Telugu Bible Trivia on Matthew

Telugu bible Trivia on Matthew

1➤ క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకం ఏది?

2➤ మత్తయి సువార్తలో ఎన్ని అధ్యాయాలున్నాయి?

3➤ మత్తయి సువార్తకు మూల వచనం ఏది?

4➤ మత్తయికుగల మరో పేరు ఏమిటి?

5➤ యేసు వంశావళిలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు?

6➤ యేసు వంశావళిలోగల స్త్రీల పేర్లు ఏవి?

7➤ ఓబేదు తల్లిదండ్రులు ఎవరు?

8➤ యేసు తల్లి ఎవరు?

9➤ యేసు తండ్రి ఎవరు?

10➤ ప్రభువుదూత ఎవరికి కలలో కనబడ్డాడు?

11➤ తన ప్రజలను వారి పాపంనుండి రక్షించేది ఎవరు?

12➤ ఇమ్మానుయేలు పేరుకు అర్థం ఏమిటి?

13➤ ఏ రాజు కాలంలో యేసుక్రీస్తు జన్మించాడు?

14➤ ఎవరికి నక్షత్రం నడిపించే మార్గదర్శిగా మారింది?

15➤ యేసుకు జ్ఞానులు ఏ కానుకలను సమర్పించారు?

16➤ నక్షత్రాన్ని చూసిన కాలాన్ని గురించి జ్ఞానులను అడిగి తెలుసుకొన్నదెవరు?

17➤ నక్షత్రాన్ని చూసినప్పుడు అత్యానందభరితులైన వారు ఎవరు?

18➤ ఒక రాజుకు భయపడి తమ ప్రాణాలకోసం యోసేపు, మరియ, బాలయేసు పారిపోయారు. ఆ రాజు ఎవరు?

19➤ బాలయేసుతో యోసేపు, మరియలు ఎక్కడికి పారిపోయారు?

20➤ తన తండ్రి స్థానంలో యూదయ దేశాన్ని పాలిస్తున్నదెవరు?

21➤ ఐగుప్తునుండి వచ్చిన తరువాత యేసు ఎక్కడ జీవించాడు?

22➤ నజరేతు ఊరు ఎక్కడ ఉంది?

23➤ మారుమనస్సు గురించి మొదట ప్రసంగించింది ఎవరు?

24➤ బాప్తిస్మమిచ్చే యోహాను ప్రసంగ అంశం ఏమిటి?

25➤ 'పరలోక రాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడి' అని ఎవరు ఎవరితో చెప్పారు?

26➤ ప్రభువుకు మార్గం సిద్ధపరచడానికి లోకానికి వచ్చిందెవరు?

27➤ బాప్తిస్మమిచ్చు యోహాను గురించి ఎవరు ప్రవచించారు?

28➤ బాప్తిస్మమిచ్చు యోహాను ఆహారం ఏమిటి?

29➤ బాప్తిస్మమిచ్చు యోహాను వస్త్రాలు ఏమిటి?

30➤ మొదటి బాప్తిస్మ ఆరాధనను ఎవరు నిర్వహించారు?

31➤ బాప్తిస్మమిచ్చు యోహాను ప్రజలకు బాప్తిస్మం ఎక్కడ ఇచ్చాడు?

32➤ 'మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి' అని ఎవరు చెప్పారు?

33➤ మారుమనస్సు నిమిత్తం నీళ్ళతో బాప్తిస్మం ఇచ్చింది ఎవరు?

34➤ యేసు ఇచ్చే బాప్తిస్మం ఎలాంటిది?

35➤ బాప్తిస్మం పొందుకోవడానికి యేసు ఎక్కడినుండి వచ్చాడు?

36➤ 'ఆయనచేట ఆయన చేతిలో ఉంది'. ఎవరి చేతిలో?

37➤ యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఎవరిచ్చారు?

38➤ ఎవరి బాప్తిస్మంలో దేవుని ఆత్మ పావురంవలె దిగి వచ్చాడు?

39➤ ఏ రూపంలో దేవుని ఆత్మ యేసుక్రీస్తు మీదికి దిగి వచ్చాడు?

40➤ అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడింది ఎవరు?

41➤ తన బాప్తిస్మం తరువాత ఉపవాసం చేయడానికి యేసు ఎక్కడికి వెళ్ళాడు?

42➤ నలభై రాత్రింబగళ్లు ఉపవాస ప్రార్థన చేసిందెవరు?

43➤ అపవాది యేసును విడిచిపెట్టిన తరువాత ఆయనకు ఎవరు పరిచర్య చేశారు?

44➤ బాప్తిస్మమిచ్చు యోహానును చెరసాలలో వేసినప్పుడు యేసు ఎక్కడ ఉన్నాడు?

45➤ 'మరణ ప్రదేశములోను, మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను' అని ఎవరు ప్రవచించారు?

46➤ యేసు పేతురును ఎక్కడ కలుసుకొన్నాడు?

47➤ పేతురుకుగల మరో పేరు ఏమిటి?

48➤ యేసువద్దకు మొదట వచ్చిన శిష్యుడు ఎవరు?

49➤ జెబెదయి కుమారులు ఎవరు?

50➤ యాకోబు సహోదరుడు ఎవరు?

51➤ యాకోబు యోహానుల తండ్రి ఎవరు?

52➤ గలిలయ సమాజ మందిరంలో యేసు దేనిగురించి బోధించాడు?

53➤ భూలోకాన్ని ఎవరు స్వతంత్రించుకొంటారు?

54➤ ఎవరు దేవున్ని చూస్తారు?

55➤ సమాధానపరచువారికి ఇవ్వబడిన పేరు ఏమిటి?

56➤ 'మీరు లోకమునకు ఉప్పయి యున్నారు' అని ఎవరు చెప్పారు?

57➤ లోకంలో దేవుని కుమారులు ఎవరు?

58➤ ఎవరి నీతికంటే దేవుని ప్రజల నీతి అధికముగా ఉండాలి?

59➤ తన సహోదరునిమీద కోపపడితే ఏమి జరుగుతుంది?

60➤ తన సహోదరుని వ్యర్ధుడా అని పిలిచినందుకు వచ్చే శిక్ష ఏమిటి?

61➤ ఎవరితో త్వరగా సమాధానపడాలి?

62➤ దేవుని సింహాసనం ఎక్కడ ఉంది?

63➤ దేవుని పాదపీఠం ఏది?

64➤ మహారాజైన దేవుని పట్టణం ఏది?

65➤ మంచివారికి, చెడ్డవారికి దేవుడు ఏమి ఇస్తున్నాడు?

66➤ మన పరలోక తండ్రి ఎలా ఉన్నాడు?

67➤ మనుష్యులకు కనబడవలెనని వారియెదుట ఏమి చేయకుండా చూసుకోవాలి?

68➤ యేసుబోధ ప్రకారం ధర్మం ఎలా చేయాలి?

69➤ మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎవరివలె ఉండవద్దు?

70➤ ఉపవాసం చేయునప్పుడు విచారంగా ముఖాన్ని పెట్టేది ఎవరు?

71➤ ఎక్కడ ధనాన్ని కూర్చుకోవద్దు?

72➤ 'చిమ్మటయైనను, తుప్పైనను దాని తినివేయదు. దొంగలు కన్నమువేసి దొంగి లరు'. ఆ స్థలం పేరేమిటి?

73➤ నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే ఏమి ఉంటుంది?

74➤ దేహానికి దీపము ఏమిటి?

75➤ విత్తకుండా కోయకుండా జీవించేవి ఏమిటి?

76➤ కష్టపడకుండా, ఒడకకుండా అందంగా ఉండేవి ఏమిటి?

77➤ ఏ రాజు వైభవం అడవి పువ్వులతో పోల్చబడింది?

78➤ మనం మొదట దేన్ని వెదకాలి?

79➤ తీర్పు తీర్చబడకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

80➤ దేనియెదుట ముత్యాలను వేయకూడదు?

81➤ పరిశుద్ధమైనది ఏ జంతువుకు పెట్టవద్దు?

82➤ ఏమార్గం వెడల్పుగా, విశాలంగా ఉంది?

83➤ జీవానికి పోవు ద్వారం ఎలా ఉంది?

84➤ తమకుమారులకు చెడ్డ తండ్రులు ఎలాంటి ఈవులను ఇవ్వాలని ఇష్టపడుతారు?

85➤ గొర్రెల వస్త్రాలు వేసుకొనే తోడేళ్ళు ఎవరు?

86➤ పరలోక రాజ్యంలోకి ఎవరు ప్రవేశిస్తారు?

87➤ బుద్ధిమంతుడు ఎవరు?

88➤ బుద్ధిమంతుడు తన ఇంటిని ఎక్కడ కట్టుకొంటాడు?

89➤ యేసు ఎలా బోధించాడు?

90➤ యాజకునికి తన్నుతాను కనుపరచుకొమ్మని యేసు ఎవరితో చెప్పాడు?

91➤ తన ఇంట్లోకి యేసు రావడానికి తాను పాత్రుడు కాదని ఎవరు చెప్పారు?

92➤ విశ్వాస విషయంలో యేసు ఎవరిని బాగా మెచ్చుకొన్నాడు?

93➤ పేతురు అత్తగారి రోగం ఏమిటి?

94➤ ఎవరి అత్తగారి రోగాన్ని యేసు స్వస్థపరిచాడు?

95➤ 'నక్కలకు బొరియలును, ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు' అని ఎవరు ఎవరితో చెప్పారు?

96➤ మృతులను పాతి పెట్టేది ఎవరు?

97➤ సమాధుల్లోనుండి దయ్యములు పట్టిన ఇద్దరు వ్యక్తులు రావడం యేసు ఎక్కడ చూశాడు?

98➤ 'ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి?' అని ఎవరు చెప్పారు?

99➤ యేసు స్వంత పట్టణం ఏది?

100➤ 'కుమారుడా, ధైర్యముగా ఉండుము' అని యేసు ఎవరితో చెప్పాడు?

101➤ పాపాన్ని క్షమించే అధికారం ఎవరికి ఉంది?

102➤ యేసు శిష్యునిగా మారిన సుంకరి పేరు ఏమిటి?

103➤ 'రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర లేదుగదా?' అని ఎవరితో ఎవరు చెప్పారు?

104➤ పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలం దుఃఖపడాల్సిన అవసరం ఎవరికి లేదు?

105➤ యేసు వస్త్రపు చెంగును తాకి స్వస్థపడింది ఎవరు?

106➤ ఎవరి కూతురును యేసు మరణం నుండి లేపాడు?

107➤ మత్తయి సువార్తలోమాత్రమే పేర్కొనబడిన రెండు అద్భుతాలు ఏవి?

108➤ 'కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు' అని ఎవరితో ఎవరు చెప్పారు?

109➤ యేసుకు ఎంతమంది శిష్యులున్నారు?

110➤ అపొస్తలులలో మొదటి వ్యక్తి ఎవరు?

111➤ అపొస్తలుడయిన అల్ఫయి కుమారుడు ఎవరు?

112➤ యేసును అప్పగించిన యూదా స్వస్థలం ఏది?

113➤ ఏ పట్టణంలోకి శిష్యులు ప్రవేశించలేదు?

114➤ దేవుని బిడ్డలు దేనివలె వివేకంగా ఉండాలి?

115➤ నిష్కపటమైనదిగా పేర్కొనబడిన పక్షి ఏది?

116➤ ఏ పక్షులకంటే ఎక్కువగా దేవుని బిడ్డలు శ్రేష్టులు?

117➤ యేసును వెంబడించాలంటే ఒకరు ఏమి ఎత్తుకోవాలి?

118➤ 'రాబోవువాడవు నీవేనా, మేము మరియొకనికొరకు కనిపెట్టవలెనా?' అని యేసును అడిగింది ఎవరు?

119➤ ప్రవక్తకంటే గొప్పవాడు ఎవరు?

120➤ స్త్రీలు కనినవారిలో ఎవరు గొప్పవాడు?

121➤ ఎవరి కాలంవరకు ధర్మశాస్త్రం ప్రవచిస్తూ వచ్చింది?

122➤ మారుమనస్సు పొందనందుకు యేసుక్రీస్తుచేత శపించబడిన పట్టణములు ఏవి?

123➤ ఏ పట్టణం పాతాళానికి దిగిపోతుంది?

124➤ సాత్వికుడు, దీనమనస్సుగలవాడు ఎవరు?

125➤ ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులు యేసువద్దకు వస్తే వారు ఏమి పొందుకొంటారు?

126➤ ఎవరికి ఆకలివేసి వెన్నులు త్రుంచి తిన్నారు?

127➤ ఆకలి వేసినప్పుడు తినకూడని సముఖపు రొట్టెలను తిన్నదెవరు?

128➤ దేవాలయంకంటే గొప్పవాడు ఎవరు?

129➤ విశ్రాంతి దినానికి ప్రభువు ఎవరు?

130➤ విశ్రాంతి దినాన సమాజమందిరంలో యేసు ఎవరిని స్వస్థపరిచాడు?

131➤ యేసుమాటల ప్రకారం విశ్రాంతి నాడు ఏమి చేయటం ధర్మం?

132➤ దయ్యాలకు అధిపతి పేరు ఏమిటి?

133➤ ఏవిధమైన దూషణ క్షమించబడదు?

134➤ చెట్టు ఎలా గుర్తించబడుతుంది?

135➤ ఏది నిండియుండు దాన్నిబట్టి నోరు మాట్లాడుతుంది?

136➤ వ్యభిచారులైన చెడ్డ తరానికి ఏ ప్రవక్త సూచక క్రియ ఇవ్వబడింది?

137➤ వ్యభిచారులైన చెడ్డ తరానికి ఎవరు తీర్పు తీరుస్తారు?

138➤ యోనాకంటే గొప్ప ప్రవక్త ఎవరు?

139➤ యేసుతల్లి, సహోదరులు, సహోదరీలు ఎవరు?

140➤ పడవలో కూర్చొని యేసు చెప్పిన మొదటి ఉపమానం ఏది?

141➤ ఏ నేలమీద పడ్డ విత్తనం వెంటనే మొలిచింది?

142➤ పరలోక రాజ్య మర్మములు తెలుసుకొనే భాగ్యం ఎవరికి ఇవ్వబడింది?

143➤ దుష్టుడు వచ్చి హృదయంలోనుండి దేన్ని ఎత్తుకొని పోతాడు?

144➤ శత్రువు ఏమి విత్తాడు?

145➤ ఆకాశపక్షులు వచ్చి గూడు కట్టుకొన్న చెట్టు పేరు ఏమిటి?

146➤ పులిసిన పిండి దేనితో పోల్చబడింది?

147➤ పొలం అర్థం ఏమిటి?

148➤ మంచి విత్తనాలను విత్తింది ఎవరు?

149➤ మంచి విత్తనం దేనికి సాదృశ్యం?

150➤ నీతిమంతులు ఎవరివలె తేజరిల్లుతారు?

151➤ యేసు సోదరులు ఎవరు?

152➤ తన స్వంత పట్టణంలో యేసు అనేక అద్భుతాలు చేయలేకపోయాడు. ఎందుకు?

