Telugu Bible Quiz ➤ బైబిలులోని సైనికులు అనే అంశం పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1. "నేటిదినమున పడిపోయినవాడు ఇశ్రాయేలువారిలో ప్రధా నుడు, పెద్దలలో ఒకడై ఉన్నాడు" - అని ఒక వ్యక్తినిగూర్చి చెప్ప బడింది. అతని పేరేమిటి?


Q ➤ 2. సిద్దీము యుద్ధము అనంతరము ఇతడు తన తమ్ముణ్ణి చెఱనుండి విడిపించాడు. ఎవరతడు?


Q ➤ 3. ఈ బలాఢ్యుడు మూడువందలమంది సహాయముతో ఇశ్రాయేలీయులను రక్షించాడు. ఎవరా బలాఢ్యుడు?


Q ➤ 4. యెరూషలేము ప్రాకారములు నిర్మించేవారిని నడిపించిన ధీశాలి ఎవరు?


Q ➤ 5. యెరూషలేములోని యూదులనుండి అపొస్తలుడైన పౌలును ఈ సహస్రాధిపతి రక్షించెను. ఎవరా సహస్రాధిపతి?


Q ➤ 6. రోగగ్రస్థుడైన తన దాసునికొరకై ఒక శతాధిపతి ప్రభువైన యేసు దగ్గరకు వచ్చెను. ఎవరా శతాధిపతి?


Q ➤ 7. ఈ శతాధిపతి అపొస్తలుడైన పౌలుతో పాటు సముద్ర ప్రయాణము చేశాడు. ఎవరా శతాధిపతి?


Q ➤ 8. "అతడు మహావరాక్రమశాలియై యుండెనుగాని అతడు కుష్ఠరోగి" అని ఒక గొప్ప సైన్యాధిపతినిగూర్చి చెప్పబడింది. ఎవరతడు?


Q ➤ 9. ఇశ్రాయేలీయులను కానానులోకి నడిపించిన సైనికుడు ఎవరు?


Q ➤ 10. యోసేపు ఐగుప్తుకు తేబడినప్పుడు ఫరో రాజసంరక్షక సేనాధిపతి ఎవరు?


Q ➤ 11. హెబ్రోనును జయించిన ధీశాలి ఎవరు?


Q ➤ 12. ఇశ్రాయేలు రాజుతో కలసి రామోతిలాదు మీదికి యుద్ధమునకు వెళ్ళిన యూదా రాజు ఎవరు?


Q ➤ 13. మంచుకాలమున బావిలో దాగియున్న ఒక సింహమును ఈ బలాధ్యుడైన ఘనుడు చంపివేశాడు. ఎవరతడు?


Q ➤ 14. యెహోవారు తాను మ్రొక్కుకొనిన ప్రకారము ఇతడు తన కుమార్తెను బలి. ఇచ్చెను. ఎవరతను?


Q ➤ 15. అబ్బాలోమును చంపిన సైనికుని పేరేమిటి?