270 Bible Quiz Questions About The Life of Jesus in Telugu || Trivia questions about Jesus in Telugu || Telugu Bible quiz questions about Jesus

Q ➤ 1.మరియ ఎవరికి ప్రధానము చేయబడెను?


Q ➤ 2.మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె __వలన గర్భవతిగా ఉండెను?


Q ➤ 3.మరియ భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచ నొల్లక__గ ఆమెను విడనాడ ఉద్దేశించెను?


Q ➤ 4.ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకు____ అనెను ?


Q ➤ 5. ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై మరియ ఒక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు___ అని పేరు పెట్టుదువనెను?


Q ➤ 6. యేసు అనే పేరుకు అర్థం ఏమిటీ?


Q ➤ 7. క్రీస్తు అను శబ్దమునకు అర్థం ఏమిటీ?


Q ➤ 8.ఇమ్మానుయేలను పేరునకు అర్థం ఏమిటి?


Q ➤ 9.యేసుక్రీస్తు జన్మించిన గ్రామం ఏది?


Q ➤ 10.యేసుక్రీస్తు ఏ వంశంలో జన్మించాడు?


Q ➤ 11.యేసుక్రీస్తు ఏ గోత్రంలో జన్మించాడు?


Q ➤ 12.ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని ఎవరి వలన ఆజ్ఞ ఆయెను ?


Q ➤ 13.మరియ ఎక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను?


Q ➤ 14. మరియ తన తొలిచూలు కుమారుని కని,___గుడ్డలతో చుట్టెను?


Q ➤ 15.మరియ తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, ___ లొ వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను?


Q ➤ 16.కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ఎవరు వారి యొద్దకు వచ్చి నిలిచెను?


Q ➤ 17.ప్రభువు మహిమ గొర్రెల కాపరుల చుట్టు ప్రకాశించినందున, వారు____?


Q ➤ 18.ప్రభువు దూత గొర్రెల కాపరులతో - భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు____కరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాననెను?


Q ➤ 19. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన___ అనెను ?


Q ➤ 20.ప్రభువు దూత గొర్రెల కాపరులతో ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి____ లో పండుకొనియుండుట మీరు చూచెదరని చెప్పెను?


Q ➤ 21.పరలోక సైన్య సమూహము దూతతో కూడనుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద --------- కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను?


Q ➤ 22.గొర్రెల కాపరులు ఎక్కడికి వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొనిరి?


Q ➤ 23.గొర్రెల కాపరులు త్వరగా వెళ్లి,మరియను యోసేపును తొట్టిలో పండు కొనియున్న____ ను చూచిరి ?


Q ➤ 24.గొర్రెల కాపరులు శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు చేసిరి?


Q ➤ 25.గొర్రెల కాపరులు తమతో చెప్పబడి నట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటిని గూర్చి దేవుని మహిమ పరచుచు___ చేయుచు తిరిగి వెళ్లిరి ?


Q ➤ 26.యెరూషలేమునందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై యుండి, ఇశ్రాయేలుయొక్క____ కొరకు కనిపెట్టువాడు?


Q ➤ 27.సుమెయోను మీద___ ఉండెను ?


Q ➤ 28.ప్రభువుయొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని సుమెయోనుకు ఎవరిచేత బయలుపరచబడి యుండెను?


Q ➤ 29.నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చు చున్నావు; అని అన్నది ఎవరు ?


Q ➤ 30. నీ హృదయములోనికి ఒక ___దూసికొనిపోవునని సుమెయోను మరియతో చెప్పెను?


Q ➤ 31.యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చిరి?


Q ➤ 32. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని జ్ఞానులు ఎవరితో చెప్పిరి?


Q ➤ 33.హేరోదు జ్ఞానులను రహస్యముగా పిలిపించి, నక్షత్రము కనబడిన కాలము వారిచేత___ గా తెలిసికొనెను ?


Q ➤ 34.హేరోదు జ్ఞానులతో - మీరు వెళ్లి, శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి, ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని ఎక్కడికి పంపెను?


Q ➤ 35.క్రీస్తు ఎక్కడ పుట్టునని హేరోదు ఎవరినడిగెను ?


Q ➤ 36. జ్ఞానులు తల్లియైన మరియను శిశువును చూచి, సాగిలపడి, ఎవరిని పూజించిరి ?


Q ➤ 37.జ్ఞానులు తమ పెట్టెలు విప్పి,బంగారమును సాంబ్రాణిని బోళమును____ గా ఆయనకు సమర్పించిరి?


Q ➤ 38. హేరోదు నొద్దకు నొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై జ్ఞానులు____ మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి?


Q ➤ 39.జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు____ తెచ్చుకొనెను?


Q ➤ 40.బేత్లహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల___ నందరిని వధించెను?


