Telugu Bible Quiz ➤పౌలు ప్రయాణములలోని ప్రదేశములు

Q ➤ 1. ఎలుమ అనబడిన అబద్ద ప్రవక్త గ్రుడ్డివాడుగా చేయబడిన ప్రదేశము ఏది?


Q ➤ 2. పౌలు సహసేవకుడైన యోహాను పౌలును ఒక ప్రదేశమందు విడిచివెళ్ళాడు. ఆ ప్రదేశమేది?


Q ➤ 3. ఈ ప్రదేశమందు "అనేకులును యూదులును హెల్లెనీయులును విశ్వసించిరి". ఆ ప్రదేశమేది?


Q ➤ 4. ఈ పట్టణములో - "యూదులు భక్తి మర్యాదలుగల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి" పౌలుకు విరోధముగా అ పట్టణము పేరు తెలుపుము? రెచ్చగొట్టిరి.


Q ➤ 5. ఏ ప్రదేశమందు పౌలు "హెర్మే" అనియు, బర్నబా "ద్యుపతి" అనియు పిలువబడరు?


Q ➤ 6. చనిపోవునంతగా రాళ్ళతో కొట్టబడి, విడిచిపెట్టబడిన పౌలు అక్కడనుండి బయలుదేరి ఒక రేవు పట్టణమునకు వెళ్ళాడు. దాని పేరు తెలుపుము?


Q ➤ 7. “నీవు వచ్చి మాకు సహాయము చేయుము" అని ఓ మాసిదోనియ దేశస్థుడు పౌలుకు దర్శనములో కనబడి చెప్పిన స్థలము ఏది?


Q ➤ 8. నదీతీరమున పౌలు సువార్త ప్రకటించిన పట్టణము ఏది?


Q ➤ 9. "భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి యున్నారు" అని పౌలు మరియు అతని స్నేహితులనుగూర్చి చెప్పబడిన ప్రదేశము ఏది?


Q ➤ 10. ఏ పట్టణమందు నివసిస్తున్న ప్రజలనుగూర్చి - "వీరు థెస్సలొనీకలో ఉన్నవారికంటె ఘనులైయుండిరి" - అని చెప్పబడినది?


Q ➤ 11. దేవతా ప్రతిమలతో నిండి ఉన్న పట్టణము ఏది?


Q ➤ 12. "గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చియు లక్ష్యపెట్టలేదు” అని చెప్పబడినది ఎక్కడ?


Q ➤ 13. ఎఫెసు సంఘపెద్దలనుండి పౌలు వీడ్కోలు తీసుకున్నది ఎక్కడ?


Q ➤ 14. అగ్రిప్ప రాజుతో పౌలు మాట్లాడినది ఎక్కడ?


Q ➤ 15. పౌలుయొక్క ఓడ బ్రద్దలైన ప్రదేశము ఏది?