప్రేమ (5:2-8)
ప్రియుణ్ణి ప్రశంసించిన ప్రేమ (5:8-16)
నిబ్బరం గలిగిన ప్రేమ (6:1-3)
ప్రియురాలి సౌందర్యాన్ని పొగిడే ప్రేమ (6:4-12)
ప్రేమను వెల్లడించే సంభాషణ (7:1—8:4)
ప్రేమకున్న బలం (8:6-7)
ప్రేమ ఆలోచనలు (8:8-12)
ప్రేమ అభిలాష (8:13-14)
గ్రంథములోని ప్రత్యేకతలు
. గ్రంథమును మూడు భాగములుగా విభజించవచ్చును
🇦. ప్రేమ యొక్క ప్రారంభం( 1:1-3:5)
🇧. ప్రేమ వివాహము నందు సఫలీకృతమవుట (3:6-5:1)
🇨. ప్రేమ వృద్ధిచెందుట (5:2-8:14)
. భౌగోళిక స్థలాల పేర్లు మరియు వాటికి అర్థాలు ఈ పావురపు పాటలో 15 భౌగోళిక స్థలాలు పేర్కొనబడ్డాయి
🇦. కేదారు - నలుపు (1:5)
🇧.ఐగుప్తు - చీకటి (1:9)
🇨.ఎన్గేది - మేకపిల్ల యూట (1:14)
🇩.షారోను - బయలు (2:1)
🇪.ఎరుషలేము - శాంతి నిలయం (2:7)
🇫.లెబానోను - తెల్లనివి (3:9)
🇬.గిలాదు - కరుకైన (4:1)
🇭.అమాన - చిరత (4:8)
🇮.శేనీరు - కవచము (4:8)
🇯.హెర్మోను - పరిశుద్ధమైనది (4:8)
🇰.తిర్సా - సంతోషదాయకం (6:4)
🇱.హెష్బోను - తెలివి (7:4 )
🇲.దమస్కు (7:4)
🇳.కర్మేలు - తోట లేక వనము (7:5)
🇴.బయలు హామోను - సమూహములకు ప్రభువు (8:11)
. కన్యకను గూర్చిన అభిప్రాయం
షూలమ్మీతి అనే కన్యక ఇశ్శాఖారు గోత్రానికి చెందినది. ఆమె నివాసం షూనేము అనే గ్రామం. రాజైన సొలొమోను పరిపాలనలో ఈ గ్రామాలు అతని స్వాధీనములో ఉండేది. షూలమ్మీతిని ఒకనికి ప్రధానం చేశారు. ఈ కన్యక సోదరులు ఈమెను ద్రాక్ష తోటకి కావాలిగత్తెగా ఉంచారు. సొలోమోను సేవకులలో ఒకడు షూలమ్మీతిని తెచ్చి రాజనగరిలోనున్న స్త్రీల మధ్య ఉంచాడు. ఇది షూనేమీయుల అలవాటు. (1 రాజులు 1:1-4) లో దీనికి ఋజువు కలదు. యాకోబు చనిపోకముందు తన కుమారులు అందరినీ పిలిచి ఒక్కొక్కని భవిష్యత్తును ప్రవచించాడు. "ఇశ్శాఖారు.... భూమి రమ్యమైనదగుట చూచెను. గనుక అతడు మోయుటకు, భుజము వంచుకుని వ్యక్తి చేయు దాసుడగునని" (ఆది 49:14-15)లో ఆశీర్వదించాడు. ఈ కారణాన ఈ గోత్రికులు దాసత్వం చేసేవారు. షూలమ్మీతి దాసి, మనము కూడా దాసులము.పాపానికి బానిసలం. ఆయనే మనలను విమోచించి ఘనపరిచాడు.
. రాజును గూర్చిన వివరణ
దావీదుకు బత్షెబా కనిన కుమారులలో రెండవవాడు. దావీదు పాపాన్ని బట్టి మొదటి బిడ్డను మొత్తగా చనిపోయాడు. ఆమె మరలా కుమారుని కనగా అతనికి సొలోమోను అని పేరు పెట్టాడు (2 సమూ 12:24). దేవుడైతే అతనికి నాతాను ప్రవక్త ద్వారా యదీద్యా అనగా యెహోవాకు ప్రియుడు అని పేరు పెట్టించాడు. కారణం అతని కాలంలో యుద్ధాలు లేవు శత్రువులు లేరు. బత్షెబా ఇతనికి లెమూయేలు అని పేరు పెట్టింది. అంటే యెహోవాకు సమర్పించబడినవాడు అని అర్థం. ప్రజలు అతనికి ప్రసంగి అని పేరు పెట్టారు. నాలుగు నామధేయాలు కలవాడు ఇతడు. గత గ్రంథ పరిచయంలో అతని గొప్పతనం కొంతవరకు అధ్యయనము చేశాము. సింహాసనం ఎక్కేటప్పటికి 20 సంవత్సరాలు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎరుషలేము దేవాలయాన్ని 7 సంవత్సరాలలో, అతని నగరును 13 సంవత్సరాల్లోనూ కట్టించాడు...
గ్రంథములో ఉన్న ఇతర అంశాలు
🇦. పరలోక వరుడు
.వధువులోని లోపాలన్నిటిని అతని ప్రేమ కనిపిస్తుంది (4:7)
.అతడు ఆమెను చూచి హర్షిస్తాడు యెషయా (65:7)
.ఆమె కోసం తన ప్రాణం ఇచ్చాడు (ఎఫెసీ 5:25 )
.ఆమెను తనదిగా చేసుకునేందుకు వస్తాడు (మత్తయి 25:6)
🇧.వధువు
.వరుణ్ని ప్రేమిస్తున్నది (2:16)
.తన అయోగ్యతను గుర్తించినది (1:5)
.శుద్ధురాలై మచ్చలేని దుస్తులు ధరించింది ప్రకటన (19:8)
.దైవ కృప అనే ఆభరణాలు ధరించినది (యెషయా 61:10)
.వివాహానికి ఆహ్వానం పంపిస్తున్నది (ప్రకటన 22:17)
🇨. పెండ్లి విందు
.తన కుమారుడి కోసం తన సిద్ధపరిచాడు (మత్తయి 20:22)
.ఖరీదైన ఏర్పాట్లు జరిగాయి (మత్తయి 22:4)
.దానికి ఆహ్వానము పొందడం గొప్ప గౌరవం (ప్రకటన 19:9)
.ఆహ్వానాన్ని అనేకమంది తిరస్కరించారు (మత్తయి 20:25)
.అన్ని తరగతుల ప్రజలకు ఆహ్వానాలు అందాయి (మత్తయి 22:10)
.పెండ్లి దుస్తులు లేకపోతే పెండ్లిలో స్థానము లేదు (మత్తయి 22:11-13)
గ్రంథములను ప్రస్తుత కాలమునకు అన్వయించుట
.విశ్వాసము మరియు కాముకత్వము
పరమగీతములలోని దేవుని ప్రస్తావన రాలేదు కానీ తెరవెనుక కనిపించేది ఎరుషలేము రాజా భవనం. కాబట్టి ఇశ్రాయేలు దేవుని మీద విశ్వాసం ఉంచుకొనవలెను. సమకాలీన వ్యవస్థలో లైంగిక ఉల్లాసము, ఉత్సాహము, క్రైస్తవ విశ్వాసమునకు సరిపోయింది కాదు. వివాహము అనే హద్దులో అనే దానిని అనుభవించాలి. తగు సమయములో శృంగారపరమైన సంబంధము సంతోషించుటకు దేవుడిచ్చిన ఒక బహుమానం.
.ప్రేమలో పాఠములు
పురాతన పద్యములలో మానవ ప్రేమ విలువలు ఎన్నటికి మారనివి. అందుచేత పరమగీతములు నేటి కాలంలో దాని వివరణ ఎంతో చెప్పవలయును.
.ఓపిక మరియు శక్తి
పరమగీతములలోని ప్రారంభము యవ్వన స్త్రీ చెప్పుచున్నది - ప్రేమ కోరుకున్నంతవరకు లేప వద్దని, కలతపరచవద్దని (పరమ 2:7;3:5;8:4). ప్రేమ తత్సంబంధమును ఇద్దరు ప్రేమికులు దగ్గరై వృద్ధి చేసుకొనుటకు ఒక చిన్న సలహా. ఈ సలహా ఈ పుస్తకం అంతయూ పదేపదే చెప్పబడింది. ప్రేమ సంబంధమైన విషయములయందు ఓపిక కలిగి ఉండాలి. వివాహము ద్వారానే ఈ సంబంధము పెరగాలి. అప్పుడా ప్రేమ స్థిరంగా, బలంగా ఉంటుంది.
.స్వచ్ఛత
ఈ యవ్వన స్త్రీ ఒక తాళం వేసిన ఉద్యానవనము. ఆమె పురుషుడు దానిలోనికి ప్రవేశించుటకు పూర్ణ స్వాతంత్ర్యము కలవానిగా చెప్పబడుచున్నది (పరమ 8:12). హద్దు మీరిన పరిణామములు స్త్రీపురుషులిద్దరికీ సంబంధించినవి.
.దేవుని క్రీస్తు యొక్క ప్రేమ
పరమగీతము మానవ సంబంధము వలె గాక అది దేవునికి, తన ప్రజలకు గల సంబంధమును కూడా చెప్పుచున్నది. పరమగీతములు యూదుల పస్కా పండుగ ప్రారంభ సమయంలో దేవుని ఉద్రేకపూరితమైన ప్రేమకు ఆనవాలుగా, దేవుని నిబంధనకు గుర్తుగా చదవబడును. ఇది నూతన నిబంధనలో వివాహ సంబంధమును గూర్చి చదవబడును (ఎఫేసీ 5:25). అతిశయింపదగిన ప్రపంచము మీద మానవ ప్రేమపై సృష్టికర్త అయిన దేవుని జ్ఞాపకము చేయునది ఉన్నది ఆయనకు గల పరిపూర్ణమైన, మహోన్నతమైన ప్రేమను తెలియజేయునది..
గ్రంథములో ప్రభువైనయేసుక్రీస్తు వారి ప్రస్తావన
(హెబ్రీ 13:4) లో ఇలా వ్రాయబడినది. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వైశ్యసంగులకును, వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. దేవునికి, ఇశ్రాయేలునకు మధ్య ఉన్న సంబంధము మరియు సంఘ వధువునకును వరుడైన క్రీస్తు సంబంధముల ఉపమాలంకారములు అని కూడా అర్ధము చేసుకొనవచ్చును. కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ సంఘము పట్ల ఎలా ఉన్నదో అది భార్య భర్తల సంబంధానికి పరిశుద్ధమైన ప్రేమకు ఉదాహరణలు (2 కొరింధి 11:2) (ఎఫెసీ 5:22-23) (ప్రకటన 19:7-9;21:1,2,9) ఈ గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఆత్మకు ప్రియునిగా ఉన్నాడు.
ముగింపు
ఈ గీతములు దేవుని నిబంధన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఉన్న దేవుని కృపను, క్రైస్తవ సంఘమునకు మరియు ఏసుక్రీస్తుకు మధ్య ఉన్న ప్రేమను బయలుపరచుచున్నది...(పరమ 5:10) నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును.
1➤ పరమగీతం పుస్తక రచయిత ఎవరు?
=> సొలొమోను
,
2➤ ముండ్ల (బలురక్కసి) చెట్ల మధ్యలో ఉండే పువ్వు పేరు ఏమిటి?
=> వల్లి పద్మము (2:2)
,
3➤ అడవి చెట్ల మధ్యలో ఏ చెట్టు ఉంది?
=> జక్టరు చెట్టు (యాప్పిల్ చెట్టు) (2:3)
,
4➤ ప్రియుని ఇంటికి దూలాలు చేయడానికి వాడిన చెట్లు ఏవి?