Q ➤ 41.ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ____నకు పారిపొమ్మని చెప్పెను?


Q ➤ 42.యోసేపు లేచి,___ వేళ శిశువును తల్లిని తోడుకొని, ఐగుప్తునకు వెళ్లెను?


Q ➤ 43. హేరోదు చనిపోయిన తరువాత ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని_____ దేశమునకు వెళ్లమని చెప్పెను?


Q ➤ 44.యోసేపు స్వప్నమందు దేవునిచేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి, ----- అను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను?


Q ➤ 45.ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక __యుండెను?


Q ➤ 46.అన్న దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు____ చేయుచుండెను?


Q ➤ 47.పస్కాపండుగప్పుడు యేసుక్రీస్తు తలిదండ్రులు ఏటేట ఎక్కడికి వెళ్లుచుండువారు?


Q ➤ 48.యేసుక్రీస్తు దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ___అడుగుచు ఉండెను?


Q ➤ 49. యేసుక్రీస్తు మాటలు వినిన వారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును____ నొందిరి ?


Q ➤ 50.యేసుక్రీస్తు తలిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి___?


Q ➤ 51.యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును,_____ దయ యందును వర్ధిల్లు చుండెను?


Q ➤ 52.రబ్బీ అనే మాటకు అర్థం ఏమిటి?


Q ➤ 53. మెస్సియా అనే మాటకు అర్థం ఏమిటీ?


Q ➤ 54. యేసయ్య కేఫా అనే పేరు ఎవరికి పెట్టెను?


Q ➤ 55.ఇదిగో లోకపాపమును మోసికొని పోవు దేవుని గొట్టెపిల్ల అని యోహాను ఎవరిని గూర్చి అన్నాడు?


Q ➤ 56.తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, ____అగుటకు దేవుడు అధికారము అనుగ్రహించెను?


Q ➤ 57.యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది?


Q ➤ 58.నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని అన్నది ఎవరు?


Q ➤ 59. యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు?


Q ➤ 60. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీరొకనినొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ అని అన్నది ఎవరు?


Q ➤ 61. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక ____పొందునట్లు ఆయనను అనుగ్రహించెను?


Q ➤ 62. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు__?


Q ➤ 63.మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెన గాని ____నియమింపలేదు?


Q ➤ 64.యేసయ్య ఈ భూమ్మీద ఎంతకాలం జీవించాడు?


Q ➤ 65.యేసుక్రీస్తు శాస్త్రులవలె కాక ___గలవానివలె ప్రజలకు బోధించెను?


Q ➤ 66. యేసుక్రీస్తు బోధకు ప్రజలు_____?


Q ➤ 67.నాకంటె శక్తిమంతుడొకడు నావెనుక వచ్చుచున్నాడు; నేను వంగి ఆయన చెప్పులవారును విప్పుటకు పాత్రుడనుకాను; అని అన్నది ఎవరు?


Q ➤ 68. యేసుక్రీస్తు చేసిన మొదటి సూచక క్రియ ఏది?


Q ➤ 69.యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో ఎవరిచేత బాప్తిస్మము పొందెను?


Q ➤ 70.పరిశుద్ధాత్మ పావురమువలె ఎవరి మీదికి దిగివచ్చుట యోహాను చూచెను?


Q ➤ 71.ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఎక్కడనుండి వచ్చెను?


Q ➤ 72.యేసయ్య అపవాది చేత శోధింప బడుటకు ఆత్మ వలన ఎక్కడికి కొనిపోబడెను?


Q ➤ 73.యేసుక్రీస్తు ఎన్ని రోజులు ఉపవాసమున్నాడు?


Q ➤ 74.శోధకుడు యేసయ్య దగ్గరికి వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు___అగునట్లు ఆజ్ఞాపించు మనెను?


Q ➤ 75.మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించును అని అన్నది ఎవరు?


Q ➤ 76.అపవాది యేసయ్యను విడిచిపోగా, ఎవరు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి?


Q ➤ 77.పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక_____ పొందుడని చెప్పుచు యేసయ్య ప్రకటింప మొదలు పెట్టెను?


Q ➤ 78.యేసు గలిలయ సముద్రతీరమున నడుచు చుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో ____వేయుట చూచెను?


Q ➤ 79.యేసయ్య శిష్యులతో - రండి, నేను మిమ్మును___ నా వెంబడి పట్టుజాలరులనుగా చేతునని చెప్పెను?


Q ➤ 80. నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, యేసయ్య యొద్దకు తీసికొని రాగా ఆయన వారిని ____?


Q ➤ 81.యేసయ్య పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, __ ప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను?


Q ➤ 82.యేసయ్య గలిలయయందంతట వారి సమాజమందిరములలో ప్రకటించుచు____ లను వెళ్లగొట్టుచు నుండెను?


Q ➤ 83. యేసయ్య మార్గమున వెళ్లుచు, సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు___ ను చూచి నన్ను వెంబడించుమని చెప్పెను?


Q ➤ 84.రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు అని అన్నది ఎవరు ?


Q ➤ 85. యేసయ్య దోనె దిగగానే, అపవిత్రాత్మ పట్టినవాడొకడు____ లలోనుండి వచ్చి, ఆయన కెదురుపడెను ?


Q ➤ 86. నీవు మనుష్యుల సంగతులను మనస్కరించు చున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని యేసయ్య ఎవరిని గద్దించెను?


Q ➤ 87.యేసయ్య తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన____ యెత్తుకొని నన్ను వెంబడింపవలెననెను?


Q ➤ 88.యేసు - నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి___ కైనను స్థలములేదని చెప్పెను?


Q ➤ 89. యేసయ్య జనసమూహములను చూచి, వారు కాపరిలేని గొజ్జెలవలె విసికి చెదరియున్నందున వారిమీద -------?


Q ➤ 90. కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని యేసయ్య ఎవరితో చెప్పెను?


Q ➤ 91.యేసయ్య తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి -------- ఇచ్చెను?


Q ➤ 92.యేసయ్య తన శిష్యులను పంపుచు___ సమీపించియున్నదని ప్రకటించమనెను?


Q ➤ 93. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు____ అనెను ?


Q ➤ 94.క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను_____ లో విని రాబోవు వాడవు నీవేనా, మేము మరియొకనికొరకు కనిపెట్టవలెనా? అని ఆయనను అడుగుటకు తన శిష్యులనంపెను ?


Q ➤ 95.యేసయ్య జనులతో - స్త్రీలు కనిన వారిలో____ కంటె గొప్పవాడు పుట్టలేదని చెప్పెను?


Q ➤ 96. నా విషయమై అభ్యంతర పడనివాడు____ అని యేసయ్య యుత్తర మిచ్చెను ?


Q ➤ 97. యేసయ్య ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు ____పొందకపోవుట వలన ఆయన వారిని గద్దించెను?


Q ➤ 98. యేసయ్య జనులతో - నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు ____దొరకుననెను?


Q ➤ 99.యేసు విశ్రాంతిదినమున పంటచేలలో పడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని ____త్రుంచి తినసాగిరి?


Q ➤ 100.యేసయ్య పరిసయ్యులతో కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దోషులను____ అని తీర్పు తీర్చకపోదురనెను?


Q ➤ 101.యేసయ్యను చూచి, సాగిలపడి ప్రభువా, నీ కిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొన్నది ఎవరు?


Q ➤ 102. మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు అని అన్నది ఎవరు ?


Q ➤ 103.యేసయ్య ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు___ గడిపెను ?


Q ➤ 104.యేసయ్య తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఏర్పరచి, వారికి____ అను పేరు పెట్టెను?


Q ➤ 105.ప్రభావము యేసయ్యలో నుండి బయలుదేరి అందరిని స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను____ యత్నముచేసెను?


Q ➤ 106.యేసయ్య దేవుని రాజ్యసువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను_____ చేయుచుండెను?


Q ➤ 107. దయ్యములు వదలిపోయిన మనుష్యుడు____ కట్టుకొని, స్వస్థచిత్తుడై యేసు పాదములయొద్ద కూర్చుండెను?


Q ➤ 108.సమాజ మందిరపు అధికారియైన యాయీరు అను ఒకడు వచ్చి ఎవరి పాదములమీద పడెను?


Q ➤ 109. యేసయ్య యాయీరుతో భయపడవద్దు, ----------మాత్రముంచుమనెను?


Q ➤ 110.యేసయ్య యాయీరు కుమార్తె చెయ్యిపట్టుకొని చిన్నదానా, లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన ఆమెకు____ పెట్టుడని ఆజ్ఞాపించెను?


Q ➤ 111.యేసయ్య తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును, రోగములు స్వస్థపరచు_____వారికనుగ్రహించెను?


Q ➤ 112.జనసమూహములు యేసయ్యను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకొని, ను గూర్చి వారితో మాటలాడుచు, స్వస్థత కావలసినవారిని స్వస్థపరచెను?


Q ➤ 113.యేసయ్య అయిదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికొని, ఆకాశము వైపు కన్ను లెత్తి వాటిని ఆశీర్వదించి, విరిచి, జన సమూహమునకు వడ్డించుటకై ఎవరికిచ్చెను ?


Q ➤ 114. నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని యేసయ్య ఎవరి నడిగెను?


Q ➤ 115. మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దల చేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను విసర్జింపబడి, చంపబడి,ఎన్నవ దినమున లేచుట అగత్యమని యేసయ్య చెప్పెను?


Q ➤ 116.ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన ____ఎత్తికొని నన్ను వెంబడింపవలెనని యేసయ్య చెప్పెను?


Q ➤ 117. యేసయ్య పేతురును యోహానును ప్రార్థనచేయుటకు యాకోబును వెంటబెట్టుకొని,ఎక్కడికి వెళ్లెను?


Q ➤ 118.యేసయ్య ప్రార్థించు చుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయనవస్త్రములు ---------- వై ధగధగ మెరిసెను?


Q ➤ 119.కొండపై యేసయ్యతో ఇద్దరు పురుషులు మాటలాడుచుండిరి. వారు ఎవరు ?


Q ➤ 120.మోషే ఏలీయా మహిమతో అగపడి, యేసయ్య యెరూషలేములో నెరవేర్చబోవు___ను గూర్చి మాటలాడుచుండిరి?


Q ➤ 121.ఏలిన వాడా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదుమని, యేసయ్య తో అన్నది ఎవరు?


Q ➤ 122.ఏలినవాడా, యెవడో యొకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచితిమి; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంక పరచితిమని యేసయ్యతో. అన్నది ఎవరు?


Q ➤ 123.నాగటిమీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును _____నకు పాత్రుడు కాడని యేసయ్య చెప్పెను?


Q ➤ 124. యేసయ్య ఎంతమంది శిష్యులను నియమించి, తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతిచోటికిని తనకంటె ముందు ఇద్దరిద్దరినిగా పంపెను?


Q ➤ 125.ఆ డెబ్బదిమంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా, ___కూడ నీ నామమువలన మాకు లోబడుచున్నవని చెప్పిరి?


Q ➤ 126.దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు ___యందు వ్రాయబడి యున్నవని సంతోషించుడని యేసయ్య శిష్యులతో చెప్పెను?


Q ➤ 127.బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని యేసయ్యను శోధించుచు అడిగింది ఎవరు?


Q ➤ 128.మార్త సహోదరి పేరు ఏమిటి?


Q ➤ 129.మార్త సహోదరియైన మరియ ఎక్కడ కూర్చుండి యేసయ్య బోధవినుచుండెను?


Q ➤ 130.మార్త____ పని పెట్టుకొనుటచేత తొందరపడెను?


Q ➤ 131.నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున, నీకు చింతలేదా? అని యేసయ్య తో అన్నది ఎవరు?


Q ➤ 132. మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారముకలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే అని అన్నది ఎవరు?


Q ➤ 133.యేసయ్య మార్తతో మరియ____ దానిని ఏర్పరచుకొ నెననెను?


Q ➤ 134.యేసయ్య శిష్యులలో ఒకడు ప్రభువా,యోహాను తన శిష్యులకు నేర్పి నట్టుగా మాకును____ చేయ నేర్పుమని ఆయన నడిగెను?


Q ➤ 135.యేసయ్య శిష్యులతో పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి____ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను?


Q ➤ 136.యేసయ్య____ వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని జనులు చెప్పుకొనిరి?


Q ➤ 137.యేసయ్య జనులతో తనకుతానే విరోధమైన యిల్లు____ అనెను ?


Q ➤ 138.యేసయ్య జనులతో నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా____మీయొద్దకు వచ్చియున్నదనెను?


Q ➤ 139.జన సమూహములో నున్న యొక స్త్రీ యేసయ్యను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును__అయినవని కేకలు వేసి చెప్పెను?


Q ➤ 140. దేవుని వాక్యము విని దానిని గైకొనువారు -----------అని యేసయ్య చెప్పెను?


Q ➤ 141.యేసయ్య భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని చూచి ఆశ్చర్యపడింది ఎవరు?


Q ➤ 142.మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నియు శుద్ధిగా ఉండును. అని యేసయ్య ఎవరితో అనెను?


Q ➤ 143.మనుష్యకుమారునిమీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని, ___నుదూషించువానికి క్షమాపణ లేదు?


Q ➤ 144.యేసయ్య జనులతో ఒకని కలిమి విస్తరించుట వాని___ నకు మూలము కాదనెను ?


Q ➤ 145.యేసయ్య జనులతో చిన్న మందా భయపడకుడి, మీకు___ అనుగ్ర హించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నదనెను?


Q ➤ 146.యేసయ్య జనులతో - మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ____ ఉండుననెను ?


Q ➤ 147.యేసయ్య జనులతో మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరు ____ఉండుడని చెప్పెను?


Q ➤ 148.విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా కాదా? అని యేసయ్య ఎవరినడిగెను?