153➤ యేసు కాలంలో చతుర్జాతిపతి ఎవరు?

154➤ చతుర్థాతిపతియైన హేరోదు సోదరుడు ఎవరు?

155➤ ఫిలిప్పు భార్య ఎవరు?

156➤ బాప్తిస్మమిచ్చు యోహానును చెరసాలలో బంధించింది ఎవరు?

157➤ హేరోదు జన్మదినంనాడు ప్రజల ముందు నాట్యం చేసిందెవరు?

158➤ బాప్తిస్మమిచ్చు యోహాను తలను నరకమని ప్రేరేపించింది ఎవరు?

159➤ సత్యాన్ని ప్రకటించినందుకు శిరచ్ఛేదనం చేయబడినది ఎవరు?

160➤ బాప్తిస్మమిచ్చు యోహాను శవాన్ని ఎవరు పాతి పెట్టారు?

161➤ ఐదురొట్టెలు, రెండు చేపలతో యేసు ఎక్కడ బహుజన సమూహాన్ని పోషించాడు?

162➤ ఏ సముద్రంలో యేసు నీళ్ళమీద నడిచాడు?

163➤ నీళ్ళమీద నడిచింది ఎవరు?

164➤ యేసుతో నీళ్ళమీద నడిచింది ఎవరు?

165➤ 'అల్ప విశ్వాసీ' అని యేసు ఎవరిని పిలిచాడు?

166➤ యేసును ముట్టినవారందరూ స్వస్థపడిన స్థలం పేరు ఏమిటి?

167➤ తల్లిదండ్రులను దూషించువాడు పొందే శిక్ష ఏమిటి?

168➤ “పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు' అని ఎవరు ఎవరితో చెప్పారు?

169➤ 'నీ విశ్వాసం గొప్పది' అని ఎవరితో యేసు చెప్పాడు?

170➤ ఆకాశంనుండి ఒక సూచక క్రియను చూపమని ఎవరు అడిగారు?

171➤ 'నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు' అని యేసు గురించి ఎవరు చెప్పారు?

172➤ పేతురు తండ్రి ఎవరు?

173➤ సంఘానికి వ్యవస్థాపకుడు (నిర్మాణకుడు) ఎవరు?

174➤ 'నా సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములు దానియెదుట నిలువ నేరవు' అని ఎవరు చెప్పారు?

175➤ పేతురుకు యేసు ఏ అధికారాన్ని ఇచ్చాడు?

176➤ 'సాతానా, నా వెనుకకు పొమ్ము' అని ఎవరిని యేసు గద్దించాడు?

177➤ రూపాంతర కొండమీద యేసుతో పాటు ఎవరు ఉన్నారు?

178➤ రూపాంతర కొండమీద కనబడిన ప్రవక్తల పేర్లు ఏమిటి?

179➤ 'నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని' యేసుతో ఎవరు చెప్పారు?

180➤ శిష్యులచేత స్వస్థపడని రోగి ఎవరు?

181➤ 'మనుష్య కుమారుడు మనుష్యులచేతికి అప్పగింపబడబోవుచున్నాడు' అని ఏ స్థలంలో యేసు చెప్పాడు?

182➤ ఏ ప్రాంతంలో పన్ను వసూలు చేయువారు యేసువద్దకు వచ్చారు?

183➤ చేప కడుపులో ఎంత డబ్బు దొరికింది?

184➤ పన్ను కట్టడానికి సముద్రంలో గాలం వేసిన యేసు శిష్యుడు ఎవరు?

185➤ ఎవరి మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడటం మేలు?

186➤ యేసు మాటల ప్రకారం, మనం ఎన్నిసార్లు మన సహోదరులను క్షమించాలి?

187➤ పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిన తరువాత ఎవరిని హత్తుకొంటాడు?

188➤ 'దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు' అని ఎవరు చెప్పారు?

