1➤ యోహాను సువార్తలో మూల వచనం ఏది?
,=> (3:16)
2➤ నాలుగవ సువార్త రచయిత ఎవరు?
,=> యోహాను
3➤ ఆదియందు వాక్యం ఏమైయున్నది?
,=> దేవుడు (1:1)
4➤ బాప్తిస్మమిచ్చు యోహానును ఎవరు పంపారు?
,=> దేవుడు (1:6)
5➤ వెలుగు గురించి సాక్ష్యమివ్వడానికి ఎవరు దేవునిచేత పంపబడ్డారు?
,=> బాప్తిస్మమిచ్చు యోహాను (1:7)
6➤ తనను అంగీకరించే వారందరికి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఎవరు అనుగ్రహించారు?
,=> యేసు (1:12)
7➤ శరీరధారియైన వాక్యం ఎవరు?
,=> యేసు (1:14)
8➤ ఎవరిద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది?
,=> మోషే (1:17)
9➤ బాప్తిస్మమిచ్చు రాకడను గురించి ఎవరు ప్రవచించారు?
,=> యెషయా (1:23)
10➤ యేసుక్రీస్తు గురించి అంద్రియ మొదట ఎవరితో చెప్పాడు?
,=> పేతురు (1:41)
11➤ కేఫా అని యేసు ఎవరిని పిలిచాడు?
,=> పేతురు (1:42)
12➤ 'కేఫా' అను మాటకు అర్థం ఏమిటి?
,=> రాయి (1:42)
13➤ ఫిలిప్పు ఏ ప్రాంతానికి చెందినవాడు?
,=> బేత్సయిదా (1:44)
14➤ యేసును గురించి నతానియేలుతో ఎవరు పంచుకొన్నారు?
,=> ఫిలిప్పు (1:45)
15➤ 'నతానియేలు' పేరుకు అర్థం ఏమిటి?
,=> దేవుడు ఇచ్చాడు (1:46)
16➤ నజరేతులోనుండి మంచిదేదైనా రాగలదా?' అని ఎవరు అడిగారు?
,=> నతానియేలు (1:46)
17➤ 'ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదు' అని ఎవరి గురించి యేసు చెప్పాడు?
,=> నతానియేలు (1:47)
18➤ అంజూరపు చెట్టు క్రింద కూర్చొన్నప్పుడే యేసు ఎవరిని చూశాడు?
,=> నతానియేలు (1:48)
19➤ వివాహోత్సవానికి యేసు, ఆయన శిష్యులు ఎక్కడికి ఆహ్వానించబడ్డారు?
,=> కానా (2:1)
20➤ కానా ఊరు ఎక్కడ ఉంది?
,=> గలిలయలో (2:1)
21➤ ఎక్కడ యేసు నీళ్ళను ద్రాక్షారసంగా మార్చాడు?
,=> గలిలయలోని కానా ఊరులో (2:1)
22➤ సూచక క్రియల్లో మొదటిగా యేసు చేసిన అద్భుతం ఏది?
,=> నీళ్ళను ద్రాక్షారసంగా మార్చడం (2:11)
23➤ గలిలయలోని కానా ఊరినుండి యేసు ఎక్కడికి వెళ్ళాడు?
,=> కపెర్నహూము (2:12)
24➤ యెరూషలేము మందిర నిర్మాణానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది?
,=> 46 సంవత్సరాలు (2:20)
25➤ యూదుల అధికారియైన పరిసయ్యుడు ఎవరు?
,=> నీకొదేము (3:1)
26➤ నీకొదేము పేరుకు అర్థం ఏమిటి?
,=> జయశాలి (3:1)
27➤ దేవుని రాజ్యం చూడాలంటే ఏమి చేయాలి?
,=> క్రొత్తగా జన్మించాలి (3:3)
28➤ నీటి మూలంగా, ఆత్మమూలంగా జన్మించాలని యేసు ఎవరితో చెప్పాడు?
