Acts Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on Acts | అపోస్తలుల కార్యములు తెలుగు బైబుల్ క్విజ్ | Roman catholic bible quiz Telegu on Acts | Telugu catholic bible quiz questions and answers | Telugu Bible quiz Online

 అపోస్తలుల కార్యములు గ్రంధం  పై తెలుగు బైబుల్ క్విజ్ 

Acts Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on Acts Book | Telugu Bible Quiz on Acts With Answers

1➤ అపోస్తుల కార్యముల గ్రంథమును ఎవరు వ్రాసిరి?

=> లూకా

2➤ లూకా ఈ గ్రంథమును ఎవరికి అంకితమిచ్చెను?

=> థియోఫిలకు (1:1)

3➤ పునరుత్థానుడైన తరువాత యేసు ఎన్ని దినములుండెను?

=> 40 దినములు (1:2)

4➤ మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? అని ఎవరిని ఉద్దేశించి దేవుని దూతలు పలికిరి?

=> గలిలీయవాసులను గురించి (1:11)

5➤ ఏసు ఎక్కడ ఆరోహణమాయెను?

=> ఒలీవల కొండనుండి (1:12)

6➤ ఏసు శిష్యులు యేసు ఆరోహణమైన పిదప ఎక్కడికి వెళ్ళిరి?

=> యెరూషలేమునకు (1:12)

7➤ యేసు పునరుత్థానుడైన తరువాత ప్రార్ధనలో గడిపిన స్త్రీలలో ఎవరి పేరు ప్రస్థావించ బడెను?

=> యేసు తల్లియైన మరియ్మ పేరు (1:14)

8➤ ఎవరు ద్రోహమువలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలమును కొనెను?

=> ఇస్కారియోతు యూదా (1:18)

9➤ ఎవరు తలక్రిందులుగా పడి నడిమికి బ్రద్దలై మరణించెను?

=> ఇస్కారియోతు యూదా (1:18)

10➤ ఇస్కారియోతు యూదా డబ్బుతో కొనబడిన పొలమునకు ఏ పేరు పెట్టబడెను?

=> రక్త భూమి (1:19)

11➤ అకెల్ దామా అను పదమునకు అర్థమేమి?

=> రక్తభూమి (1:19)

12➤ అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనునుగాక అని ఎవరు ప్రవచించిరి?

=> కీర్తన (109:8)

13➤ యూదా స్థానములో ఏ ఇద్దరి పేర్లు గ్రహింపబడినవి?

=> యోసేపు, మత్తయి (1:23)

14➤ యోసేపుకువున్న వేరే పేర్లు యేమి?

=> బర్నబ్బా, యూస్తు (1:23)

15➤ యూదాకు బదులు ఎవరిని అపొస్తలత్వములో పాలు పొందుటకు ఏర్పరచబడిరి?

=> మత్తయిను (1:22, 26)

16➤ 50వ రోజును ఏమని భావించెదరు?

=> పెంతెకోస్తుల దినముగా (2:1)

17➤ ప్రార్థించు ప్రజల పైకి దేవుని పరిశుద్ధాత్మ ఎప్పుడు ఆవహించింది?

=> పెంతెకోస్తు దినమందు (2:1-4)

18➤ పెంతెకోస్తు దినమున ఎవరు వాక్యమును వివరించుచుండిరి?

=> పేతురు (2:14)

19➤ పరిశుద్ధాత్మ రాకను గురించి ప్రవచించిన ప్రవక్త ఎవరు?

=> యోవేలు (2:16)

20➤ క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదని ప్రవచించిన ప్రవక్త ఎవరు?

=> దావీదు (2:30, 31)

21➤ పేతురుగారి మొదటి వాక్య పరిచర్యలో ఎంతమంది బప్తీస్మము పొందిరి?

=> మూడువేలమంది (2:41)

22➤ క్రైస్తవులందరు ఎక్కడ ఏకముగా కూడిరి?

=> యెరూషలేము దేవాలయములో (2:46)

23➤ దేవాలయమున కూడుకొనినవారు ఎవరివలన రక్షణ పొందిరి?

=> ప్రభువువలన (2:47)

24➤ పేతురు యోహానులవలన కుంటివాడైన ఒక మనుష్యుడు ఎక్కడ స్వస్థత పొందెను?

