Telugu Bible Quiz Topic wise: 523 || తెలుగు బైబుల్ క్విజ్ ("పునరుత్థానము" అనే అంశముపై క్విజ్-1)

1: "పునరుత్థానము" అనగా ఏమి?
A తిరిగి లేచుట
B మరణించుట
C అదృశ్యమైన
D తిరిగి జన్మయించుట
2Q. "పునరుత్థానము" లేదని చెప్పువారు ఎవరు?
A సద్దూకయ్యులు
B పరిసయ్యులు
C శాస్త్రులు
D బోధకులు
3Q. మేలు, కీడు చేసినవారు ఏ పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.?
A స్వర్గ, నరక
B దేవ, సాతాను
C జీవ, తీర్పు
D పైవి ఏవీ కావు
4Q. మనకు పునరుత్థానమును జీవమును ఎవరై ఉన్నారు?
A ఆదాము
B నోవహు
C యేసు
D అబ్రాహాము
5Q. క్రీస్తు పాతాళములో విడువ బడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పిన వారు ఎవరు?
A సౌలు
B సైఫను
C దావీదు
D మలాకీ
6 Q. ఏ మార్గంలో తన శిష్యులతో "పునరుత్థాను"డై లేచిన యేసుక్రీస్తు మాట్లాడెను.?
A జెరూసలేం
B బేతని
C ఎమ్మాయి
D ఐగుప్తు
7Q. వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇది ఎన్నోవ పునరుత్థానము?
A రెండవ పునరుత్థానము
B ఏడవ పునరుత్థానము
C మూడవ పునరుత్థానము
D మొదటి పునరుత్థానము
8 Q. ఎవరు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి.?
A స్త్రీలు
B సమరయులు
C అపొస్తలులు
D పరిసయ్యులు
9Q. ఎక్కడ మృతుల "పునరుత్థానము"ను పొందుటకు యోగ్యులని యెంచబడినవారు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు.?
A పరమున
B పాతాళమున
C దేవుని ఆలయములో
D.మందసమున
10 ------------------- మనుష్యుని ద్వారా ఏమి వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల "పునరుత్థానము"ను కలిగెను.?
A జీవము
B మరణము
C శ్రమ
D పాపము
11Q. మృతుల "పునరుత్థానము"న శరీరము ఎలా విత్తబడి ఎలా లేపబడును.?
A మంచి, చెడు
B క్షయ, అక్షయ
C బలమైనది, బలహీన
D పైవన్నీ
12. యేసు పునరుత్థానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఏమి గలవారమై యుందుము?
A భేదము
B వైరము
C ఐక్యము
D స్నేహము
13 "పునరుత్థానము" అనబడే ఆనస్టాశీస్ అనె పదము ఎక్కడ నుండి వచ్చింది?
A గ్రీకు
B తెలుగు
C హీబ్రు
D ఆంగ్లము
14 Q. మొదటి "పునరుత్థానము"లో పాలుగలవారు ఏమై యుందురు.?
A నీతిమంతులు
B అనీతిమంతులు
C ధన్యులును పరిశుద్ధులు
D పైవన్నీ
15Q. యేసుక్రీస్తు తిరిగి లేచిన తరువాత మొదటిగా ఎవరికి కనపడెను?
A పేతురు
B మగ్దలేనె మరియ
C రోదే
D లూదియ
Result: