Bible Quiz in Telugu Topic wise: 416 || తెలుగు బైబుల్ క్విజ్ ("దేవుడు" అనే అంశముపై క్విజ్)

1. దేవుడు దేనిచేత ప్రపంచములను స్థాపించెను?
ⓐ తన జ్ఞానము
ⓑ తన వివేచన
ⓒ తన యోచన
ⓓ తన ఆలోచన
2. దేవుడు దేనిని ఎంతో ప్రేమించెను?
ⓐ దేశమును
ⓑ లోకమును
ⓒ రాష్ట్రమును
ⓓ పట్టణమును
3. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల ఏమి ఎంత గంభీరము?
ⓐ వివేచన
ⓑ ఘనత
ⓒ బాహుళ్యము
ⓓ గ్రహింపు
4. దేవుడు ఏమైన దుర్గమై యున్నాడు?
ⓐ ఎత్తైన
ⓑ లోతైన
ⓒ ఉన్నతమైన
ⓓ ఎన్నదగిన
5. దేవుని యొక్క ఏమి ఆకాశము నంటుచున్నది?
ⓐ ఔన్నత్యము
ⓑ మాట
ⓒ కృప
ⓓ చూపు
6. దేవుని యొక్క ఏమి శోధింపనెంతో ఆశక్యములు?
ⓐ తీర్పులు
ⓑ క్రియలు
ⓒ కార్యములు
ⓓ పనులు
7. దేవుడు దేనిని నరుల హృదయములో నుంచియున్నాడు?
ⓐ శాశ్వతకాల జ్ఞానమును
ⓑ నిరంతర వివేచనను
ⓒ పరిశీలించు మనస్సును
ⓓ ఆలోచన శక్తిని
8. దేవుడు గద్దించు మనుష్యుడు ఏమై యున్నాడు?
ⓐ మంచివాడు
ⓑ ధన్యుడు
ⓒ శ్రేష్టుడు
ⓓ గొప్పవాడు
9. ఎవరు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు?
ⓐ భాగ్యవంతులు
ⓑ ఐశ్వర్యవంతులు
ⓒ నీతిమంతులు
ⓓ మంచివారు
10. దేవుని యొక్క ఏమి ఎంతో అగమ్యములు?
ⓐ మాటలు
ⓑ త్రోవలు
ⓒ బాటలు
ⓓ మార్గములు
11. దేవుడు మహోన్నతుడైనను ఆయన ఎవరిని లక్ష్యపెట్టును?
ⓐ మంచివారిని
ⓑ గొప్పవారిని
ⓒ దీనులను
ⓓ పేదలను
12. దేవునికి భయపడువారి మీద ఆయన యొక్క ఏమి తరతరములకుండును?
ⓐ కరుణ
ⓑ కనికరము
ⓒ జాలి
ⓓ దయ
13. దేవుని యొక్క ఏమేమి మనకు త్రోవ చూపును?
ⓐ వెలుగు ; సత్యము
ⓑ నీతి ; నమ్మకము
ⓒ కృప; వాత్సల్యము
ⓓ జ్ఞానము ; ప్రజ్ఞ
14. ఏమి చేసిన వారికి దేవుడు అమూల్యమైనవాడు?
ⓐ ఓపిక కలిగిన వారికి
ⓑ నిరీక్షించువారికి
ⓒ విశ్వసించిన
ⓓ ఆశించిన వారికి
15. దేవుని యొక్క అద్భుతములు ఏమైయున్నవి?
ⓐ గొప్పవి
ⓑ మహత్తరము
ⓒ ఘనమైనవి
ⓓ ఆశ్చర్యము
Result: