Telugu Bible Quiz on Judges
న్యాయాధిపతులు క్విజ్
![]() |
Bible Quiz from Judges in Telugu |
Q ➤ 1.యెహోషువ మృతిబొందిన తరువాత కనానీయులతో యుద్ధము చేయుటకు దేవుడు ఏ ఏ వంశస్థులను ఎన్నుకున్నాడు?
Q ➤ 2.ఎవరి కాళ్ళుచేతుల బొటనవ్రేళ్ళను కోసివేసిరి?
Q ➤ 3. ఒత్నీయేలు తండ్రి ఎవరు?
Q ➤ 4.తన కుమార్తె అక్సా నీటిమడుగులను అడుగగా, కాలేబు దానితోపాటు ఆమెకు ఇంకేమి ఇచ్చెను?
Q ➤ 5. హోర్మా అనగానేమి?
Q ➤ 6. బోకీము అనగానేమి?
Q ➤ 7. దోచుకొనువారిచేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించుటకు దేవుడైన యెహోవా ఎవరిని పుట్టించెను?
Q ➤ 8. దెబోరా ప్రవక్తిని ఏ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండెడిది?
Q ➤ 9. దెబోరా ప్రవక్తిని భర్త పేరేమి?
Q ➤ 10. యెహోవా ఎవరిని బారాకు చేతికి అప్పగించునని దెబోరా చెప్పెను?
Q ➤ 11. ఎవరికి మరుగైయుండునట్లు గిద్యోను గానుగల చాటున గోధుమలను దుళ్ళగొట్టుచునుండెను?
Q ➤ 12. 'పరాక్రమముగల బలాఢ్యుడా' అని ఎవరిని యెహోవా దూత పిలిచెను?
Q ➤ 13.ఏ స్థలమందు గిద్యోను యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టి, దానికి'యెహోవా సమాధానకర్త' అని పేరు పెట్టెను?
Q ➤ 14.గిద్యోను తండ్రి ఎవరు?
Q ➤ 15. యెరుబ్బయలు అనగానేమి?
Q ➤ 16.ఎవరి ఆత్మ గిద్యోనును ఆవహించెను?
Q ➤ 17.గిద్యోను ఇశ్రాయేలీయులను దోపుడు సొమ్ములోనుండి ఏమి అడిగాడు?
Q ➤ 18.గిద్యోనుకు ఎంతమంది కుమారులు కలరు?
Q ➤ 19.గిద్యోను తన ఉపపత్ని కనిన కుమారునికి ఏమని పేరు పెట్టెను?
Q ➤ 20. అబీయెబ్రీయుల ఒఫ్రాలోనున్న తన తండ్రియైన యోవాసు సమాధిలో పాతి పెట్టబడిన వారెవరు?
Q ➤ 21. యెరుబ్బయలు చిన్న కుమారుడు ఎవరు?
Q ➤ 22. యెరుబ్బయలు 70 మందికుమారులను ఒక్క రాతిమీద ఎవరు చంపారు?
Q ➤ 23. ఎన్ని సంవత్సరములు అబీమెలెకు ఇశ్రాయేలీయులను ఏలెను?
Q ➤ 24. తోలా ఎవరి కుమారుడు?
Q ➤ 25. తోలా ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయులపై న్యాయాధిపతిగా ఉండెను?
Q ➤ 26. తోలా చనిపోయి ఎచట పాతిపెట్టబడెను?
Q ➤ 27. యాయీరు ఎన్నేళ్లు ఇశ్రాయేలీయులపై న్యాయాధిపతిగా నుండెను?
Q ➤ 28 యాయీరు కుమారులెంతమంది?
Q ➤ 29. యాయీరు కుమారులు దేనినెక్కి తిరుగుచుండెడివారు?
Q ➤ 30. యాయీరు గ్రామములు ఎచ్చటనున్నవి?
Q ➤ 31. యాయీరు చనిపోయి ఎచట పాతిపెట్టబడెను?
Q ➤ 32. యెఫ్తా ఏ దేశస్థుడు?
Q ➤ 33. "అమ్మోనీయులపై జయమిచ్చిన యెడల తన ఇంటిద్వారమునుండి బయలు వచ్చిన దానిని దహనబలిగా అర్పించెదనని" ఎవరు యెహోవాకు మ్రొక్కుకొనెను?
Q ➤ 34. యెఫ్తా అమోనీయులతో యుద్ధముచేసి తన యింటికి వస్తుండగా అతనిని ఎవరు ఎదుర్కొనిరి?
Q ➤ 35. తన కన్యత్వమును గూర్చి ప్రలాపించుటకు ఎన్ని నెలలు తనను విడువుమని యెఫ్తా కుమార్తె తండ్రిని అడిగెను?
Q ➤ 36. మానోహా ఏ వంశస్థుడు?
Q ➤ 37. నాజీరు అనగానేమి?
Q ➤ 38. దేవదూత మానోహ భార్యను ఎచట దర్శించెను?
Q ➤ 39. తల్లిగర్భమునందున ఉన్నప్పుడే దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తి ఎవరు?
Q ➤ 40. సమ్సోను ఎవరి కుమారుడు?
Q ➤ 41. ఫిలిష్తీయుల కుమార్తెను సమ్సోను ఎచట చూచెను?
Q ➤ 42. సమ్సోను మేకపిల్లను చీల్చినట్లు దేనిని చీల్చెను?
Q ➤ 43. దేని నుండి సమ్సోను తేనెను తీసి తన తల్లిదండ్రులకు కొంత ఇచ్చెను?
Q ➤ 44."బలమైన దానిలోనుండి తీపి వచ్చెను, తిను దానిలోనుండి తిండి వచ్చెను” అనే విప్పుడు కథను ఎవరు వేసారు?
Q ➤ 45. గాడిద దవడ యెముకతో సమ్సోను ఎంతమందిని చంపాడు?'రామల్లేహీ' అనగానేమి?
Q ➤ 46."రామత్లేహీ" అనగా అర్ధమేమి?
Q ➤ 47.'ఏనక్కోరే' అనగా అర్ధమేమి?
Q ➤ 48. సమ్సోను ఎచటకు వెళ్ళి వేశ్యనొకతెను చూచి ఆమె యొద్ద చేరెను?
Q ➤ 49. శోరేకులో లోయలోనున్న ఏ స్త్రీని సమ్సోను మోహించెను?
Q ➤ 50. సమ్సోను బలము ఎచటనున్నదో తెలుసుకొనుమని ఎవరు లీలా యొద్దకు వచ్చారు?
Q ➤ 51. తనకు క్షవరముచేసినయెడల తన బలము తొలగిపోవునని సమ్సోను ఎవరితో చెప్పెను?
Q ➤ 52. ఫిలిష్తీయులు సమ్సోనును బంధించి అతని కన్నులు ఊడదీసి అతనిని గాజాకు తీసుకుపోయి అతని చేత ఏమి చేయించిరి?
Q ➤ 53. సమ్సోనును ఏ దేవతకు మహాబలిగా అర్పించుటకు ఫిలిష్తీయుల సర్ధారులు కూడుకొనిరి?
Q ➤ 54. సమ్సోను ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయుల అధిపతిగా నుండెను?