,2➤ గాడిదమీద యెరూషలేములోకి యేసు ప్రవేశించడాన్ని గురించి ఏ ప్రవక్త ప్రవచించాడు?
,3➤ యెరూషలేము దేవాలయంలో క్రయ విక్రయాలు చేసేవారి బల్లలను పడగొట్టింది ఎవరు?
,4➤ మందిరాన్ని పవిత్రపరచిన తరువాత యేసు ఎక్కడికి వెళ్ళాడు?
,5➤ 'కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా' అని యేసును అడిగింది ఎవరు?
,6➤ పునరుత్థానం లేదని ఎవరు నమ్మారు?
,7➤ యేసు ఎవరు అనే దాని గురించి పరిసయ్యులు ఏమి చెప్పారు?
,8➤ విందులలో అగ్రస్థానాలు, సమాజమందిరాల్లో అగ్రపీఠాలు, సంత వీధులలో వందనాలు' ఆశించేది ఎవరు?
,9➤ దేవుని బిడ్డలకు నాయకుడు ఎవరు?
,10➤ పరలోక రాజ్యంలోకి ప్రవేశించకుండా, ఇతరులను ప్రవేశించకుండా చేసేది ఎవరు?
,11➤ పొడగాటి ప్రార్థనలు చేసేదెవరు?
,12➤ ఒక వ్యక్తిని మతంలోకి కలుపుకోవడానికి సముద్రాన్ని, భూమిని చుట్టి వచ్చేది ఎవరు?
,13➤ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు ఏవి?
,14➤ 'సున్నము కొట్టిన సమాధులు' అని యేసు ఎవరిని పిలిచాడు?
,15➤ దేవాలయానికి బలిపీఠానికి మధ్య చంపబడింది ఎవరు?
,16➤ 'రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయ బడును' అని ఎవరు చెప్పారు?
,17➤ యేసు రాకడనుగురించి, యుగసమాప్తికి సంబంధించిన సూచనల గురించి శిష్యుల ప్రశ్నలకు జవాబివ్వడానికి యేసు ఏ కొండమీద కూర్చొన్నాడు?
,18➤ పరిశుద్ధ స్థలంలో నిలబడిన నాశనకరమైన హేయ వస్తువును గురించి ఎవరు ప్రవచించారు?
,19➤ పీనుగ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎలాంటి పక్షులు పోగవుతాయి?
,20➤ ఒక చెట్టునుండి నేర్చుకొమ్మని యేసు చెప్పాడు. ఆ చెట్టు ఏమిటి?
,21➤ యేసుప్రభువు రెండవ రాకడ గురించి ఎవరికి తెలుసు?
,22➤ ప్రభువు రాకడ సమయంలో ఎవరి దినాలవలె రోజులు ఉంటాయి?
,23➤ తమకోసం తలుపులు తీయమని ప్రభువును ఎవరు అడిగారు?
,24➤ తన సమస్త దూతలతో మనుష్యకుమారుడు మహిమతో వచ్చినప్పుడు ఆయన ఎక్కడ కూర్చుంటాడు?
,25➤ క్రీస్తుకు కుడివైపున ఉన్నవారికి వచ్చే ప్రతిఫలం ఏమిటి?
,26➤ సింహాసనానికి ఎడమ ప్రక్కన ఉన్నవారు పొందుకొనే శిక్ష ఏమిటి?
,27➤ అపవాదికి, వాని దూతలకు సిద్ధపరచబడినది ఏమిటి?
,28➤ యేసుకు విరోధంగా ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు ఎక్కడ కూడుకొన్నారు?
,29➤ కుష్టరోగియైన సీమోను ఇల్లు ఎక్కడ ఉంది?
,30➤ ఏ కుష్టరోగి ఇంట్లో యేసు భోజనం చేశాడు?
,31➤ ఎవరి ఇంట్లో ఒక స్త్రీ యేసువద్దకొచ్చి ఆయన తలమీద అత్తరును కుమ్మరిం చింది?
,32➤ ఈ లోకంలో సువార్త ప్రకటించబడినప్పుడెల్లా ఎవరి పేరు ప్రశంసించ బడుతుంది?
,33➤ 'నేనాయనను మీకప్పగించిన యెడల నాకేమి ఇత్తురని' యూదా ఎవరితో అన్నాడు?
,34➤ ఎన్ని వెండి నాణేలకు యేసు ప్రధానయాజకులకు అప్పగించబడ్డాడు?
,35➤ గురువును అమ్మిన శిష్యుని పేరేమిటి?
,36➤ 'ఆ మనుష్యుడు పుట్టి యుండనియెడల వానికి మేలు'. ఎవరు ఆ వ్యక్తి?
,37➤ చివరి భోజనం తరువాత యేసు, అతని శిష్యులు ఎక్కడికి వెళ్ళారు?
,38➤ అనేకుల పాపక్షమాపణ నిమిత్తం కార్చబడిన యేసు రక్తం దేనికి సాదృశ్యం?
,39➤ యేసు సిలువ వేయబడక ముందు చివరిసారిగా ఎక్కడ ప్రార్థించాడు?
,40➤ తన పునరుత్థానం తరువాత తన శిష్యులకంటే ముందుగా యేసు ఎక్కడికి వెళ్ళాడు?
,41➤ 'ఈ రాత్రి కోడికూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవు' అని యేసు ఎవరితో చెప్పాడు?
,42➤ యేసును మూడుసార్లు ఎరుగనని చెప్పిందెవరు?
