Telugu Bible Quiz on 1 Samuel
సమూవేలు మొదటి గ్రంధము క్విజ్
![]() |
Bible Quiz from 1 Samuel in Telugu |
Q ➤ 1.మొదటి సమూయేలు గ్రంథమందు ఎన్ని అధ్యాయాలున్నాయి?
Q ➤ 2.ఎల్కానా ఏ పట్టణస్థుడు?
Q ➤ 3.ఎల్కానా ఇద్దరు భార్యల పేర్లు ఏమిటి?
Q ➤ 4.ఏలీ ఇద్దరు కుమారుల పేరులు ఏమి?
Q ➤ 5.ఏటేటా తన భర్తతో కలసి ఎచ్చటనున్న మందిరమునకు హన్నా పోవుచుండెను?
Q ➤ 6.దేవుడు హన్నాను జ్ఞాపకము చేసుకొని అనుగ్రహించిన కుమారుని పేరేమి?
Q ➤ 7.ఎవని ఎదుట బాలుడైన సమూయేలు దేవుని పరిచర్యలో ఎదుగుచుండెను?
Q ➤ 8. యుద్ధమందు దేవుని నిబంధన మందసము ఎవరిచేత పట్టుబడెను?
Q ➤ 9.ఏలీ ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చెను?
Q ➤ 10.'ఈకాబోదు' అనగా అర్ధమేమి?
Q ➤ 11.ఫిలిష్తీయులు దేవుని నిబంధన మందసమును ఎచ్చట నుంచిరి?
Q ➤ 12. అష్టోదువారి మీద ఎవరి హస్తము భారముగా నుండెను?
Q ➤ 13. దేవుడైన యెహోవా అష్టోదువారిని దేనితో మొత్తెను?
Q ➤ 14.దేవుని హస్తము వారిపై భారముగా నున్నందున అష్టోదువారు దేవుని మందసమును ఏ పట్టణమునకు మోసుకొని పోయిరి?
Q ➤ 15. ఏ పట్టణస్థులు దేవుని మందసము తమ పట్టణములోనికి వచ్చుటవలన మరణ భయముచేత కేకలు వేసిరి?
Q ➤ 16. ఎన్ని నెలలు యెహోవా మందసము ఫిలిష్తీయుల దేశమందుండెను?
Q ➤ 17. ఫిలిష్తీయుల సర్దారులు క్రొత్త బండిని చేయించి దేవుని మందసమును దానిపై ఎక్కించి ఎచటకు వంపిరి?
Q ➤ 18. అపరాధ పరిహారార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించవలసినవి ఏమిటి?
Q ➤ 19. ఎచట సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చెను?
Q ➤ 20. సమూయేలు ఇద్దరు కుమారులు పేరులు ఏమిటి?
Q ➤ 21. తమకు సకల జనుల మర్యాదచొప్పున మాకు ఒక రాజును నియమింపుము అని ఇశ్రాయేలీయుల పెద్దలు ఎవరిని అడిగిరి?
Q ➤ 22.బెన్యామీనీయుడైన కీషు కుమారుడు ఎవరు?
Q ➤ 23.దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులపై అధికారిగా ఎవరిని అభిషేకించుమని సమూయేలుతో చెప్పెను?
Q ➤ 24. అతడు ప్రవక్తలలోనున్నాడా? అని ఎవరిని గూర్చి సామెత పుట్టెను?
Q ➤ 25. దేవుని మాటకు లోబడక సాహసించి ఏ స్థలమందు సౌలు దహనబలి అర్పించెను?
Q ➤ 26. అతనిని రాజుగా చేసినందుకు పశ్చాత్తాపపడుచున్నాను అని దేవుడు ఎవరిని గూర్చి సెలవిచ్చాడు?
Q ➤ 27. తిరుగుబాటు చేయుటయు, సోదెచెప్పుటయు దేనితో సమానము?
Q ➤ 28. సౌలుకు బదులుగా దేవుడెవరిని రాజుగా నియమించుటకు నిర్ణయించాడు?
Q ➤ 29. బేత్లహేమీయుడైన సౌలుకు ఎంతమంది కుమారులు?
Q ➤ 30. యెష్షయి యొక్క కడసారి ఎనిమిదవ కుమారుడు ఎవరు?
Q ➤ 31. దావీదును అభిషేకించినది ఎవరు?
Q ➤ 32. 'జీవముగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు?' అని దావీదు ఎవరిని గూర్చి పలికాడు?
Q ➤ 33. దావీదును ప్రాణస్నేహితునిగా భావించుకొనిన సౌలు కుమారుడు ఎవరు?
Q ➤ 34. దావీదును ప్రేమించిన సౌలు కుమార్తె పేరేమి?
Q ➤ 35. ఏ స్థలమందు సౌలు దావీదు చేతికి చిక్కాడు?
Q ➤ 36. నాబాలు భార్య పేరేమి?
Q ➤ 37. యెహోవా చేత అభిషేకమునొందిన వానిని నేను చంపనని పలికిన దెవరు?
Q ➤ 38. సమూయేలు చనిపోయి ఎచట పాతిపెట్టబడెను?
Q ➤ 39. తనతో మాట్లాడుటకు ఎవరిని రప్పించమని సౌలు కర్ణపిశాచము గలదాని దగ్గరకి వెళ్ళెను?
Q ➤ 40. ఎవరు సిక్లగుమీదపడి దావీదు ఇద్దరు భార్యలను అతని జనుల కుమారులను, కుమార్తెలను చెరగొనిపోయిరి?
Q ➤ 41. సౌలు ఏ పర్వతముపై చనిపోయాడు?