Bible Quiz in Telugu Topic wise: 172 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఇశ్రాయేలీయుల రాజు అహాజ్యా " అంశము పై బైబిల్ క్విజ్)

1. ఆహాబు మరణమైన తర్వాత అతన కుమారుడైన ఎవరు రాజాయెను?
ⓐ అమాజ్యా
ⓑ ఆహూజ
ⓒ అహజ్యా
ⓓ ఆహాజు
2. అహజ్యా ఎవరి ప్రవర్తనను ననుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను?
ⓐ తన పితరుల
ⓑ తన పూర్వికుల
ⓒ అన్యజనుల
ⓓ తనతల్లిదండ్రుల
3. అహజ్యా బయలును పూజించి యెహోవాకు ఏమి పుట్టించెను?
ⓐ అసహ్యము
ⓑ కోపము
ⓒ క్రోధము
ⓓ ఏహ్యత
4. ఆహాబు మరణమైన తర్వాత ఎవరు ఇశ్రాయేలీయుల మీద తిరుగబడిరి?
ⓐ ఆమోరీయులు
ⓑ అమ్మోనీయులు
ⓒ కనానీయులు
ⓓ మోయాబీయులు
5. అహజ్యా షోమ్రోనులో నున్న ఎక్కడ కిటికి నుండి క్రిందపడి రోగియాయెను?
ⓐ పడకగది
ⓑ మెట్లగది
ⓒ మేడగది
ⓓ వెనుకగది
6. ఆ వ్యాధిని పోగొట్టుకొని స్వస్థతపడుదునేమో అని అహజ్యా ఎవరి యొద్ద విచారించుటకు తన దూతలను పంపెను?
ⓐ దాగోను దేవత
ⓑ ఎక్రోను దేవత
ⓒ గాదు దేవత
ⓓ ఆహూష్టా దేవత
7. ఎక్రోను దేవత పేరేమిటి?
ⓐ యెజెబెలు
ⓑ అతల్యా
ⓒ బయెల్టెబూబు
ⓓ దాగోను
8. అహజ్యా విషయమై యెహోవా ఎవరికి ప్రత్యక్షమయ్యెను?
ⓐ అనాతోతు
ⓑ ఎలీషా
ⓒ యెహు
ⓓ ఏలీయా
9. ఏలీయా షోమ్రోనురాజు పంపిన దూతలను ఏమి చేసెను?
ⓐ కనుగోనెను
ⓑ పారద్రోలెను
ⓒ ఎదుర్కొనెను
ⓓ చెదరగొట్టెను
10. ఎవరి వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత యొద్ద విచారించబోవుచున్నారా అని ఏలీయా దూతలతో అనెను?
ⓐ పితరుల
ⓑ ప్రధానుల
ⓒ పూర్వికుల
ⓓ ఇశ్రాయేలుల
11. ఎక్కడ నుండి దిగి రాకుండ నిశ్చయముగా మరణమవుదువని ఏలీయా అహజ్యా గూర్చి దూతలతో చెప్పి వెళ్ళిపోయెను?
ⓐ మేడమీద
ⓑ మెట్లమీద
ⓒ మంచము
ⓓ అంతస్తు
12. దూతల ద్వారా ఏలీయా చెప్పిన మాటలు విన్న అహజ్యా ఏలీయా యొద్దకు ఎవరిని పంపెను?
ⓐ అధిపతిని
ⓑ ప్రధానిని
ⓒ పెద్దలను
ⓓ బంధువులను
13. అహజ్యా పంపినవాడు ఎంతమంది మీద అధిపతి?
ⓐ వంద
ⓑ ఇరువది
ⓒ యేబది
ⓓ ముప్పది
14. ఆ యేబదిమందితో వెళ్ళిన అధిపతి ఏలీయాను ఏమని పిలిచి క్రిందకు దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను?
ⓐ దైవజనుడా
ⓑ ప్రవక్తా
ⓒ దీర్ఘదర్శి
ⓓ దైవసేవకూడా
15. నేను దైవజనుడనైతే అగ్ని ఎక్కడ నుండి దిగివచ్చి, నిన్ను యాబదిమందిని దహించును గాక అని ఏలీయా అధిపతితో అనెను?
ⓐ అరణ్యము
ⓑ పొదలలో
ⓒ కొండలలో
ⓓ ఆకాశము
Result:
0 out of 15