Telugu Bible Quiz on Why in the bible ➤ ఎందుకు ? పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1. "మీరు నాయందు పగపట్టి నా తండ్రి యింటనుండి నన్ను తోలి వేసితిరే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నాయొద్దకు రానేల?"


Q ➤ 2. "నా కుమార్తెలారా, మీరు మరలుడి; నాతోకూడ మీరు రానేల?"


Q ➤ 3. "నీవు ఒంటరిగా వచ్చితివేమి?"


Q ➤ 4. "నీ చేతిలోనుండి తమ జనులను విడిపింప శక్తిలేని దేవతలయొద్ద నీవెందుకు విచారణ చేయుదువు?"


Q ➤ 5. "యాకోబూ, నా మార్గము యెహోవాకు మరుగైయున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేల అనుచున్నావు? ఇశ్రాయేలూ, నీవేల ఈలాగు చెప్పుచున్నావు?"


Q ➤ 6. "అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి?"


Q ➤ 7. "ఆలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని ఆయన మనల నడుగును!"


Q ➤ 8. "మీరేల గొల్లు చేసి యేడ్చుచున్నారు?"


Q ➤ 9. "కుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి?"


Q ➤ 10. "ఎందుకు మీరాయనను తీసికొని రాలేదు?"


Q ➤ 11. "నీవేల నన్ను హింసించుచున్నావు?"


Q ➤ 12. "అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేముకూడ మీ స్వభావమువంటి స్వభావముగల నరులమే."


Q ➤ 13. “మనస్సు త్రిప్పుకొనుడి; మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి; మీరెందుకు మరణము నొందెదరు?"


Q ➤ 14. “మీరేల మామీదికి వచ్చితిరి? అని అడుగగా, మాకు చేసినట్లు మేము అతనికి చేయవలెనని అతని కట్టుటకే వచ్చితిమనిరి.”


Q ➤ 15. “నా ప్రాణమా, నీవు ఏల కృంగియున్నావు? నాలో నీవేల తొందర పడుచున్నావు?”