Bible Quiz in Telugu Topic wise: 153 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఆశ్చర్యం" అనే అంశము పై బైబిల్ క్విజ్)

1. ప్రాకారముగల పట్టణములో యెహోవా దేనిని "ఆశ్చర్యకరము" గా చూపియున్నాడు?
ⓐ తన మహిమను
ⓑ తన క్రియలను
ⓒ తన కృపను
ⓓ తన ప్రేమను
2. అధికారులు, శాస్త్రులు ఎవరి ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి "ఆశ్చర్యపడిరి"?
ⓐ యాకోబు, పేతురు
ⓑ పేతురు, యోహాను
ⓒ అంద్రెయ ఫిలిప్పు
ⓓ తోమా, సీమోను
3. ఐగుప్తుదేశములోని దేనియందు ఇశ్రాయేలీయుల పితరులు చూచుచుండగా యెహోవా "ఆశ్చర్యకార్యము"లను చేసెను?
ⓐ సోయరు క్షేత్రమందు
ⓑ గోషెను క్షేత్రమందు
ⓒ సోయను క్షేత్రమందు
ⓓ పత్రోసు క్షేత్రమందు
4. యోహాను - సహోదరులారా, ఏది మిమ్మును ద్వేషించిన యెడల "ఆశ్చర్య"పడకుడి?
ⓐ లోకము
ⓑ సాతాను
ⓒ వాక్యము
ⓓ పాపము
5. యెహోవా, ఏది నీ "ఆశ్చర్యకార్యము"లను స్తుతించుచున్నది?
ⓐ ఆకాశవైశాల్యము
ⓑ భూమి విశాలము
ⓒ పాతాళఅగాధము
ⓓ జల ప్రవాహము
6. దేవుడు "ఆశ్చర్యము"గా ఏ ధ్వని చేయును?
ⓐ నీటి
ⓑ అగ్ని
ⓒ వాయువు
ⓓ ఉరుము
7. యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన "ఆశ్చర్య"క్రియలును మాయెడల నీకున్న తలంపులును ఏమైయున్నవి?
ⓐ బహు విస్తారములు
ⓑ బహు హేయములు
ⓒ బహు స్వల్పములు
ⓓ బహు ఘోరములు
8. నేను నీ ధర్మశాస్త్రమునందు "ఆశ్చర్యమైన" వేటిని చూచునట్లు నా కన్నులు తెరువుము?
ⓐ సంగతులను
ⓑ శకునములను
ⓒ కార్యములను
ⓓ యుద్ధములను
9. ఎవరు స్థిరపడువరకు దేవుడు అతనికి "ఆశ్చర్య"కరమైన సహాయము కలిగించెను?
ⓐ ఆహాజు
ⓑ ఉజ్జియా
ⓒ దావీదు
ⓓ హిజ్కియా
10. చీకటిలోనుండి "ఆశ్చర్యకరమైన" తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని యొక్క వేటిని ప్రచురముచేయు నిమిత్తము మిమ్మును ఏర్పరచుకొనెను?
ⓐ గుణాతిశయములను
ⓑ లోకాశాలను
ⓒ ప్రభావములను
ⓓ దురద్దేశములను
11. ఎవరు దేవుని "ఆశ్చర్య"కార్యములను వివరించుదురు?
ⓐ నరులు
ⓑ దూతలు
ⓒ ద్రోహులు
ⓓ వైరులు
12. ఎవరు ఇంకను పాపము చేయుచు దేవుని "ఆశ్చర్య" కార్యములను బట్టి ఆయనను నమ్ము కొనకపోయిరి?
ⓐ ఇశ్రాయేలియులు
ⓑ రోమియులు
ⓒ కానానీయులు
ⓓ అర్కీయులు
13. ఎవరు లేకుండుట చూచి యెహోవా "ఆశ్చర్య"పడెను?
ⓐ యాజకుడు
ⓑ న్యాయాధిపతి
ⓒ మధ్యవర్తి
ⓓ బలవంతుడు
14. యెహోవా తన "ఆశ్చర్య" కార్యములకు దేనిని నియమించియున్నాడు?
ⓐ జ్ఞాపకార్ధ సూచనను
ⓑ ధర్మశాస్త్రమును
ⓒ జ్ఞాపకార్ధ గ్రంధమును
ⓓ అధికారమును
15. మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఎవరు యొక "ఆశ్చర్య"కార్యము చేసెను?
ⓐ అమ్మోనీయులు
ⓑ న్యాయాధిపతులు
ⓒ యెహోవా దూత
ⓓ ఎఫ్రాయిమీయులు
Result:
0 out of 15