,=> నీకొదేము (3:5)
29➤ 'ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు?' అని ఎవరు ఎవరిని అడిగారు?
,=> యేసును నీకొదేము అడిగాడు (3:4)
30➤ యేసువద్దకు వచ్చిన ఇశ్రాయేలీయుల బోధకుడు ఎవరు?
,=> నీకొదేము (3:10)
31➤ పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు?
,=> మనుష్యకుమారుడు (3:13)
32➤ అరణ్యంలో సర్పాన్ని ఎత్తి పట్టిందెవరు?
,=> మోషే (3:14)
33➤ ఎవరైనా అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచితే, అతడు ఏమి పొందుకొంటాడు?
,=> నిత్యజీవం (3:16)
34➤ ఎందుకు దేవుడు తన కుమారున్ని ఈ లోకంలోకి పంపాడు?
,=> ఆయనద్వారా రక్షణ పొందడానికి (3:17)
35➤ 'ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసి యున్నది' అని ఎవరు చెప్పారు?
,=> బాప్తిస్మమిచ్చు యోహాను (3:22-30)
36➤ ప్రజలకు బాప్తిస్మం ఇవ్వడానికి తన శిష్యులతో పాటు యేసు ఎక్కడికి వెళ్ళాడు?
,=> యూదయ దేశం (3:22)
37➤ యూదయ దేశంలో యేసు బాప్తిస్మం ఇస్తున్నప్పుడు బాప్తిస్మమిచ్చు యోహాను ప్రజలకు బాప్తిస్మం ఎక్కడ ఇచ్చాడు?
,=> ఐనో అను స్థలంలో (3:23)
38➤ కుమారునియందు విశ్వాసముంచని వానిమీదికి ఏమి వస్తుంది?
,=> దేవుని ఉగ్రత (3:36)
39➤ యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి ఎక్కడ ఉంది?
,=> సుఖారు (4:5)
40➤ ఏ ఊరిలో యేసు సమరయ స్త్రీతో మాట్లాడాడు?
,=> సుఖారు (4:5)
41➤ యాకోబు బావి ఎక్కడ ఉంది?
,=> సుఖారను ఊరిలో (4:5,6)
42➤ 'మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి' అని సమరయ స్త్రీ యేసుతో చెప్పింది. ఆ పర్వతం ఏది?
,=> గిరిజీము కొండ (4:20; ద్వితీ 27:12)
43➤ 'మెస్సీయ' అను పదానికి అర్థం ఏమిటి?
,=> క్రీస్తు (4:25)
44➤ యేసు నిజంగా లోక రక్షకుడని ఎవరు చెప్పారు?
,=> సమరయులు (4:42)
45➤ యేసు ప్రధాని కుమారున్ని ఎక్కడ స్వస్థపరిచాడు?
,=> కపెర్నహూము (4:46)
46➤ యెరూషలేములో గొట్టెలద్వారం వద్ద ఉన్న కోనేరు పేరు ఏమిటి?
,=> బేతెస్ధ (5:2)
47➤ బేతెస్ధ పదానికి అర్థం ఏమిటి?
,=> కనికరంగల ఇల్లు (5:2)
48➤ బేతెస్ధ కోనేరుకు ఎన్ని మంటపాలు ఉన్నాయి?
,=> ఐదు (5:2)
49➤ యేసు స్వస్థపరచిన వ్యక్తి కోనేరువద్ద ఎన్ని సంవత్సరాలనుండి రోగిగా ఉన్నాడు?
,=> ముప్పై ఎనిమిది సంవత్సరాలు (5:5)
50➤ మృతులు ఎవరి స్వరాన్ని వింటారు?
,=> దేవుని కుమారుని స్వరం (5:25)
51➤ తనంతట తానే జీవం కలిగియుండే అధికారాన్ని దేవుడు ఎవరికి అనుగ్రహించాడు?
,=> కుమారునికి (5:26)
52➤ మండుచు ప్రకాశిస్తున్న దీపమని ఎవరి గురించి యేసు ప్రశంసించాడు?
,=> బాప్తిస్మమిచ్చు యోహాను(5:35)
53➤ ధర్మశాస్త్రం ఆధారంగా ఎవరు నేరం మోపుతారు?
,=> మోషే (5:45)
54➤ ఐదువేలమంది ప్రజలను పోషించే తన అద్భుతాన్ని గురించి యేసు ఎవరి ని పరీక్షించాడు?
,=> ఫిలిప్పు (6:5)
55➤ జీవాహారంగా పేర్కొనబడింది ఎవరు?
,=> యేసు (6:35)
56➤ పరలోకంనుండి దిగి వచ్చిన జీవాహారం ఎవరు?
,=> యేసు (6:41)
57➤ 'నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు' అని ఎవరు యేసుతో చెప్పారు?
,=> పేతురు (6:68)
58➤ 'నిన్ను నీవే లోకమునకు కనపరచుకో' అని ఎవరు యేసుతో చెప్పారు?
,=> యేసు సహోదరులు (7:3-5)
59➤ యేసును దేవుని పరిశుద్ధునిగా అర్ధం చేసుకొన్నదెవరు?
,=> పేతురు (6:69)
60➤ యూదుల ఏడవ పండుగ ఏమిటి?
,=> పర్ణశాలల పండుగ (7:2)
61➤ పర్ణశాలల పండుగకు రహస్యంగా వెళ్ళిందెవరు?
,=> యేసు (7:10)
62➤ ఎవరి జీవిత కాలంలో సున్నతి ఆచారం మొదలైంది?
,=> అబ్రాహాము (7:22; ఆది 17:10)
63➤ పండుగ చివరి రోజున యేసు నిలబడి 'ఎవడైన దప్పిగొనినయెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను' అని బిగ్గరగా చెప్పాడు. అది ఏ పండుగ?
,=> పర్ణశాలల పండుగ (7:2,37)
64➤ విశ్వాసముంచినవాని హృదయంలో ఎలాంటి నది ప్రవహిస్తుంది?
,=> జీవజల నది (7:38)
65➤ లేఖనం ప్రకారం యేసు ఎక్కడనుండి వస్తాడు?
,=> బెల్లెహేము (7:42)
66➤ యేసుకు అనుకూలంగా వాదించిన యూదుల అధికారి పేరు ఏమిటి?
,=> నీకొదేము (7:50-52)
67➤ లోకానికి వెలుగు ఎవరు?
,=> యేసుక్రీస్తు (8:12)
68➤ ఎవరు శరీరాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నారు?
,=> పరిసయ్యులు (8:15)
69➤ 'సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును' అని ఎవరు చెప్పారు?
,=> యేసు (8:32)
70➤ అబద్ధికుడు ఎవరు?
,=> అపవాది (8:44)
71➤ ఆదినుండి నరహంతకుడు ఎవరు?
,=> సాతాను (8:44)
72➤ 'నీవు సమరయుడవు, దయ్యము పట్టినవాడవు' అని యేసుతో ఎవరు చెప్పారు?
,=> యూదులు (8:48)
73➤ దేవుని వాక్యాన్ని గైకొన్నవాని జీవితంలో ఏది రాదు?
,=> మరణం (8:51)
74➤ 'రాత్రి వచ్చుచున్నది. అప్పుడెవడును పని చేయలేడు' అని ఎవరు చెప్పారు?
,=> యేసు (9:4)
75➤ గుడ్డివాని కన్నులమీద బురదను పెట్టిన తరువాత కడుక్కోవడానికి ఏ సరస్సుకు వెళ్ళమని యేసు అతనికి చెప్పాడు?
,=> సిలోయము సరస్సు (9:7)
76➤ సిలోయము' పేరుకు అర్థం ఏమిటి?
,=> పంపబడిన (9:7)
77➤ సిలోయము సరస్సులో తన కండ్లను కడుక్కొన్నది ఎవరు?
,=> గుడ్డివాడు
78➤ 'దేవుడు పాపుల మనవి ఆలకింపడు' అని ఎవరు చెప్పారు?
,=> గుడ్డివాడు (9:31)
79➤ ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు?
,=> దేవభక్తుడైయుండి దేవుని చిత్తం చేయువారి ప్రార్థన (9:31)
80➤ ఎవరి స్వరాన్ని గొర్రెలు వింటాయి?
,=> కాపరి (10:3)
81➤ దొంగతనం, హత్య, నాశనం చేయడానికి ఎవరు వస్తారు?
,=> దొంగ (10:10)
82➤ మంచి కాపరి ఎవరు?
,=> యేసుక్రీస్తు (10:11)
83➤ గొర్రెల వద్దకు తోడేలు వచ్చినప్పుడు పారిపోయేది ఎవరు?
,=> జీతగాడు (10:12)
84➤ యేసు వెర్రివాడు అని ఎవరు చెప్పారు?
,=> యూదులు (10:20)
85➤ ప్రతిష్ఠిత పండుగ సమయంలో ఏ మంటపంవద్ద యేసు నడిచాడు?
=> సొలొమోను మంటపం (10:23)
1➤ బేతనియ ఎవరి గ్రామం?
,=> మార్త, మరియ (11:1)
2➤ లాజరు గ్రామం ఏది?
,=> బేతనియ (11:1)
3➤ లాజరు అర్థం ఏమిటి?
,=> దేవుడే సహాయకుడు (11:1)
4➤ లాజరు సహోదరీలు ఎవరు?
,=> మార్త, మరియ (11:1)
5➤ బేతనియ గ్రామంలో యేసు ప్రేమించిన వ్యక్తి పేరు ఏమిటి?
,=> లాజరు (11:3)
6➤ యేసు తలకు అత్తరు పూసి వెండ్రుకలతో ఆయన పాదాలను తుడిచిన వ్యక్తి ఎవరు?
,=> మరియ (11:2)
7➤ “ఈ వ్యాధి మరణముకొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమపరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినది' అని ఎవరు ఎవరితో చెప్పారు?
,=> మార్త, మరియలతో యేసు చెప్పాడు (11:4)
8➤ బేతనియ గ్రామంలో ఎవరి కుటుంబాన్ని యేసు బాగా ప్రేమించాడు?
,=> లాజరు కుటుంబం (11:15)
9➤ అపొస్తలుడైన తోమాకు ఉన్న మరో పేరేమిటి?
,=> దిదుమ (11:16)
10➤ 'ఆయనతోకూడ చనిపోవుటకు మనమును వెళ్ళుదము' అని ఏ అపొస్తలుడు చెప్పాడు?
,=> తోమా (11:16)
11➤ 'నీవు దేవున్ని ఏమడిగినను, దేవుడు నీకనుగ్రహించును' అని ఎవరు ఎవరితో చెప్పారు?
,=> యేసుతో మార్త చెప్పింది (11:22)
12➤ పునరుత్థానము, జీవము ఎవరు?
,=> యేసు (11:25)
13➤ ఎవరియందు విశ్వాసముంచితే, చనిపోయినా బ్రదుకుతారు?
,=> యేసునందు (11:25)
14➤ ఎక్కడ యేసు కన్నీళ్ళు విడిచాడు?
,=> లాజరు సమాధిముందు (11:35)
15➤ 'అతనిని ఏలాగు ప్రేమించెనో చూడు' అని ఎవరు చెప్పారు?
,=> యూదులు (11:36)
16➤ 'నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువు' అని ఎవరు ఎవరితో చెప్పారు?
,=> మార్తతో యేసు చెప్పాడు (11:40)
17➤ ఎన్ని రోజుల తరువాత యేసు లాజరును లేపాడు?
,=> 4వ రోజున (11:39)
18➤ ప్రేత వస్త్రాలతో సమాధినుండి బయటికి వచ్చిందెవరు?