189➤ పన్నెండు గోత్రాలకు ఎవరు తీర్పు తీరుస్తారు?

190➤ జెబెదయి కుమారుల తల్లి ఎవరు?

191➤ తన రాజ్యంలో ఒక కుమారున్ని యేసు కుడివైపున, మరో కుమారున్ని యేసు ఎడమ ప్రక్కన కూర్చోబెట్టమని యేసుని అడిగిన స్త్రీ ఎవరు?

192➤ ఒక గాడిదను తెమ్మని యేసు తన శిష్యులను ఎక్కడనుండి పంపాడు?

193➤ ఏ స్థలానికి చెందిన ప్రవక్తగా యేసు గుర్తించబడ్డాడు?

194➤ గాడిదమీద యెరూషలేములోకి యేసు ప్రవేశించడాన్ని గురించి ఏ ప్రవక్త ప్రవచించాడు?

195➤ యెరూషలేము దేవాలయంలో క్రయ విక్రయాలు చేసేవారి బల్లలను పడగొట్టింది ఎవరు?

196➤ మందిరాన్ని పవిత్రపరచిన తరువాత యేసు ఎక్కడికి వెళ్ళాడు?

197➤ 'కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా' అని యేసును అడిగింది ఎవరు?

198➤ పునరుత్థానం లేదని ఎవరు నమ్మారు?

199➤ యేసు ఎవరు అనే దాని గురించి పరిసయ్యులు ఏమి చెప్పారు?

200➤ విందులలో అగ్రస్థానాలు, సమాజమందిరాల్లో అగ్రపీఠాలు, సంత వీధులలో వందనాలు' ఆశించేది ఎవరు?

201➤ దేవుని బిడ్డలకు నాయకుడు ఎవరు?

202➤ పరలోక రాజ్యంలోకి ప్రవేశించకుండా, ఇతరులను ప్రవేశించకుండా చేసేది ఎవరు?

203➤ పొడగాటి ప్రార్థనలు చేసేదెవరు?

204➤ ఒక వ్యక్తిని మతంలోకి కలుపుకోవడానికి సముద్రాన్ని, భూమిని చుట్టి వచ్చేది ఎవరు?

205➤ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు ఏవి?

206➤ 'సున్నము కొట్టిన సమాధులు' అని యేసు ఎవరిని పిలిచాడు?

207➤ దేవాలయానికి బలిపీఠానికి మధ్య చంపబడింది ఎవరు?

208➤ 'రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయ బడును' అని ఎవరు చెప్పారు?

209➤ యేసు రాకడనుగురించి, యుగసమాప్తికి సంబంధించిన సూచనల గురించి శిష్యుల ప్రశ్నలకు జవాబివ్వడానికి యేసు ఏ కొండమీద కూర్చొన్నాడు?

210➤ పరిశుద్ధ స్థలంలో నిలబడిన నాశనకరమైన హేయ వస్తువును గురించి ఎవరు ప్రవచించారు?

211➤ పీనుగ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎలాంటి పక్షులు పోగవుతాయి?

212➤ ఒక చెట్టునుండి నేర్చుకొమ్మని యేసు చెప్పాడు. ఆ చెట్టు ఏమిటి?

213➤ యేసుప్రభువు రెండవ రాకడ గురించి ఎవరికి తెలుసు?

214➤ ప్రభువు రాకడ సమయంలో ఎవరి దినాలవలె రోజులు ఉంటాయి?

215➤ తమకోసం తలుపులు తీయమని ప్రభువును ఎవరు అడిగారు?

216➤ తన సమస్త దూతలతో మనుష్యకుమారుడు మహిమతో వచ్చినప్పుడు ఆయన ఎక్కడ కూర్చుంటాడు?

217➤ క్రీస్తుకు కుడివైపున ఉన్నవారికి వచ్చే ప్రతిఫలం ఏమిటి?

218➤ సింహాసనానికి ఎడమ ప్రక్కన ఉన్నవారు పొందుకొనే శిక్ష ఏమిటి?

219➤ అపవాదికి, వాని దూతలకు సిద్ధపరచబడినది ఏమిటి?

220➤ యేసుకు విరోధంగా ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు ఎక్కడ కూడుకొన్నారు?

221➤ కుష్టరోగియైన సీమోను ఇల్లు ఎక్కడ ఉంది?

222➤ ఏ కుష్టరోగి ఇంట్లో యేసు భోజనం చేశాడు?

223➤ ఎవరి ఇంట్లో ఒక స్త్రీ యేసువద్దకొచ్చి ఆయన తలమీద అత్తరును కుమ్మరిం చింది?

224➤ ఈ లోకంలో సువార్త ప్రకటించబడినప్పుడెల్లా ఎవరి పేరు ప్రశంసించ బడుతుంది?

225➤ 'నేనాయనను మీకప్పగించిన యెడల నాకేమి ఇత్తురని' యూదా ఎవరితో అన్నాడు?

226➤ ఎన్ని వెండి నాణేలకు యేసు ప్రధానయాజకులకు అప్పగించబడ్డాడు?

227➤ గురువును అమ్మిన శిష్యుని పేరేమిటి?

228➤ 'ఆ మనుష్యుడు పుట్టి యుండనియెడల వానికి మేలు'. ఎవరు ఆ వ్యక్తి?

229➤ చివరి భోజనం తరువాత యేసు, అతని శిష్యులు ఎక్కడికి వెళ్ళారు?

230➤ అనేకుల పాపక్షమాపణ నిమిత్తం కార్చబడిన యేసు రక్తం దేనికి సాదృశ్యం?

231➤ యేసు సిలువ వేయబడక ముందు చివరిసారిగా ఎక్కడ ప్రార్థించాడు?

232➤ తన పునరుత్థానం తరువాత తన శిష్యులకంటే ముందుగా యేసు ఎక్కడికి వెళ్ళాడు?

233➤ 'ఈ రాత్రి కోడికూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవు' అని యేసు ఎవరితో చెప్పాడు?

234➤ యేసును మూడుసార్లు ఎరుగనని చెప్పిందెవరు?

235➤ 'నేను నీతో కూడ చావవలసి వచ్చినను, నిన్ను ఎరుగననను' అని ఏ శిష్యుడు చెప్పాడు?

236➤ శరీరం బలహీనంగా ఉన్నప్పుడు ఏది సిద్ధంగా ఉంది?

237➤ యేసును పట్టుకోవడానికి యూదా ఇచ్చిన గుర్తు ఏమిటి?

238➤ యేసును అప్పగించినప్పుడు యూదా ఆయన్ని ఏమని పిలిచాడు?

239➤ 'చెలికాడా, నీవు చేయ వచ్చినది చేయుము' అని యేసు ఎవరితో చెప్పాడు?

240➤ ప్రధాన యాజకుని దాసుని చెవి కోసిందెవరు?

241➤ ఏ ప్రధాన యాజకునివద్దకు యేసును తీసుకెళ్ళారు?

242➤ ప్రధాన యాజకుని ఇంటి ముంగిటవరకు దూరంనుండి యేసును బడించిన శిష్యుడు ఎవరు?

243➤ యేసు తీర్పు చివరికి ఏమవుతుందో చూడాలని సైనికులతో కూర్చొన్నదెవరు?

244➤ ఒకవేళ యేసు దేవుని కుమారుడైతే చెప్పుమని జీవంగల దేవుని తోడని ఆనబెట్టింది ఎవరు?

245➤ ఆకాశ మేఘారూఢుడై ఎవరు వస్తారు?

246➤ కోడి కూసిన వెంటనే ఎవరు ఏడ్చారు?

247➤ యేసు సిలువవేయబడిన కాలంలో ఉన్న అధిపతి ఎవరు?

