Bible Quiz in Telugu Topic wise: 74 || తెలుగు బైబుల్ క్విజ్ ("World Loving Day"సందర్భంగా బైబిల్ క్విజ్)

1. ప్రేమ దేవుని మూలముగా ఏమగుచున్నది?
ⓐ వచ్చుచున్నది
ⓑ పుట్టుచున్నది
ⓒ వెంటాడుచున్నది
ⓓ కలుగుచున్నది
2 . ప్రేమ లేనివాడు దేవుని ఏమవ్వడు?
ⓐ తెలుసుకొనడు
ⓑ నమ్మడు
ⓒ ఎరుగడు
ⓓ విడువడు
3 . ఎవరు తన ప్రేమ ద్వారా దేవుని పిల్లలమని పిలువబడునట్లు అనుగ్రహించెను?
ⓐ కుమారుడు
ⓑ తండ్రి
ⓒ పరిశుధ్ధాత్మ
ⓓ మహాదూత
4.వేటితో ప్రేమింతుము?
ⓐ క్రియ ; సత్యము
ⓑ మాట; నాలుక
ⓒ తలంపు; ఆలోచన
ⓓ మనస్సు; హృదయము
5. ప్రేమ లేనివాడు దేని యందు నిలిచియున్నాడు?
ⓐ పాపము
ⓑ మరణము
ⓒ దోషము
ⓓ నేరము
6. మన నిమిత్తము తన యొక్క ఏమి పెట్టిన యేసు ప్రేమ తెలుసుకొనుచున్నాము?
ⓐ ఐశ్వర్యము
ⓑ స్వాస్థ్యము
ⓒ ప్రాణము
ⓓ ధనము
7 . ఎవరిని ప్రేమింపని వాడు దేవుని సంబంధికాడు?
ⓐ తండ్రిని
ⓑ కుమారుని
ⓒ తల్లిదండ్రులను
ⓓ తన సహోదరుని
8 . పరిపూర్ణ ప్రేమ దేనిని వెళ్ళగొట్టును?
ⓐ కలవరమును
ⓑ భయమును
ⓒ దుఃఖమును
ⓓ భీతిని
9 . దేవునికి యున్న ప్రేమను ఎరిగి ఏమి చేసుకొనియున్నాము?
ⓐ నమ్ముకొని
ⓑ ఆనుకొని
ⓒ హత్తుకొని
ⓓ విశ్వసించి
10 . దేనిని ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ మనలో యుండదు?
ⓐ బంగారమును
ⓑ ద్రవ్యమును
ⓒ లోకమును
ⓓ ధనమును
11. తన సహోదరుని ప్రేమించువాడు ఎక్కడ యున్నాడు?
ⓐ కాంతిలో
ⓑ శాంతిలో
ⓒ భద్రతలో
ⓓ వెలుగులో
12 . ప్రేమలో నడుచుకొనుట దేవుని యొక్క ఏమై యున్నది?
ⓐ ఆజ్ఞ
ⓑ విధి
ⓒ కట్టడ
ⓓ ఉపదేశము
13 . దేవుని ప్రేమ యందు నిలిచిన యెడల ఏ దినమందు ధైర్యము కలిగియుందుము?
ⓐ రాకడ
ⓑ ప్రభువు
ⓒ తీర్పు
ⓓ ఉగ్రత
14 . మనము ఒకరినొకరము ప్రేమించు కొనిన యెడల మనలో దేవుని ప్రేమ ఏమగును?
ⓐ నిశ్చలము
ⓑ నిశ్చయము
ⓒ సంపూర్ణము
ⓓ నిర్ణయము
15 . మనము మన సహోదరులను ప్రేమించిన యెడల మరణములో నుండి దేని లోనికి దాటియున్నాము?
ⓐ పరలోకము
ⓑ ఉన్నతమునకు
ⓒ వెలుగునకు
ⓓ జీవమునకు
Result: