Bible Quiz on Salvation || "రక్షణ" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz

1/15
ప్రజలకు ఎవరు లేకుండుట యెహోవా చూచెను?
A రాజు
B న్యాయాధిపతి
C సంరక్షకుడు
D ప్రధానులు
2/15
రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము ఏమి కాలేదు?
A కురచ
B ఎడము
C దూరము
D దాచబడలేదు
3/15
యెహోవా మనకు ఎవరై, ఏమై రక్షించును?
A యాజకుడు కాపరి
B న్యాయాధిపతి - దూత
C శాసనకర్త - రాజు
D ఆశ్రయము - దుర్గము
4/15
నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, అని ఎవరు దేవుని స్తుతించిరి?
A ఆసాపు
B సొలొమోను
C గాదు
D కోరహు కుమారులు
5/15
యెహోవా రక్షించిన ఇశ్రాయేలు భాగ్యము ఎటువంటిది?
A గొప్పది
B మంచిది
C ఉన్నతము
D అధికము
6/15
తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు దేవుడు ఎవరిని లోకమునకు పంపెను?
A తన అద్వితీయకుమారుని
B ప్రవక్తలను
C దూతలను
D యాజకులను
7/15
ప్రజలను వారి పాపముల నుండి రక్షించే తన అద్వితీయ కుమారునికి దేవుడు ఏమని పేరు పెట్టమనెను?
A క్రీస్తు
B యేసు
C ఇమ్మానుయేలు
D మెస్సీయ
8/15
పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను ఏది నమ్మదగినది?
A ప్రకటన
B వచనము
C వాక్యము
D మాట
9/15
ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి తప్పించి, మనలను ఎక్కడికి చేరునట్లు రక్షించును?
A సహవాసమునకు
B మందిరమునకు
C గృహమునకు
D పరలోకమునకు
10/15
ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు మనలను ఏమి చేసెను?
A నియమించెను
B నడిపించెను
C విడిపించెను
D ఏర్పర్చను
11/15
మనము దేవుని వరము వలన దేని ద్వారా, దేని చేత రక్షింపబడి యున్నాము?
A విధేయత కరుణ
B లోబడుట - దయ
C విశ్వాసము - కృప
D నమ్మకము - ప్రేమ
12/15
ఎవరి ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించెను?
A మరియ
B ఎలీసబెతు
C అన్న
D పెర్సిస్
13/15
దేవుని రక్షణ వలన మహాబలము నొంది సంతోషించినదెవరు?
A మిల్కా
B నయామా
C హన్నా
D యాయేలు
14/15
దేవుడు సకలప్రజల యెదుట సిద్ధపరచిన రక్షణను ఎవరు కన్నులారా చూచెను?
A అంద్రెయ
B సుమెయోను
C నీకొదేము
D గమలీయేలు
15/15
రక్షకుడైన యేసు పుట్టుట ఎవరికి మహాసంతోషకరమైన సువర్తమానము?
A రాజు
B చక్రవర్తులకు
C అన్యజనులకు
D ప్రజలందరికి
Result: