1➤ ఆదాము పేరుతో మొదలయ్యే బైబిలు పుస్తకం ఏది?
=> 1 దినవృత్తాంతములు (1:1)
2➤ భూమిమీద ఉన్న పరాక్రమశాలులలో మొదటివాడు ఎవరు?
=> నిమ్రోదు (1:10)
3➤ తన సేవకునికి తన కుమార్తెను భార్యగా ఇచ్చినదెవరు?
=> షేషాను (2:35)
4➤ తన సహోదరులకంటే ఘనత పొందినవాడని ఎవరి గురించి చెప్పబడింది?
=> యబ్బేజు (4:9)
5➤ కర్ణ పిశాచాలవద్ద విచారణ చేసినందుకు ఏ రాజు చనిపోయాడు?
=> సౌలు (10:13)
6➤ దావీదు కాలంలో గాయక బృందానికి అధిపతి ఎవరు?
=> ఆసాపు (16:5)
7➤ మందిరంలో గదులను నిర్మించాలనే ప్రణాళికను సొలొమోనుకు ఎవరిచ్చారు?
=> దావీదు (28:11)