Telugu Bible Quiz On Delightful || "సంతోషకరము" అనే అంశము పై బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz

1/15
న్యాయమైన క్రియలు చేయుట ఎవరికి సంతోషకరము?
A నీతిమంతునికి
B బుద్ధిమంతునికి
C అజ్ఞానవంతునికి
D భక్తిహీనునికి
2/15
నీతిమంతులు వర్ధిల్లుట దేనికి సంతోషకరము?
A సంఘమునకు
B సమాజమునకు
C పట్టణమునకు
D గృహమునకు
3/15
ప్రస్తుతమందు ఏది సంతోషకరముగా కనబడదు?
A సమస్తశిక్షయు
B సమస్తనితియు
C సమస్తప్రేమయు
D సమస్తభక్తియు
4/15
ఏ పర్వతము సర్వభూమికి సంతోషకరము గా నున్నది?
A దిబ్లాతు పర్వతము
B సీయోను పర్వతము
C గిల్బోవ పర్వతము
D గిలాదు పర్వతము
5/15
బుద్ధిలేనివానికి ఏది సంతోషకరము?
A వివేకము
B లంచము
C మూఢత
D గర్వము
6/15
ఎవరి విశ్వాస ప్రేమలను గూర్చి సంతోషకరమైన సమాచారమును తిమోతి, పౌలు యొద్దకు తెచ్చెను?
A థెస్సలొనీకయుల
B కొలొస్సయుల
C ఫిలిప్పీయుల
D ఎఫెసీయుల
7/15
కన్నుల ప్రకాశము చూచుట దేనికి సంతోషకరము?
A ఎముకలకు
B హృదయమునకు
C దేహమునకు
D సౌందర్యమునకు
8/15
నీతిగల పెదవులు ఎవరికి సంతోష కరములు?
A రాజులకు
B ఘనులకు
C హీనులకు
D బీదలకు
9/15
సంతోషకరమైనదేదియు అనుభవించకుండ నేను నా హృదయమును నిర్బంధింపలేదని ఎవరు అనెను ?
A యెహోరాము
B దావీదు
C యెహోషాపాతు
D సొలొమోను
10/15
ఏవి సంతోషకరములై యున్నవి?
A న్యాయతీర్పులు
B కలహములు
C శాసనములు
D వివాదములు
11/15
దూత - ప్రజలందరికిని కలుగబోవు మహాసంతోషకరమైన దేనిని నేను మీకు తెలియజేయుచున్నాను?
A ఆచారమును
B రాకడసూచనను
C ధర్మశాస్త్రమును
D సువర్తమానమును
12/15
నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము అని ఎవరు అనెను?
A ఆహాజు
B దావీదు
C మనషే
D హిజ్కియా
13/15
నవ్వులాటలు పుట్టించుటకై విందుచేయువారి ప్రాణమునకు ఏది సంతోషకరము?
A ద్రాక్షారసపానము
B ధనలాభము
C సుఖశాంతులు
D అధిక ధనము
14/15
ప్రాణేశ్వరీ, పూసికొను పరిమళ తైలముల వాసన వేటికన్న సంతోషకరము?
A సకల గంధవర్గముల
B సకల ద్రవ్యముల
C సకల దుర్గంధముల
D సకల గోపరసముల
15/15
కిరీటము ధరించిన వివాహదినము ఎవరికి బహు సంతోషకరము ?
A యెహోరామునకు
B రెహబామునకు
C దర్యావేషునకు
D సొలొమోనుకు
Result: