Telugu bible quiz questions and answers from Ezra

1➤ యెహోవా మందిరాన్ని నిర్మించడానికి యెహోవా ఏ పారసీక దేశపు రాజు మనస్సును ప్రేరేపించాడు?

=> కోరేషు (1:1)

2➤ సొలొమోను నిర్మించిన మందిర ఉపకరణాలను తీసుకొనిపోయింది ఎవరు?

=> నెబుకద్నెజరు (1:7)

3➤ కోరేషు రాజు ఖజానాదారుడు ఎవరు?

=> మిత్రిదాతు (1:8)

4➤ జెరుబ్బాబెలుకు ఉన్న మరో పేరేమిటి?

=> షేషజరు (1:11)

5➤ మందిర పునర్నిర్మాణాన్ని మొదలు పెట్టింది ఎవరు?

=> జెరుబ్బాబెలు (3:8)

6➤ మందిర నిర్మాణాన్ని ఆపిందెవరు?

=> అర్తహషస్త రాజు (4:21-23)

7➤ ధర్మశాస్త్ర బోధకుడైన యాజకుడు ఎవరు?

=> ఎజ్రా (7:12) )

8➤ యాజకుడైన ఎజ్రా అడిగినవన్ని సమకూర్చమని ఏ రాజు ఆదేశించాడు?

=> అర్తహషస్త రాజు (7:21)

9➤ సురక్షితమైన శుభప్రయాణం కోసం ఉపవాసాన్ని ప్రకటించినదెవరు?

=> ఎజ్రా (8:21)

10➤ ఏ నది దగ్గర ఎజ్రా, అతని స్నేహితులు ఉపవాసం చేశారు?

=> అహవా నది (8:21)

11➤ తన తలవెండ్రుకలను, గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతితో కూర్చొన్నదెవరు?

=> ఎజ్రా (9:3)