Telugu Bible Quiz ➤ బైబిలులోని వస్త్రధారణ మరియు ఆభరణములు పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1. పౌలు త్రోయలో ఒక వస్త్రమును విడిచిపెట్టాడు. ఏమిటది?


Q ➤ 2. శిశువుగా ఉన్న యేసుకు మొట్టమొదటిసారి ధరింపబడిన వస్త్రమేమిటి?


Q ➤ 3. పందుల ఎదుట వేటిని వేయవద్దని ప్రభువైన యేసు తనను వెంబడించిన వారితో చెప్పాడు?


Q ➤ 4. ఒక రాజు "లోపల తన ఒంటిమీద" ధరించిన వస్త్రమేమిటి?


Q ➤ 5. ఫరో యోసేపు మెడకు దేనిని ధరింపజేశాడు?


Q ➤ 6. యేసు కుట్టులేని ఓ వస్త్రమును ధరించాడు. ఏమిటది?


Q ➤ 7.“యెహోవా పరిచర్యలో" బాలుడైన సమూయేలు ఏమి ధరించాడు?


Q ➤ 8. దేవుడైన యెహోవా ఆదాము హవ్వలను ఏదెను తోటనుండి వెళ్ళగొట్టక మునుపు వారికి తొడిగించినవేమిటి?


Q ➤ 9. పస్కా సందర్భమున ఇశ్రాయేలీయులు వేటిని తమ పాదములకు వేసుకొని భుజించారు?


Q ➤ 10. తప్పిపోయిన కుమారుడికొరకై అతని తండ్రి ప్రశస్తమైన దానిని తెప్పించాడు. ఏమిటది?


Q ➤ 11. ప్రభువైన యేసు ముళ్ళతో తయారుచేయబడిన దానిని ధరించాడు. ఏమిటది?


Q ➤ 12. యేసు చెప్పిన ఒకానొక ఉపమానములో, ఏది లేనందున ఓ మనుష్యుడు శిక్ష అనుభవించాడు?


Q ➤ 13. అబ్రాహాము దాసుడు రిబ్కాకు రెండు బంగారు నగలను ఇచ్చాడు. ఏమిటవి?


Q ➤ 14. వేటిని “తొడుగుకొనుమని" పేతురు దూతద్వారా ఆదేశింపబడ్డాడు?


Q ➤ 15. మన ఆది తల్లిదండ్రులు అంజూరపు ఆకులతో వేటిని తయారుచేసుకొన్నారు?