Q ➤ 149.అభ్యంతరములు రాకపోవుట అసాధ్యముకాని అవి ఎవనివలన వచ్చునో వానికి శ్రమ.అని యేసయ్య ఎవరితో అనెను?


Q ➤ 150.ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో___ దూరుట సులభమని యేసయ్య చెప్పెను?


Q ➤ 151.యేసయ్య సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి, అని తలంచి కేకలు వేసిరి ?


Q ➤ 152. యేసయ్య దోనె యెక్కి శిష్యుల యొద్దకు వచ్చినప్పుడు____ అణగెను ?


Q ➤ 153.ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని, వారి___ నాకు దూరముగా ఉన్నదనెను?


Q ➤ 154.ఎప్పతా అనే మాటకు అర్థం ఏమిటీ?


Q ➤ 155. యేసయ్య శిష్యులతో నేను అయిదువేలమందికి అయిదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని వారి నడుగగా వారు ____అని ఆయనతో చెప్పిరి?


Q ➤ 156. యేసయ్య పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని, యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా వారిని తోడుకొనిపోయి, వారియెదుట ---------- పొందెను ?


Q ➤ 157.నమ్ముట నీవలననైతే, నమ్మువానికి___ సాధ్యమేయని యేసయ్య చెప్పెను?


Q ➤ 158.ఎవడైనను మొదటి వాడైయుండ గోరిన యెడల, వాడందరిలో కడపటివాడును అందరికి ___నై యుండవలెనని యేసయ్య చెప్పెను?


Q ➤ 159. నరకమున పురుగు చావదు;____ఆరదు ?


Q ➤ 160.మీలో మీరు ఉప్పుసారము గలవారై యుండి యొకరితో ఒకరు___గా ఉండుడని యేసయ్య చెప్పెను?


Q ➤ 161.యేసయ్య చిన్న బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి వారిని ___?


Q ➤ 162.యేసయ్య మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తికొనివచ్చి ఆయనయెదుట మోకాళ్లూనిసద్బోధ కుడా,___ నకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను?


Q ➤ 163.యేసయ్య శిష్యులతో - తమ ఆస్తియందు నమ్మికయుంచువారు రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమనెను?


Q ➤ 164. యేసయ్య శిష్యులను చూచిఇది మనుష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి ------- సాధ్యమే అనెను?


Q ➤ 165.ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని యేసయ్య తో అన్నది ఎవరు?


Q ➤ 166.నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ యెడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయ చేయుమని యేసయ్య ను అడిగింది ఎవరు?


Q ➤ 167. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటయైనను మీచేత అగునా? అని యేసయ్య ఎవరినడిగెను?


Q ➤ 168. మీలో ఎవడైనను గొప్పవాడై యుండగోరిన యెడల వాడు మీకు___ చేయువాడై యుండవలెనని యేసయ్య శిష్యులతో చెప్పెను?


Q ➤ 169.యేసయ్య శిష్యులతో - మీలో ఎవడైనను ప్రముఖుడై యుండగోరిన యెడల, వాడు అందరికి___ యుండవలెననెను?


Q ➤ 170. మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా____ క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను?


Q ➤ 171.యేసయ్య తన శిష్యులతోను బహు జన సమూహము తోను యెరికోనుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయి యను____ త్రోవప్రక్కను కూర్చుండెను?


Q ➤ 172.ఈయన నజరేయుడైన యేసు అని బర్తిమయి విని దావీదు కుమారుడా యేసూ, నన్ను ____అని కేకలు వేయ మొదలుపెట్టెను?


Q ➤ 173.యేసయ్య పిలువగా బర్తిమయి__ పారవేసి, దిగ్గున లేచి యేసయ్య నొద్దకు వచ్చెను?


Q ➤ 174.యేసయ్య బర్తిమయితో - నేను నీకేమి చేయ గోరుచున్నావని వాని నడుగగా, ఆ గ్రుడ్డివాడుబోధకుడా, నాకు --------------కలుగజేయుమని ఆయనతో అనెను?


Q ➤ 175.యేసయ్య బర్తిమయితో -నీవు వెళ్లుము; నీ ___నిన్ను స్వస్థపరచెనని చెప్పెను?


Q ➤ 176.యేసయ్య తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే___ గాడిద పిల్ల ఒకటి కనబడును దానిని విప్పి, తోలుకొని రండనెను?


Q ➤ 177.గాడిదపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, తమ ----- దానిపై వేయగా యేసయ్య దానిమీద కూర్చుండెను?


Q ➤ 178.హోసన్నా అనే మాటకు అర్థం ఏమిటీ?


Q ➤ 179.యేసయ్య బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిర మనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని____ చేసితిరనెను ?


Q ➤ 180.శాస్త్రులును ప్రధానయాజకులును యేసయ్య మాట విని, జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్య పడుట చూచి, ఆయనకు భయపడి, ఆయన నేలాగు సంహరించుదమా అని ____చూచుచుండిరి?


