1. "పక్షులు"ఎగురుచూ తమ పిల్లలను కాపాడునట్లు యెహోవా దేనిని కాపాడును?
2. ఇశ్రాయేలీయులను ఏమి చేయుటకు ఆకాశ"పక్షులను" వారికి బాధగా యెహోవా బాధగా నియమించెను?
3. "పక్షి"తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించునని యెహోవా ఎవరితో అనెను?
4. "పక్షి "గూటిలో ఒకడు చెయ్యివేసినట్టు ఏమి నా చేత చిక్కెనని యెహోవా అనెను?
5. ఎవరి పర్వతముల మీద జరుగు నొక గొప్పబలికి సకలజాతుల "పక్షులకు "సమాచారము తెలియజేయుమని యెహోవా అనెను?
6. ఎవరి వంటి దేవదారు వృక్షము యొక్క శాఖలలో ఆకాశ"పక్షులు"గూళ్లు కట్టుకొనెను?
7. నానా విధములగు విచిత్రవర్ణములు గల గొప్ప"పక్షి"రాజు లెబానోను పర్వతము మీదికి వచ్చి దేని పై కొమ్మను పట్టుకొనెను?
8. పవిత్రత పొందగోరు కుష్టరోగిని సజీవమైన ఎన్ని "పక్షులను"తెమ్మని యాజకుడు ఆజ్ఞాపింపవలెను?
9. దేవుడు ఏ "పక్షికి"వివేచనాశక్తి ననుగ్రహించి యుండలేదు?
10. ఎదోము నివాసస్థలములో ఏ "పక్షి" గూడు కట్టుకొనును?
11. కొమ్మల నడుమ ఆకాశ"పక్షులు"ఏమి చేయునని కీర్తనాకారుడు అనెను?
12. యెహోవా గుర్రములు ఏ "పక్షుల"కంటె వేగము కలవి?
13. కొండపేటు సందులలో గూడు కట్టుకొను ఏ "పక్షుల"వలె కొండలో కాపురముండమని యెహోవా ఏ నివాసులతో అనెను?
14. చండు ఏ "పక్షులకు"యెహోవా ఆహారమిచ్చువాడు?
15. బండసందులలో ఎగురు ఏ "పక్షి"పేరుతో ప్రియుడైన క్రీస్తు ప్రియురాలైన సంఘమును పిలిచెను?
Result: