Telugu Bible Quiz ➤మోషే జీవితములో నుంచి బైబుల్ క్విజ్

Q ➤ 1. పసిబాలుడుగా ఉన్నప్పుడు జమ్ముపెట్టెలో దాచబడిన మోషేను నదిలో కనుగొన్నది ఎవరు?


Q ➤ 2. మోషే ఐగుప్తునుండి ఎందుకు పారిపోయాడు?


Q ➤ 3. అతడు ఏ ప్రాంతమునకు పారిపోయాడు?


Q ➤ 4. అతని భార్య పేరు తెలుపుము?


Q ➤ 5. అతని మామ ఎవరు?


Q ➤ 6. తన చెప్పులను విప్పవలసిందిగా మోషే ఓ స్వరమును విన్నప్పుడు దేనిని చూచాడు?


Q ➤ 7. మోషేయొక్క సహోదరుని పేరు తెలుపుము?


Q ➤ 8. ఐగుప్తుమీదికి దేవుడు పంపిన తెగుళ్ళు ఎన్ని?


Q ➤ 9. మోషే నియమించిన జ్ఞాపకార్ధపు పండుగ ఏమిటి?


Q ➤ 10. ఐగుప్తు వెలుపట దేవుడు తన ప్రజలకు ఏ రూపములో రక్షణగా ఉండి నడిపించాడు?


Q ➤ 11. అరణ్యములో దేవుడు తన ప్రజలకు పంపించిన ఆహారము ఏమిటి?


Q ➤ 12. సీనాయి పర్వతముమీద మోషే దేవుని నుండి ఏమి పొందాడు?


Q ➤ 13. అహరోను దేవునికి ఎలా కోపము పుట్టించాడు?


Q ➤ 14. ప్రత్యక్షపు గుడారమును తయారు చేయుటకు పనివారిని నడిపించిన ఇద్దరు వ్యక్తుల పేర్లు తెలుపుము?


Q ➤ 15. మోషే మరణించినప్పుడు అతని వయస్సు ఎంత? అతని సమాధి ఎక్కడ ఉన్నది?