=> అందమైన దేవాలయ ద్వారమువద్ద (3:2-7)

25➤ వెండి బంగారములు నా యెద్దలేవు అని ఎవరు పలికిరి?

=> పేతురు (36)

26➤ ఏ మంటపమునుండి పేతురు ప్రజలతో మాట్లాడెను?

=> సొలోమోను మంటపమునుండి (3:11)

27➤ యేసు సముఖమునుండి మనకు ఏమి లభించును?

=> ప్రభువు సముఖము నుండి విశ్రాంతి దొరుకును (3:20)

28➤ ఎవరివలన మనకు రక్షణ కలుగును?

=> యేసువలన (4:12)

29➤ బర్నబా పదమునకు అర్ధమేమి?

=> ఉత్సాహపరచువాడు (4:36)

30➤ బర్నబా అను పేరు ఎవరు పెట్టిరి?

=> అపొస్తలులు (4:36)

31➤ బర్నబాకు మరియొక పేరేమి?

=> యోసేపు (4:36)

32➤ బర్నబా ఎక్కడివాడు?

=> సైప్రసు (4:36)

33➤ ఎవరు భూమి కలవాడైయుండి దానిని అమ్మి, దాని వెలతెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను?

=> బర్నబా (4:37)

34➤ పొలమును అమ్మి దాని వెలను తెచ్చి అపొస్తలులకిచ్చిన వేరొక వ్యక్తులు ఎవరు?

=> అననియా, భార్య సఫీర (5:1)

35➤ అమ్మిన ధరలో కొంత తెచ్చినవారు ఎవరు?

=> అననియా (5:3)

36➤ పరిశుద్ధాత్మను మోసపుచ్చి మరణించిన కుటుంబమేది?

=> అననియా, అతని భార్య సఫీర (5:5)

37➤ పేతురు పాదముల పైబడి ప్రాణము విడిచిన స్త్రీ యెవరు?

=> సఫీర (5:10)

38➤ దేవుని దూత చెరసాలనుండి విడిపించి బయటకు తీసుకొనివచ్చిన అపొస్తలుల పేర్లేంటి?

=> పేతురు, యోహాను (5.19)

39➤ సమస్త ప్రజలవలన ఘనత నొందినవాడును, ధర్మశాసోపదేశకుడైన పరిసయ్యుడెవరు?

=> గమాలియేలు (5:34)

40➤ కొంత కాలం క్రితం తానొక గొప్పవాడనని చెప్పుకొన్నదెవరు?

=> తెయోదాసు (5:36)

41➤ ఎవరి మాటవిని నాలుగువందలమంది అతని పక్షమున చేరిరి?

=> తెయోదాసు (5:36)

42➤ విశ్వాసముతోను, పవిత్రాత్మతోను నిండిన వ్యక్తి ఎవరు?

=> స్తెఫను (6:5)

43➤ బల్లవద్ద పరిచర్య చేయుటకు ఎన్నుకొనబడిన వ్యక్తి ఎవరు?

=> నికోలా (6:5)

44➤ నికోలా ఎక్కడివాడు?

=> అంతియోకియా (6:5)

45➤ ఎవరు దైవ అనుగ్రహముతోను, శక్తితోను నిండినవాడై ప్రజల మధ్య గొప్ప అద్భుత కార్యములను సూచక క్రియలును చేయుచుండెను?

=> స్తెఫాను (6:8)

46➤ ఏ ప్రార్ధనా మందిరానికి చెందిన వ్యక్తులు సైఫానుతో విభేదించిరి?

=> స్వతంత్రులు అనే ప్రార్థనా మందిరానికి చెందినవారు (6:9)

47➤ ఎవరి ముఖము దేవదూత ముఖమువలె కనిపించెను?

=> సైఫాను (6:15)

48➤ హారానుకు వెళ్ళకముందు అబ్రహాము ఎచ్చట ఉండెను?

=> మెసపొటోమియా (7:2)

49➤ మెసపొటోమియా ఎవరి దేశము?

=> కల్దీయుల దేశము (7:3, 4)

50➤ ఎవరి వద్దనుండి అబ్రహాము సమాధిని కొనెను?

=> హమోరు కుమారులనుండి (7:16)

51➤ ఎవరు అతడు ఐగుప్తు దేశపు శాస్త్రములన్నియు నేర్చుకొని మాటలలోను చేతలలోను ఆరితేరి ఘటికుడాయెను ?

=> మోషే (7:22)

52➤ తన ప్రజలైన ఇశ్రాయేలీయులను అతడు చూడ నిశ్చయించుకొనును ఎవరు?

=> మోషే (7:23)

53➤ ఏ దేవుని నక్షత్రమును ఇశ్రాయేలీయులు భుజములపై మోసికొనిరి ?

=> రెఫాను (7:43)

54➤ పవిత్రాత్మతో నిండిన వాడై పరలోకమువైపు చూచినదెవరు?

=> స్తెఫాను (7:55)

55➤ మనుష్య కుమారుడు దేవుని కుడిప్రక్కన నిలబడియుండుట ఎవరుచూచిరి?

=> స్టెఫాను (7:56)

56➤ స్తెఫాను వస్త్రమును సాక్షాధారముగ ఎవరివద్ద ఉంచబడెను?

=> సౌలువద్ద (7:58)

57➤ ఎవరు క్రైస్తవులలో మొదటిగా చంపబడిరి?

=> స్టెఫాను (7:59)

58➤ ఎవరు స్తెఫాను మరణమును అంగీకరించెను?

=> సౌలు (8:1)

59➤ సమరీయ పట్టణములో ఎవరు బోధించిరి?

=> ఫిలిప్పు (8:5)

60➤ తన మంత్ర విద్యచే సమరయాదేశమంతటిని మిక్కిలి ఆశ్చర్యములో ముంచెత్తినవాడెవరు?

=> సీమోను (8:9)

61➤ పవిత్రాత్మను పేతురు వద్ద డబ్బుతో కొనతలచినదెవరు.

=> సీమోను (8:19)

62➤ సమరీయలో జ్ఞానస్నానమును పొందినదెవరు?

=> సీమోను (8:13)

63➤ ఏ ఎడారి ప్రాంతమునకు వెళ్ళు మార్గమునకు దేవదూత పిలిప్పును పంపెను?

=> గాజా (8:26)

64➤ ఇతియోపియా రాణి ఎవరు?

=> కాందాసి (8:27)

65➤ నపుంసకుడగు ఇతియోఫియా నివాసి ఏ గ్రంథమును చదువుచుండెను?

=> యెషయా గ్రంథము 18:28)

66➤ ఆ నపుంసకునకు ఎవరు బస్తీస్మమిచ్చిరి?

=> ఫిలిప్పు (8:38)

67➤ దేవుని ఆత్మ ఏ అపొస్తలుని తీసుకొనిపోయెను?

=> ఫిలిప్పు (8:39)

68➤ దేవుని ఆత్మ ఫిలిప్పును ఎక్కడకు తీసికొనిపోయెను?

=> ఆజోతుకు (8:40)

69➤ ప్రధాన యాజకుని నుండి అనుమతి పత్రమును పొంది క్రైస్తవులను బెదరించు దౌర్జన్యము చేసినదెవరు?

=> సౌలు (9:1)

70➤ దేవుడు ఎక్కడ సౌలు ఆత్మను పట్టుకొనెను?

=> దమస్కసు పట్టణమునకు సమీపమున (9:3,4)

71➤ ఎన్ని రోజులు సౌలు అంధుడుగా ఉండెను?

=> మూడు రోజులు (9:9)

72➤ దమస్కులోనున్న ఏసుని శిష్యుడెవరు?

=> అననీయా (9:10)

73➤ సౌలు ఎక్కడివాడు?

=> తార్సుపుర వాసి (9:11)

74➤ అంధునిగా సౌలు ఎచ్చట నివసించెను?

=> యూదా ఇంటిలో (9:11,12)

75➤ సౌలుకు బప్తిస్మమిచ్చినదెవరు?

=> అననీయా (9:17,18)

76➤ పవిత్రాత్మతో నింపబడినపుడు సౌలు ఎచటనుండెను?

=> దమస్కసు (9:17)

77➤ గంపలో దాగుకొని గోడదాటి తప్పించుకున్నదెవరు?

=> పౌలు (9:25)

78➤ యేసు శిష్యులు ఎక్కడ పౌలును గోడమీదనుండి క్రిందకు దించిరి?

=> దమస్కసులో (9:26)

79➤ పౌలును యేసు శిష్యులకు ఎవరు పరిచయం చేసిరి?

=> బర్నబా (9:27)

80➤ యేసు శిష్యులు పౌలును ఎచ్చటకు పంపిరి?