,=> లాజరు (11:44)
19➤ లాజరు సమాధినుండి లేచినప్పుడు, ప్రధాన యాజకుడు ఎవరు?
,=> కయప (11:49)
20➤ క్రొత్త నిబంధనలో ప్రవక్తగా కూడా పేర్కొనబడిన ప్రధాన యాజకుని పేరు ఏమిటి?
,=> కయప (11:49-51)
21➤ చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు క్రీస్తు చనిపోతా డని ఎవరు ప్రవచించారు?
,=> కయప (11:52)
22➤ యూదులు యేసుని చంపాలని ప్రయత్నించినప్పుడు ఆయన ఎక్కడ రహస్యంగా గడిపాడు?
,=> ఎఫ్రాయిము ఊరిలో (11:54)
23➤ అత్తరును మూడువందల దేనారాలకు అమ్మి బీదలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిందెవరు?
,=> ఇస్కరియోతు యూదా (12:5)
24➤ డబ్బుసంచి ఎవరివద్ద ఉంది?
,=> ఇస్కరియోతు యూదా (12:6)
25➤ ఏ చెట్టు మట్టలను ప్రజలు తమ చేతుల్లో పట్టుకొని ప్రభువుకు హోసన్న పాటను పాడారు?
,=> ఖర్జూరపు చెట్టు మట్టలు (12:13)
26➤ 'ఇది గోలోకము ఆయనవెంట పోయినది' అని చెప్పుకున్నదెవరు?
,=> పరిసయ్యులు (12:19)
27➤ యేసును చూడాలనే తమ కోరికను ఫిలిప్పుతో ఎవరు పంచుకొన్నారు?
,=> గ్రీసు దేశస్థులు (12:20,21)
28➤ దేవుని మహిమను చూసిన పాతనిబంధన ప్రవక్త ఎవరు?
,=> యెషయా (12:41)
29➤ దేవుని మెప్పుకంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా ఆ పేక్షించింది ఎవరు?
,=> అధికారులు (12:42,43)
30➤ ఇస్కరియోతు యూదా తండ్రి ఎవరు?
,=> సీమోను (13:2)
31➤ తన శిష్యుల పాదాలను కడిగిన గురువు ఎవరు?
,=> యేసు (13:5)
32➤ “ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు, నా తలకూడ కడుగుము' అని యేసుతో ఎవరు చెప్పారు?
,=> పేతురు (13:9)
33➤ మిగతా శిష్యులకంటే యేసు ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు ఎవరు?
,=> యోహాను (13:23)
34➤ ఏ శిష్యుడు యేసు రొమ్మున ఆనుకొనేవాడు?
,=> యోహాను (13:23)
35➤ యేసును ఎవరు అప్పగిస్తున్నారనే దాని గురించి యేసును అడుగమని యోహానుకు సైగ చేసిన శిష్యుడు ఎవరు?
,=> పేతురు (13:24)
36➤ 'నీవు చేయుచున్నది త్వరగా చేయుము' అని ఎవరితో యేసు చెప్పాడు?
,=> ఇస్కరియోతు యూదా (13:27)
37➤ రొట్టె ముక్కను పుచ్చుకొన్న తరువాత వెంటనే బయటికి వెళ్ళిందెవరు?
,=> ఇస్కరియోతు యూదా (13:30)
38➤ యేసుకోసం తన ప్రాణాన్ని పెడుతానని ఎవరు చెప్పారు?
,=> పేతురు (13:37)
39➤ 'మీ హృదయమును కలవరపడనియ్యకుడి' అని ఎవరు ఎవరితో చెప్పారు?
,=> శిష్యులతో యేసు చెప్పాడు (14:1)
40➤ ఎక్కడ మనకు అనేక నివాసస్థలాలు ఉన్నాయి?
,=> తండ్రి ఇంటిలో (14:2)
41➤ యేసు వెళుతున్న స్థలానికి మార్గం తనకు తెలియదని ఎవరు చెప్పారు?
,=> తోమా (14:5)
42➤ మార్గం, సత్యం, జీవం ఎవరు?
,=> యేసు (14:6)
43➤ ఎవరిద్వారా తండ్రివద్దకు వెళ్ళగలరు?
,=> యేసుక్రీస్తు (14:6)
44➤ తండ్రిని మాకు కనపరచుమని ఎవరు యేసును అడిగారు?
,=> ఫిలిప్పు (14:8)
45➤ యేసు నామంలో పంపబడబోవు ఆదరణకర్త పేరు ఏమిటి?
,=> పరిశుద్ధాత్మ (14:26)
46➤ 'నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను' అని ఎవరు చెప్పారు?
,=> యేసు (14:27)
47➤ నిజమైన ద్రాక్షావల్లి ఎవరు?
,=> యేసుక్రీస్తు (15:1)
48➤ యేసు నిజమైన ద్రాక్షావల్లి, మనం తీగెలం. అయితే తండ్రియైన దేవుడు ఎవరు?
,=> వ్యవసాయకుడు (15:1)
49➤ మరింతగా ఫలించాలంటే తీగెలను మీరేమి చేస్తారు?
,=> పనికిరాని తీగెలను తీసివేస్తారు (15:2)
50➤ దేవుని మాటలవలన ఒకరు ఏమవుతారు?
,=> పవిత్రులు (15:3)
51➤ 'నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు' అని ఎవరు చెప్పారు?
,=> యేసు (15:5)
52➤ మనం బహుగా ఫలిస్తే ఏమవుతాము?
,=> శిష్యులం (15:8)
53➤ పాపం, నీతి, తీర్పును గురించి ఒప్పించేదెవరు?
,=> పరిశుద్ధాత్ముడు (16:8)
54➤ సర్వసత్యంలోనికి నడిపించేదెవరు?
,=> సత్యస్వరూపియైన ఆత్మ (16:13)
55➤ లోకాన్ని జయించింది ఎవరు?
,=> యేసుక్రీస్తు (16:33)
56➤ జగత్తు పునాది వేయబడకముందు తండ్రి ఎవరిని ప్రేమించాడు?
,=> యేసుక్రీస్తు (17:24)
57➤ 'లోకము నిన్ను ఎరుగలేదు. నేను నిన్ను ఎరుగుదును' అని ఎవరు చెప్పారు?
,=> యేసుక్రీస్తు (17:25)
58➤ యేసు అప్పగింపబడిన రాత్రి ఆయన, ఆయన శిష్యులు కలిసి దాటిన వారు పేరు ఏమిటి?
,=> కేద్రోను వాగు (18:1)
59➤ శిష్యులతో పాటు యేసు వెళ్ళిన తోట పేరేమిటి?
,=> గెత్సెమనే (18:2)
60➤ ప్రధాన యాజకునియొక్క దాసుని కుడి చెవిని నరికింది ఎవరు?
,=> పేతురు (18:10)
61➤ పేతురుచేత కుడి చెవి నరుకబడిన ప్రధాన యాజకుని దాసుని పేరు ఏమిటి?
,=> మల్కు (18:11)
62➤ యేసును బంధించిన తరువాత ఆయన ఎవరివద్దకు తీసుకొనిపోబడ్డాడు?
,=> అన్న (18:12)
63➤ కయప మామ ఎవరు?
,=> అన్న (18:13)
64➤ ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట ప్రయోజనకరమని ఆలోచన చెప్పినదెవరు?
,=> కయప (18:14)
65➤ ప్రధాన యాజకునికి తెలిసిన యేసు శిష్యుడు ఎవరు?
,=> యోహాను (18:15)
66➤ ప్రధాన యాజకుని ఇంటి ముంగిటలోకి వెళ్ళిన ఇద్దరు శిష్యులు ఎవరు?
,=> పేతురు, యోహాను (18:15)
67➤ ప్రధాన యాజకుని ఇంటి ఆవరణంలోకి రమ్మని పేతురును ప్రోత్సహించింది ఎవరు?
,=> యోహాను (18:16)
68➤ యేసును హింసించిన తరువాత అన్న ఆయన్ని ఎవరివద్దకు పంపాడు?
,=> కయప (18:24)
69➤ ధర్మశాస్త్రం ప్రకారం యేసుకు తీర్పు తీర్చమని యూదులకు చెప్పిందెవరు?
,=> పిలాతు (1831)
70➤ సత్యాన్ని గురించి సాక్ష్యమివ్వడానికి ఎవరు పుట్టారు?
,=> యేసుక్రీస్తు (18:37)
71➤ యేసును సిలువ వేయమని తీర్పునిచ్చిన తరువాత పిలాతు ఏ న్యాయపీఠం మీద కూర్చొన్నాడు?
,=> గబ్బతా (19:13
72➤ సిలువవేసే సమయంలో యేసుకు ఎలాంటి వస్త్రాన్ని తొడిగించారు?
,=> ఊదారంగు వస్త్రం (19:3)
73➤ ముండ్లతో కిరీటమును అల్లి యేసు తలమీద పెట్టిందెవరు?
,=> సైనికులు (19:2)
74➤ 'ఇదిగో ఈ మనుష్యుడు' అని ఎవరి గురించి ఎవరు చెప్పారు?
,=> యేసు గురించి పిలాతు చెప్పాడు (19:5)
75➤ యేసును విడుదల చేయడానికి లేక సిలువ వేయడానికి ఎవరికి అధికార మున్నది?
,=> పిలాతు (19:10)
76➤ 'నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు' అని ఎవరితో ఎవరు చెప్పారు?
,=> పిలాతుతో యేసు చెప్పాడు (19:11)
77➤ 'గబ్బతా' అనగా అర్థం ఏమిటి?
,=> రాళ్ళు పరచిన స్థలం (19:13)
78➤ 'గొల్గొతా' అనే పదం ఏ భాషలో ఉంది?
,=> హెబ్రీ భాషలో (19:17)
79➤ యేసును సిలువ వేయడానికి ఎక్కడికి తీసుకెళ్ళారు?
,=> గొల్గొతా (19:17)
80➤ 'యూదుల రాజైన నజరేయుడగు యేసు' అనే పేరు ఏ భాషల్లో వ్రాయ బడింది?
,=> హెబ్రీ, గ్రీకు, లాటిన్ (19:19,20)
81➤ 'నేను వ్రాసినదేమో వ్రాసితి'సని ఎవరు చెప్పారు?
,=> పిలాతు (19:22)
82➤ యేసు అంగీకోసం చీట్లు వేస్తారని ఎవరు ప్రవచించారు?
,=> దావీదు (కీర్తన 22:18)
83➤ క్లోపా భార్య ఎవరు?
,=> మరియ (19:25)
84➤ సిలువ వేయబడిన సమయంలో యేసు తన తల్లిని ఎవరికి అప్పగించాడు?
,=> యోహాను (19:27)
85➤ సిలువ మీద ఉన్నప్పుడు యేసు చివరిగా ఏమి చెప్పాడు?
,=> సమాప్తమైనది (19:30)
86➤ సిలువ మీదున్న వారి కాళ్ళు విరుగగొట్టమని యూదులు ఎవరిని అడిగారు?
,=> పిలాతు (19:31)
87➤ “అతని యెముకలలో ఒకటైనను విరువబడదు' అని ఎవరు ప్రవచించారు?
,=> దావీదు (కీర్తన 34:20; కీర్తన 19:36)
88➤ తన మరణం తరువాత పొడవబడినదెవరు?
,=> యేసు (19:34)
89➤ యేసు సమాధి కార్యక్రమంలో హాజరైన పరిసయ్యుల అధికారి ఎవరు?
,=> నీకొదేము (19:39)
90➤ యేసు మృతదేహానికి పూసే నూటయాబది సేర్ల యెత్తు సుగంధ ద్రవ్యాల ను తెచ్చిందెవరు?
,=> నీకొదేము (19:39,40)
91➤ ఇంకా చీకటి ఉండగానే ఆదివారం రోజున పెందలకడనే యేసు సమాధి వద్దకు ఎవరు వెళ్ళారు?
,=> మగ్దలేనే మరియ (20:1)
92➤ యేసు సమాధి బయట నిలబడి యేడ్చిన స్త్రీ ఎవరు?
,=> మగ్దలేనే మరియ (20:11)
93➤ యేసు పునరుత్థాన రోజున ఆయన సమాధివద్దకు కలిసి పరుగెత్తిన శిష్యులు ఎవరు?
,=> పేతురు, యోహాను (20:4)
94➤ సమాధిలోకి ఏ శిష్యుడు మొదట ప్రవేశించాడు?
,=> పేతురు (20: 6)
95➤ ‘నా ప్రభువును ఎవరో ఎత్తికొనిపోయిరి; ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదు' అని ఎవరు చెప్పారు?
,=> మగ్దలేనే మరియ (20:13)
96➤ యేసు తన పునరుత్థానం తరువాత మొదట ఎవరికి కనబడ్డాడు?
,=> మగ్దలేనే మరియ (20:13-18)
97➤ 'రబ్బూనీ' పదానికి అర్థం ఏమిటి?
,=> బోధకుడా (20:16)
98➤ 'నన్ను ముట్టుకొనవద్దు' అని ఎవరితో యేసు చెప్పాడు?
,=> మగ్దలేనే మరియ (20:17)
99➤ పునరుత్థానం తరువాత యేసు తన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు ఏ శిష్యుడు వారితో లేడు?
,=> తోమా (20:24)
100➤ యేసు చేతుల్లోని మేకుల గుర్తులను చూసి ఆ మేకుల గుర్తులో తన చేతులు పెడితేనే గాని నమ్మనే నమ్మనని ఏ శిష్యుడు చెప్పాడు?
,=> తోమా (20:25)
101➤ 'అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుము' అని యేసు ఎవరితో చెప్పాడు?
,=> తోమా (20:27)
102➤ యేసు ప్రక్కలోకి తన చేయి చాచిన శిష్యుడు ఎవరు?
,=> తోమా (20:27)
103➤ పునరుత్థానం తరువాత ఏ సముద్ర తీరాన యేసు తన శిష్యులకు ప్రత్యక్షమైనాడు?
,=> తిబెరియ సముద్ర తీరం (21:1)
104➤ యేసు పునరుత్థానం తరువాత చేపలు పట్టడానికి వెళ్ళాలని ఏ శిష్యుడు నిర్ణయించుకొన్నాడు?
,=> పేతురు (21:3)
105➤ 'భోజనమునకు మీయొద్ద ఏమైన ఉన్నదా' అని ఎవరిని యేసు అడిగాడు?
,=> తన శిష్యులను యేసు అడిగాడు (21:5)
106➤ యేసును చూడగానే తన చుట్టు పై బట్టను కప్పుకొని సముద్రంలో దుమికిందెవరు?
,=> పేతురు (21:7)
107➤ యేసుమాట ప్రకారం వల వేసినప్పుడు శిష్యులు ఎన్ని చేపలు పట్టారు?
,=> 153 చేపలు (21:11)
108➤ మూడోసారి తన శిష్యులకు యేసు ప్రత్యక్షమైనది ఎక్కడ?
,=> తిబెరియ సముద్ర తీరం (21:1, 14)
109➤ 'వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా?” అని యేసు ఎవరిని అడిగాడు?
,=> పేతురు (21:15)
110➤ యేసు పేతురుని మూడుసార్లు అడిగిన ప్రశ్న ఏది?
,=> 'వీరికంటె నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా?' (21:15-17)
111➤ యవ్వన ప్రాయంలో తనకు ఇష్టమైన చోటికి వెళ్ళినది ఎవరు?
=> పేతురు (21:18)