Telugu Bible Quiz on Numbers in the bible ➤ ఒకటినుండి పదిహేనువరకు అంకెలు (సంఖ్యలు) పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1. "తొంబది తొమ్మిదిమంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటె ___________ ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.


Q ➤ 2. మంచి సమరయుడు పూటకూళ్ళవానికి రెండింటిని ఇచ్చాడు. ఏమిటవి?


Q ➤ 3. పేతురు రూపాంతర కొండపై మూడు నిర్మించాలని కోరుకున్నాడు. ఏమిటవి?


Q ➤ 4. సువార్తికుడైన ఫిలిప్పుకు నలుగురున్నారు. ఎవరువారు?


Q ➤ 5. యేసును కలువకముందు సమరయ స్త్రీ ఏ ఐదుగురిని కలిగి ఉంది?


Q ➤ 6. పనిచేయుటకై ఆరు ఇవ్వబడినవి. ఏమిటవి?


Q ➤ 7. ప్రకటన గ్రంథములో ఏడింటికి లేఖలు వ్రాయబడ్డాయి. ఏమిటవి?


Q ➤ 8. ఓడలో ఎనిమిది రక్షించబడ్డాయి. ఏమిటవి?


Q ➤ 9. బాషాను రాజైన ఓగు కలిగి ఉన్న ఒకటి తొమ్మిది మూరల పొడవున్నది. ఏమిటది?


Q ➤ 10. దేవుడు మోషేద్వారా ఇశ్రాయేలీయులకు ఏ పదింటిని ఇచ్చాడు?


Q ➤ 11. పదకొండుమంది ఆరోహణాన్ని కళ్ళారా చూశారు? ఎవరు వారు? 12. యాకోబుకు పన్నెండుమంది గలరు. ఎవరువారు?


Q ➤ 13. పదమూడు సంవత్సరాల ప్రాయమున ఇష్మాయేలు ఏ కట్టడను. ఆచరించాడు?


Q ➤ 14. రాహేలు నిమిత్తమై యాకోబు పద్నాలుగు____________ కొలువు చేశాడు.


Q ➤ 15. యెరూషలేమునుండి బేతనికి పదిహేను___________ దూరముంది.