Telugu Bible Quiz on Joshua
యెహోషువ క్విజ్
![]() |
Bible Quiz from Joshua in Telugu |
Q ➤ 1.మోషే మరణానంతరము దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి పేరేమి?
Q ➤ 2. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళవలెనంటే ఏ నది దాటి వెళ్ళవలెను?
Q ➤ 3.ఎవరితో చెప్పినట్లు "మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను" అని యెహోవా సెలవిచ్చెను?
Q ➤ 4. "నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ యెదుట నిలువలేక యుండును" అని దేవుడైన యెహోవా ఎవరితో సెలవిచ్చెను?
Q ➤ 5. దేనిని దివారాత్రులు ధ్యానించవలెను?
Q ➤ 6. "నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము. దిగులుపడకుము జడియకుము. నీవు నడుచుమార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును" అని ఎవరికి చెప్పబడినది?”
Q ➤ 7. యెహోషువ ఎచట నుండి ఇద్దరు మనుష్యులను వేగుచూచుటకు రహస్యముగా యెరికోకు పంపెను?
Q ➤ 8. రాహాబు ఏ పట్టణస్థురాలు?
Q ➤ 9. రాహాబు తనను తన కుటుంబస్థులను రక్షించుకొనుటకుగాను కిటికీకి ఏమి కట్టినది?
Q ➤ 10. యాజకులైన లేవీయులు దేవుని మందసమును మోసుకొని పోవునపుడు ఇశ్రాయేలీయులు ఎంత ఎడముగా వుండవలెనని యెహోషువ చెప్పెను?
Q ➤ 11.దేవుని మందసమును మోయు యాజకుల అరికాళ్లు ఏనది నీళ్ళను ముట్టగానే ఆ నది నీళ్ళు ఏకరాశిగా నిలిచెను?
Q ➤ 12.ఏ స్థలమందు యొర్దాను నది నీళ్ళు ఏకరాశిగా నిలిచాయి?
Q ➤ 13. యొర్దాను నది నీళ్ళు ఏకరాశిగా నిలిచినచోటునుండి పన్నెండు గోత్రములకు జ్ఞాపకార్ధముగా వాటిని ఎచట నిలువబెట్టించెను?
Q ➤ 14. దేనిచేత మరల ఇశ్రాయేలీయులను నుస్నతి చేయించుకోమని దేవుడైన యెహోవా సెలవిచ్చెను?
Q ➤ 15. ఏ స్థలమందు ఇశ్రాయేలీయులు మరల సున్నతి చేయించుకొనెను?
Q ➤ 16. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఏ మైదానమందు పస్కాను ఆచరించిరి?
Q ➤ 17.ఇశ్రాయేలు ప్రజలు ఏ దేశపు పంటను తిన్నతరువాత మన్నా ఆగిపోయెను?
Q ➤ 18. ఎన్ని దినములు ఎన్ని మారులు బూరలు ఊదుచూ యెరికో చుట్టూ తిరగమని ఇశ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞాపించెను?
Q ➤ 19. శపితమైన దానిలో కొంత దొంగిలించినది ఎవరు?
Q ➤ 20. ఇశ్రాయేలీయులు హాయి వారియెదుట నిలువలేక ఓడిపోవుటకు కారణమేమి?
Q ➤ 21. ఆకాను దొంగిలించినవి ఏవి?
Q ➤ 22. ఏ లోయలోకి తీసుకువచ్చి ఆకానును రాళ్ళతో కొట్టి చంపిరి?
Q ➤ 23. ఆకోరు లోయ అనగా అర్థమేమి?
Q ➤ 24. యెహోషువ హాయి రాజును సాయంకాలము వరకు దేనిమీద వ్రేళాడదీసెను?
Q ➤ 25. "సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము...” అను మాట ఏ గ్రంథములో వ్రాయబడియున్నది?
Q ➤ 26. కొండ ప్రదేశమును దయచేయుమని దేవునిని అడిగినప్పుడు కాలేబు వయస్సు ఎంత?
Q ➤ 27. యెహోషువ కాలేబునకు ఏ ప్రదేశమును స్వాస్థ్యముగా ఇచ్చెను?
Q ➤ 28. హెబ్రోను పూర్వపు పేరేమి?
Q ➤ 29. కాలేబు కుమార్తె పేరేమి?
Q ➤ 30. కాలేబు తన కుమార్తెను ఎవరికిచ్చి పెండ్లి చేసెను?
Q ➤ 31. అక్సా తన తండ్రిని ఏమియ్యమని అడిగెను?
Q ➤ 32.కుమార్తెలేగాని కుమారులు పుట్టలేదు, ఎవరికి?
Q ➤ 33.పొరపాటున ఒకడు నరహత్యచేసిన యెడల అతడు ఎచ్చటికి పారిపోవలెను?
Q ➤ 34. యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఎవరు?
Q ➤ 35. "మీ పక్షమున యుద్ధముచేసినవాడు మీ దేవుడైన యెహోవాయే” అని పలికినది ఎవరు?
Q ➤ 36. "నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము" అని ఎవరు పలికారు?
Q ➤ 37. ధర్మశాస్త్ర గ్రంథములోని ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి ఎచట నిలువబెట్టించాడు?
Q ➤ 38. ఎవరు మీమీద సాక్షిగా నుండునని యెహోషువ ఇశ్రాయేలీయులతో అనెను?
Q ➤ 39. యెహోషువ బ్రతికిన దినములు ఎన్ని?
Q ➤ 40. యెహోషువను ఎచట పాతిపెట్టిరి?
Q ➤ 41.యాకోబు నూరు వరహాలకు షెకెము తండ్రియైన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో ఎవరి ఎముకలను పాతిపెట్టిరి?