248➤ యేసును శిక్షించడానికి ప్రధాన యాజకుడు ఆయన్ని ఎవరికి అప్పగించాడు?

249➤ యేసుకు శిక్ష విధించబడడం చూసి పశ్చాత్తాపపడింది ఎవరు?

250➤ 'నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితిని' అని ఎవరు చెప్పారు?

251➤ యూదా వెండి నాణేలను ఎక్కడ పారవేశాడు?

252➤ క్రొత్త నిబంధనలో తనకు తాను ఉరి పెట్టుకొన్నది ఎవరు?

253➤ రక్తపు పొలాన్ని గురించి ఎవరు ప్రవచించారు?

254➤ “యూదుల రాజువు నీవేనా?” అని యేసును అడిగింది ఎవరు?

255➤ యేసువలన కలలో మిక్కిలి బాధపడింది ఎవరు?

256➤ 'నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు' అని యేసు గురించి పిలాతుతో చెప్పింది ఎవరు?

257➤ జన సమూహం ఎదుట నీళ్ళు తీసుకొని తన చేతులను కడుక్కొన్న అధిపతి ఎవరు?

258➤ 'ఈ నీతిమంతుని రక్తమునుగూర్చి నేను నిరపరాధిని' అని జన సమూహంతో ఎవరు చెప్పారు?

259➤ యేసుకు బదులు ఎవరు విడుదలైనారు?

260➤ యేసు వస్త్రాలను తీసివేసిన తరువాత ఆయనకు ఏమి తొడిగించారు?

261➤ యేసు సిలువను మోయుమని ఎవరిని బలవంతం చేశారు?

262➤ యేసును ఎక్కడ సిలువ వేశారు?

263➤ 'గొలౌతా' పేరుకు అర్థం ఏమిటి?

264➤ చేదు కలిపిన ద్రాక్షారసాన్ని యేసుకి ఎక్కడిచ్చారు?

265➤ యేసు సిలువపైన ఏమి వ్రాయబడింది?

266➤ సిలువ మీదున్నప్పుడు యేసు ఏమని బిగ్గరగా కేక వేశాడు?

267➤ 'ఏలీ, ఏలీ, లామా సబక్తానీ' అనే మాటకు అర్థం ఏమిటి?

268➤ ఏలీ ఏలీ అని యేసు సిలువ మీద మొరపెడుతున్నప్పుడు ప్రజలు ఏమని భావించారు?

269➤ దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చీలింది ఎప్పుడు?

270➤ ఎవరు మరణించినప్పుడు నిద్రించిన అనేకమంది పరిశుద్ధుల శరీరాలు లేచాయి?

271➤ యేసు గురించి శతాధిపతి ఏమని చెప్పాడు?

272➤ ధనవంతుడైన యేసు శిష్యుడెవరు?

273➤ సమాధిచేయడానికి యేసు మృతదేహం కోసం పిలాతును ఎవరు అడిగారు?

274➤ రాతిలో తొలిపించబడిన క్రొత్త సమాధిలో యేసు దేహం ఉంచబడింది. ఆ సమాధి ఎవరిది?

275➤ యేసు ఒక వంచకుడని ఎవరు చెప్పారు?

276➤ యేసు సమాధిని భద్రం చేయడానికి కావలివారిని ఎవరు నియమించారు?

277➤ సమాధి ద్వారంలో ఉన్న రాయిని దొర్లించింది ఎవరు?

278➤ ఆదివారంనాడు ఎవరు యేసు సమాధివద్దకు వచ్చారు?

279➤ ఎక్కడికి శిష్యులు వెళ్ళాలని యేసు స్త్రీలతో చెప్పాడు?

280➤ ఎవరి నామంలో బాప్తిస్మాన్నివ్వాలి?

281➤ సర్వాధికారం ఎవరికి ఇవ్వబడింది?