,43➤ 'నేను నీతో కూడ చావవలసి వచ్చినను, నిన్ను ఎరుగననను' అని ఏ శిష్యుడు చెప్పాడు?
,44➤ శరీరం బలహీనంగా ఉన్నప్పుడు ఏది సిద్ధంగా ఉంది?
,45➤ యేసును పట్టుకోవడానికి యూదా ఇచ్చిన గుర్తు ఏమిటి?
,46➤ యేసును అప్పగించినప్పుడు యూదా ఆయన్ని ఏమని పిలిచాడు?
,47➤ 'చెలికాడా, నీవు చేయ వచ్చినది చేయుము' అని యేసు ఎవరితో చెప్పాడు?
,48➤ ప్రధాన యాజకుని దాసుని చెవి కోసిందెవరు?
,49➤ ఏ ప్రధాన యాజకునివద్దకు యేసును తీసుకెళ్ళారు?
,50➤ ప్రధాన యాజకుని ఇంటి ముంగిటవరకు దూరంనుండి యేసును బడించిన శిష్యుడు ఎవరు?
,51➤ యేసు తీర్పు చివరికి ఏమవుతుందో చూడాలని సైనికులతో కూర్చొన్నదెవరు?
,52➤ ఒకవేళ యేసు దేవుని కుమారుడైతే చెప్పుమని జీవంగల దేవుని తోడని ఆనబెట్టింది ఎవరు?
,53➤ ఆకాశ మేఘారూఢుడై ఎవరు వస్తారు?
,54➤ కోడి కూసిన వెంటనే ఎవరు ఏడ్చారు?
,55➤ యేసు సిలువవేయబడిన కాలంలో ఉన్న అధిపతి ఎవరు?
,56➤ యేసును శిక్షించడానికి ప్రధాన యాజకుడు ఆయన్ని ఎవరికి అప్పగించాడు?
,57➤ యేసుకు శిక్ష విధించబడడం చూసి పశ్చాత్తాపపడింది ఎవరు?
,58➤ 'నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితిని' అని ఎవరు చెప్పారు?
,59➤ యూదా వెండి నాణేలను ఎక్కడ పారవేశాడు?
,60➤ క్రొత్త నిబంధనలో తనకు తాను ఉరి పెట్టుకొన్నది ఎవరు?
,61➤ రక్తపు పొలాన్ని గురించి ఎవరు ప్రవచించారు?
,62➤ “యూదుల రాజువు నీవేనా?” అని యేసును అడిగింది ఎవరు?
,63➤ యేసువలన కలలో మిక్కిలి బాధపడింది ఎవరు?
,64➤ 'నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు' అని యేసు గురించి పిలాతుతో చెప్పింది ఎవరు?
,65➤ జన సమూహం ఎదుట నీళ్ళు తీసుకొని తన చేతులను కడుక్కొన్న అధిపతి ఎవరు?
,66➤ 'ఈ నీతిమంతుని రక్తమునుగూర్చి నేను నిరపరాధిని' అని జన సమూహంతో ఎవరు చెప్పారు?
,67➤ యేసుకు బదులు ఎవరు విడుదలైనారు?
,68➤ యేసు వస్త్రాలను తీసివేసిన తరువాత ఆయనకు ఏమి తొడిగించారు?
,69➤ యేసు సిలువను మోయుమని ఎవరిని బలవంతం చేశారు?
,70➤ యేసును ఎక్కడ సిలువ వేశారు?
,71➤ 'గొలౌతా' పేరుకు అర్థం ఏమిటి?
,72➤ చేదు కలిపిన ద్రాక్షారసాన్ని యేసుకి ఎక్కడిచ్చారు?
,73➤ యేసు సిలువపైన ఏమి వ్రాయబడింది?
,74➤ సిలువ మీదున్నప్పుడు యేసు ఏమని బిగ్గరగా కేక వేశాడు?
,75➤ 'ఏలీ, ఏలీ, లామా సబక్తానీ' అనే మాటకు అర్థం ఏమిటి?
,76➤ ఏలీ ఏలీ అని యేసు సిలువ మీద మొరపెడుతున్నప్పుడు ప్రజలు ఏమని భావించారు?
,77➤ దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చీలింది ఎప్పుడు?
,78➤ ఎవరు మరణించినప్పుడు నిద్రించిన అనేకమంది పరిశుద్ధుల శరీరాలు లేచాయి?
,79➤ యేసు గురించి శతాధిపతి ఏమని చెప్పాడు?
,80➤ ధనవంతుడైన యేసు శిష్యుడెవరు?
,81➤ సమాధిచేయడానికి యేసు మృతదేహం కోసం పిలాతును ఎవరు అడిగారు?
,82➤ రాతిలో తొలిపించబడిన క్రొత్త సమాధిలో యేసు దేహం ఉంచబడింది. ఆ సమాధి ఎవరిది?
,83➤ యేసు ఒక వంచకుడని ఎవరు చెప్పారు?
,84➤ యేసు సమాధిని భద్రం చేయడానికి కావలివారిని ఎవరు నియమించారు?
,85➤ సమాధి ద్వారంలో ఉన్న రాయిని దొర్లించింది ఎవరు?
,86➤ ఆదివారంనాడు ఎవరు యేసు సమాధివద్దకు వచ్చారు?
,87➤ ఎక్కడికి శిష్యులు వెళ్ళాలని యేసు స్త్రీలతో చెప్పాడు?
,88➤ ఎవరి నామంలో బాప్తిస్మాన్నివ్వాలి?
,89➤ సర్వాధికారం ఎవరికి ఇవ్వబడింది?