=> తార్సునకు (9:30)

81➤ లిద్దాలో పేతురు స్వస్థతపరచిన పక్షవాతపు రోగి పేరేమి?

=> ఎనియా (9:34)

82➤ యెప్పాలో ఉన్న దేవుని శిష్యురాలు ఎవరు?

=> తబీత (9:36)

83➤ ఏ స్త్రీ సత్ క్రియలను ధర్మకార్యములను బహుగా చేయుచుండెను?

=> తబీత (9:36)

84➤ యెప్పాలో పేతురు చేత లేపబడిన స్త్రీ యెవరు?

=> తబీత (9:40)

85➤ యెప్పాలో పేతురు ఎవరియొద్ద బహుకాలముండెను?

=> సీమోనను చర్మకారుని యింట (9:43)

86➤ కైసరియా (ఇటలి) పటాలముననున్న శతాధిపతియెవరు?

=> కొర్నేలియస్ (10:1)

87➤ ఏ పటాలమునకు కొర్నేలి శతాధిపతి?

=> ఇటలీ పటాలమునకు (10:1)

88➤ దేవునియందు భయభక్తులు కలవాడైయుండి ప్రజలకు బహు ధర్మకార్యములు చేయుచు ఎల్లప్పుడు దేవుని ప్రార్థించు వాడెవరు?

=> కొర్నేలియస్ (10:2)

89➤ ప్రార్థనలు, ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని ఎవరిని గురించి చెప్పబడెను?

=> కొర్నేలి గురించి (10:4)

90➤ దేవదూత ద్వారా కొర్నేలికి పరిచయము చేయబడిన అపోస్తలుడెవరు?

=> పేతురు (10:5)

91➤ ఎవరి యింటికి వెళ్ళమని దేవదూత కొర్నేలి చెప్పెను?

=> చర్మకారుడైన సైమన్ యింటికి (10:5, 6)

92➤ ఆరు గంటల సమయంలో పేతురు ప్రార్థించుటకు ఎక్కడికి వెళ్ళెను?

=> మిద్దెమీదకు వెళ్ళెను (10:9)

93➤ ఆకాశము తెరువబడుటయు, నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటివంటి ఒకవిధమైన పాత్ర భూమి మీదకు దిగివచ్చుట ఎవరు చూచిరి?

=> పేతురు (10:11)

94➤ లేచి చంపుకొని తిను అని చెప్పిన దేవుని స్వరము విన్నదెవరు?

=> పేతురు (10:13, 16)

95➤ నిన్ను తన యింటికి పిలువనంపించి అతను చెప్పు మాటలు వినవలెనని ఎవరికి దూత చెప్పెను?

=> కొర్నేలికు (10:22)

96➤ దేవుని వాక్యమును వినుటకు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించినదెవరు?

=> కొర్నేలి (10:24)

97➤ ఎవరు పేతురు పాదములమీద పడి నమస్కరించెను?

=> కొర్నేలితో (10:25)

98➤ ఎక్కడ పేతురు బోధవిన్నవారందరి మీదకు పరిశుద్ధాత్మ దిగెను?

=> కైసరియలో (10:1,44)

99➤ లేచి నిలువుము నేను కూడ నరుడనే అని పేతురు ఎవరితో అనెను?

=> కొర్నేలితో (10:25,26)

100➤ పేతురు ఎక్కడ ప్రార్థన చేయుచుండగా పరవశుడయ్యెను?

=> యెప్పాలో (11:5)

101➤ పేతురును ఆరుగురు సోదరులును కైసరియాలో ఎవరి ఇంటికి వెళ్ళిరి?

=> కొర్నేలి ఇంటికి (11:12)

102➤ యెరూషలేము నుండి అంతియోకియా వరకు ఎవరిని పంపిరి?

=> బర్నబాసు (11:22)

103➤ అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించెను. ఎవరతను?

=> బర్నబాస్ (11:23)

104➤ ఎవరు పరిశుద్ధాత్మతోను, విశ్వాసముతోను నిండుకొనిన సత్పరుషుడు?

=> బర్నబాసు (11:24)

105➤ ఎక్కడ నుండి బర్నబా సౌలును వెదకుటకు తార్సునకు వచ్చెను?

=> అంతియొకియా (11:25)

106➤ ఎక్కడ యేసుని శిష్యులు మొదటిగా క్రైస్తవులుగా పిలువబడిరి?