Q ➤ 181.బోధకుడా, యిదిగో నీవు శపించిన అంజూరపుచెట్టు ఎండిపోయెనని యేసయ్యతో అన్నది ఎవరు ?


Q ➤ 182.ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు___ అని చెప్పెను?


Q ➤ 183.మీకు ఒకనిమీద విరోధ మేమైనను కలిగియున్న యెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని ___?


Q ➤ 184.నీవు ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ యధికారము నీకెవడిచ్చెను అని యేసయ్యను అడిగింది ఎవరు ?


Q ➤ 185. ---------- రీతిగా యేసయ్య ప్రజలకు బోధించెను?


Q ➤ 186.ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, దానిచుట్టు కంచె వేయించి, ద్రాక్షలతొట్టి తొలిపించి గోపురము కట్టించి, దానిని ఎవరికి గుత్తకిచ్చి దేశాంతరముపోయెను ?


Q ➤ 187.ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు ____రాయి ఆయెను?


Q ➤ 188.యేసయ్యను మాటలలో చిక్కుపరచ వలెనని, హేరోదీయులను కొందరిని యేసయ్య యొద్దకు పంపింది ఎవరు?


Q ➤ 189. పునరుత్థానము లేదని చెప్పెడివారు ఎవరు?


Q ➤ 190. నీవు దేవుని రాజ్యమునకు దూరముగ లేవని యేసయ్య ఎవరితో చెప్పెను?


Q ➤ 191.నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ____వలన చెప్పెను?


Q ➤ 192.సామాన్యజనులు యేసయ్య మాటలు___ తో వినుచుండిరి?


Q ➤ 193.జనసమూహము___ లో డబ్బులు వేయుట యేసయ్య చూచుచుండెను?


Q ➤ 194. ఒక బీద విధవరాలు వచ్చి ఎన్ని కాసులు వేయగా యేసయ్య చూచెను?


Q ➤ 195.కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని యేసయ్య ఎవరితో చెప్పెను?


Q ➤ 196.జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరవులు వచ్చును. ఇవే ___లకు ప్రారంభమనెను ?


Q ➤ 197.నా నామము నిమిత్తము అందరిచేత మీరు ద్వేషింపబడుదురు; అంతమువరకు సహించినవాడే____ పొందుననెను?


Q ➤ 198.యేసయ్య శిష్యులతో - ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైనయెడల ఏర్పరచబడినవారిని మోసపుచ్చుటకై____ అగపరచెదరనెను ?


Q ➤ 199. మనుష్యకుమారుడు మహా ప్రభావముతోను మహిమతోను ____అయి వచ్చుట చూచెదరనెను?


Q ➤ 200.యేసయ్య శిష్యులతో ఆకాశమును భూమియును గతించును గాని నా____ గతింపవనెను ?


Q ➤ 201.మాయోపాయముచేత యేసయ్య నేలాగు పట్టుకొని చంపుదుమా యని ఆలోచించుకొన్నది ఎవరు?


Q ➤ 202.యేసయ్య బేతనియలో కుష్ఠ రోగియైన _____ఇంట భోజనమునకు కూర్చుండియుండెను?


Q ➤ 203.పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా,___ చేతికి యేసయ్యను అప్పగింపవలెనని వారియొద్దకు పోయెను?


Q ➤ 204.యూదా యేసయ్యను అప్పగించుటకు తగిన____ కనిపెట్టుచుండెను?


Q ➤ 205. ప్రధాన యాజకులు యూదాకు___ ఇత్తుమని వాగ్దానము చేసిరి?


Q ➤ 206.యేసయ్య శిష్యులతో కూర్చుండి భోజనము చేయుచుండగా యేసుమీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను _____అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పెను?


Q ➤ 207.యేసయ్య భోజనము చేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చిమీరు తీసికొనుడి; ఇది నా ---------- ?


Q ➤ 208. యేసయ్య గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని శిష్యులకిచ్చెను; వారందరు దానిలోనిది ____?


Q ➤ 209. యేసయ్య శిష్యులతో మీరందరు అభ్యంతర పడెదరు; గొజ్జెల కాపరిని కొట్టుదును; గొజ్జెలు చెదరి పోవును అని వ్రాయబడియున్నది గదా అయితే నేను లేచిన తరువాత మీకంటె ముందుగా____ కు వెళ్లెదననెను?


Q ➤ 210.అందరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని యేసయ్యతో అన్నది ఎవరు?


Q ➤ 211.నేటి రాత్రి కోడి రెండుమారులు కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసయ్య ఎవరితో చెప్పెను?


Q ➤ 212.పేతురు యేసయ్యతో నేను నీతో కూడ చావవలసి వచ్చినను నిన్ను___ అని చెప్పనే చెప్పననెను?


Q ➤ 213.యేసయ్య పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొనిపోయి, మిగుల ____నొందుటకును చింతా క్రాంతుడగుటకును ఆరంభించెను?


Q ➤ 214.నా ప్రాణము మరణమగునంతగా _____లో మునిగియున్నదని యేసయ్య శిష్యులతో చెప్పి మెలకువగా ఉండుడనెను ?


Q ➤ 215.మీరు శోధనలో ప్రవేశించ కుండునట్లు,____ గా నుండి ప్రార్థన చేయుడి?


Q ➤ 216.ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని యేసయ్య ఎవరితో చెప్పెను?


Q ➤ 217. యేసయ్య శిష్యులతో ఇదిగో మనుష్యకుమారుడు___ వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించువాడు చేతికి అప్పగింప బడుచున్నాడు; లెండి సమీపించియున్నాడని చెప్పెను?


Q ➤ 218.యేసయ్య ఇంకను మాటలాడుచుండగా పండ్రెండుమంది శిష్యులలో ఒకడైన_____ వచ్చెను ?


Q ➤ 219. యేసయ్యతో కూడ బహుజనులు___ పట్టుకొని, ప్రధానయాజకులయొద్దనుండియు శాస్త్రుల యొద్ద నుండియు పెద్దలయొద్ద నుండియు వచ్చిరి?


Q ➤ 220.యూదా యేసయ్య యొద్దకు పోయి బోధకుడా అని చెప్పి, ఆయనను ------------- ?


Q ➤ 221.యేసయ్య దగ్గర నిలిచి యున్నవారిలో ఒకడు కత్తిదూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి వాని____తెగనరికెను ?


Q ➤ 222.నేను ప్రతిదినము దేవాలయములో మీయొద్ద ఉండి బోధించుచుండగా, మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే____ నెరవేరునట్లు ఈలాగు జరుగుచున్నదని యేసయ్య చెప్పెను?


Q ➤ 223.తన దిగంబర శరీరముమీద నారబట్ట వేసికొనియున్న యొక పడుచువాడు తన నారబట్ట విడిచి_____ అయి పారిపోయెను?


Q ➤ 224.పేతురు ప్రధానయాజకుని యింటిముంగిటివరకు దూరమునుండి యేసయ్య వెంటపోయి బంట్రౌతులతోకూడ కూర్చుండి, మంటయొద్ద_____ కాచుకొనుచుండెను?


Q ➤ 225.ప్రధానయాజకులును మహాసభవారందరును యేసును చంపింపవలెనని ఆయనమీద_____ వెదకిరిగాని, యేమియు వారికి దొరకలేదు?


Q ➤ 226.అనేకులు యేసయ్య మీద అబద్ధసాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి__?


Q ➤ 227.పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? అని యేసయ్యను అడిగింది ఎవరు?


Q ➤ 228.యేసయ్య ప్రధాన యాజకునితో అవును నేనే; మీరు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు,___అయి వచ్చుటయు చూచెదరని చెప్పెను?


Q ➤ 229. ప్రధానయాజకుడు తన వస్త్రములు చింపుకొనిమనకు ఇక సాక్షులతో పని యేమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా; మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరు_____ నకు పాత్రుడని యేసయ్య మీద నేరస్థాపనచేసిరి?


Q ➤ 230.కొందరు యేసయ్య మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుకువేసి, ఆయనను గుద్దుచుప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులును ఆయనను ___తో కొట్టి పట్టుకొనిరి?


Q ➤ 231.నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పినమాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని -------------?


Q ➤ 232. ప్రధానయాజకులును పెద్దలును శాస్త్రులును మహాసభవారందరును కలిసి ఆలోచన చేసి, యేసయ్యను బంధించి తీసికొనిపోయి ఎవరికి అప్పగించిరి?


Q ➤ 233.పిలాతు యేసయ్యతో యూదులరాజవు నీవేనా? అని ఆయన నడుగగా ఆయన_____ అని అతనితో చెప్పెను?


Q ➤ 234.ప్రధానయాజకులు యేసయ్య మీద అనేకమైన ___మోపిరి ?


Q ➤ 235.పిలాతు యేసయ్యను చూచి మరల నీవు ఉత్తర మేమియు చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో ----- అనెను?


Q ➤ 236.యేసయ్య మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ------?


Q ➤ 237. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై వారికి ఎవరిని విడుదల చేసెను?


Q ➤ 238.పిలాతు యేసయ్యను కొరడాలతో కొట్టించి -------------వేయనప్పగించెను?


Q ➤ 239.సైనికులు యేసయ్యను____ అను అధికార మందిరములోపలికి తీసికొనిపోయిరి?


Q ➤ 240.సైనికులు యేసయ్యకు____ వస్త్రము తొడిగించి, ముండ్ల కిరీటమును ఆయన తల మీదపెట్టెను?


Q ➤ 241.సైనికులు యేసయ్యను అపహసించిన తరువాత ఆయనమీద నున్న ఊదారంగు వస్త్రము తీసివేసి, ఆయన బట్టలాయనకు తొడిగించి, ఆయనను____ వేయుటకు తీసికొనిపోయిరి?


Q ➤ 22. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరినుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా, ఆయన సిలువను మోయుటకు అతనిని___ చేసిరి?


Q ➤ 243.గొల్గొతా అనే మాటకు అర్థం ఏమిటీ?


Q ➤ 244.బోళము కలిపిన____ యేసయ్యకిచ్చిరి గాని ఆయన దాని పుచ్చు కొనలేదు?


Q ➤ 245. యేసయ్యను సిలువవేసి, ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో____ వేసి వాటిని పంచు కొనిరి ?


Q ➤ 246.యేసయ్యను సిలువవేసినప్పుడు పగలు ఎన్ని గంటలాయెను?


Q ➤ 247.యేసయ్యకు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఇద్దరు____ దొంగలను ఆయనతో కూడ సిలువవేసిరి?


Q ➤ 248.మార్గమున వెళ్లుచున్నవారు తమ తలలూచుచు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, సిలువమీదనుండి దిగి, నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి యేసయ్యను ----------- ?


Q ➤ 249.యేసయ్యను సిలువవేసినప్పుడు మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను_____ కమ్మెను?


Q ➤ 250.మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు అర్థం ఏమిటీ?


Q ➤ 251.దగ్గర నిలిచినవారిలో కొందరు యేసయ్య మాటలు విని అదిగో ----- ను పిలుచుచున్నాడనిరి?


Q ➤ 252.ఒకడు పరుగెత్తిపోయి యొక స్పంజీ చిరకాలో ముంచి రెల్లున తగిలించి యేసయ్యకు త్రాగనిచ్చి తాళుడి;____విని దింపవచ్చునేమో చూతమనెను?


Q ➤ 253.యేసయ్య గొప్ప కేకవేసి____ విడిచెను ?


Q ➤ 254.దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు ___గా చినిగెను?


Q ➤ 255. యేసయ్యకు కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి--నిజముగా ఈ మనుష్యుడు____ అని చెప్పెను?


Q ➤ 256. సాయంకాలమైనప్పుడు అరిమతమయ యోసేపు తెగించి, ____నొద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని యడిగెను?


Q ➤ 257.అరిమతయియ యోసేపు ఘనత వహించిన యొక సభ్యుడై,____ కొరకు ఎదురు చూచువాడు?


Q ➤ 258.ఆయన ఇంతలోనే చనిపోయెనా అని పిలాతు తెలుసుకుని ------?


Q ➤ 259. యోసేపు నారబట్ట కొని, యేసయ్యను దింపి, ఆ బట్టతో చుట్టి, బండలో తొలిపించిన సమాధియందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు ___పొర్లించెను?


Q ➤ 260.విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, యేసయ్యకు పూయవలెనని___ కొనిరి ?


Q ➤ 261.మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు ఆదివారమున పెందలకడ లేచి, బయలుదేరి సూర్యోదయ మైనప్పుడు ఎక్కడికి వచ్చుచుండిరి?


Q ➤ 262. సమాధి ద్వారమునుండి మనకొరకు ఆ రాయి యెవడు పొర్లించునని ఆ స్త్రీలు ఒకరితో ఒకరు ------------- ?


Q ➤ 263. ఆ స్త్రీలు వచ్చి కన్నులెత్తిచూడగా, రాయి పొర్లింపబడి యుండుట చూచిరి. ఆ రాయి____ ?


Q ➤ 264.ఆ స్త్రీలు సమాధిలో ప్రవేశించి, తెల్లని నిలువుటంగీ ధరించుకొనియున్న యొక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి వారు మిగుల -------?


Q ➤ 265.ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి,తాను ____దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను?


Q ➤ 266.ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా, యేసయ్య రూపము గలవాడై వారికి ప్రత్యక్ష మాయెను?


Q ➤ 267. పదునొకండుమంది శిష్యులు____ నకు కూర్చున్నప్పుడు యేసయ్య వారికి ప్రత్యక్షమాయెను?


Q ➤ 268. శిష్యుల అపనమ్మిక నిమిత్తమును హృదయకాఠిన్యము నిమిత్తమును యేసయ్య వారిని ------------- ?


Q ➤ 269. మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి -------------- ప్రకటించమని యేసయ్య చెప్పెను?


Q ➤ 270. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి____ విధింపబడును?