అడగక ముందే అక్కరలెరిగి | Adagaka Mundhe Akkaralerigi Telugu christian Song lyrics


అడగక ముందే అక్కరలెరిగి
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
ఎందరు ఉన్నా బంధువు నీవే
బంధాలను పెంచిన భాగ్యవంతుడా

పదే పదే నేను పాడుకోనా
ప్రతి చోట నీ మాట నా పాటగా
మరి మరి నే చాటుకోనా
మనసంతా పులకించని సాక్షిగా
నా జీవిత గమనానికి గమ్యము నీవే
చితికిన నా గుండెకు ప్రాణం నీవే (2)      ||పదే పదే||

మమతల మహా రాజా
(నా) యేసు రాజా (4)

అడగక ముందే అక్కరలెరిగి
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
ఎందరు ఉన్నా బంధువు నీవే
బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2)

అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2)       ||మమతల||

అడిగిన వేళ అక్కున చేరి
అనురాగం పంచిన అమ్మవు నీవే
నలిగిన వేళ నా దరి చేరి
నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2)
అనురాగం పంచిన అమ్మవు నీవే
నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2)      ||పదే పదే||

Document

Your download link will appear in 10 seconds.