=> అంతియొకియా నందు (11:26)

107➤ ప్రపంచమంతట కరువు రాబోతుందని ఆత్మ ద్వారా ప్రవచించినదెవరు?

=> అగాబు (11:28)

108➤ ప్రపంచమంతట కరువు సంభవించినది ఏ చక్రవర్తి కాలమున?

=> కౌదియా చక్రవర్తి (11:28)

109➤ క్రీస్తు సంఘపువారిలో కొందరిని బాధపెట్టుటకు బలత్కారముగా పట్టుకొన్నదెవరు?

=> హేరోదురాజు (12:1)

110➤ ఏ అపోస్తలుడు హేరోదుచే చంపబడెను?

=> యాకోబు (12:1,2)

111➤ యోహాను సోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించినదెవరు?

=> హేరోదు (12:2)

112➤ అపోస్తులలో మొదటిగా చంపబడినవారెవ్వరు?

=> యాకోబు (12:2)

113➤ సంఘం ఎవరికొరకు పట్టుదలతో ప్రార్థించెను?

=> పేతురు కొరకు (12:5)

114➤ ఎవరి ఇంటిలో సంఘముతో కూడి పేతురు కొరకు పట్టుదలతో ప్రార్థించెను?

=> యోహాను తల్లి మరియమ్మ ఇంటివద్ద (12:12)

115➤ మార్కు అనుమారుపేరుగల యోహాను తల్లి ఎవరు?

=> మరియమ్మ (12:12)

116➤ ఏ బాలిక పేతురు స్వరము గుర్తించి లోపలికి పరుగెత్తెను?

=> రోదా (12:13)

117➤ హేరోదు యూదయాను వీడి తరువాత ఎచటకి వెళ్ళెను?

=> కైసరియా (12:19)

118➤ హేరోదు యొక్క రాజ భవనపు అధికారి ఎవరు?

=> బ్లాసు (12:20)

119➤ ప్రభువు దూతచే కొట్టబడి పురుగులు పడి చనిపోయినదెవరు?

=> హేరోదు (12:23)

120➤ సిమియోను మారు పేరు ఏమిటి?

=> నీగెరు (13:1)

121➤ సిరేనియుడైన ప్రవక్త ఎవరు

=> . లూసికియ (13:1)

122➤ చతుర్థాధిపతియైన హేరోదుతో కూడ పెంచబడినది ఎవరు?

=> మినాయేను (13:1)

123➤ పౌలు మరియు బర్నబా పరిచర్య కొరకు వేరుపరచబడు వరకు ఎచట ఉండిరి?

=> అంతియోకియాలో (13:1, 2)

124➤ పౌలు, బర్నబా విడిపోయిన పిమ్మట ఎక్కడ దేవుని వాక్యము బోధించిరి?

=> సలామిను (13:5).

125➤ పౌలు, బర్నబాకు ఉపచారకుడెవరు?

=> యోహాను (13:5)

126➤ అబద్ధ ప్రవక్త ఎవరు?

=> బారు యేసు (13:6)

127➤ దేవుని వాక్యము వినగోరి పౌలును, బర్నబాలను పిలిచిన అధికారియెవరు?

=> సెర్గిపాలు (13:7)

128➤ బారు యేసుకుకు మరియొక పేరేమి?

=> ఎలిమా (13:8)

129➤ అధిపతిని విశ్వాసము నుండి తొలగించుటకు ప్రయత్నించినదెవరు?

=> ఎలిమా (13:8)

130➤ మార్కు పౌలును ఎక్కడ విడిపోయిరి?

=> పాపోసునుండి (13:13)

131➤ దేవుని చిత్త ప్రకారము తన తరమువరకు పరిచర్య చేసినదెవరు?

=> దావీదు (13:36)

132➤ ఎచ్చట పౌలు బర్నబాను తమకాలి ధూళిని నిరసనగా దులిపివేసిరి?

=> పిసీదియా యందలి అంతియోకియాలో (13:51)

133➤ ఇకొనియాలోనున్న రెండు ప్రధాన నగరాలేవి?

=> లిస్తా, దెర్బె (146)

134➤ ఇకోనియా ప్రజలు పౌలుకు పెట్టిన పేరేమి?

=> హెర్మే (14:12)

135➤ ఇకోనియా వారు బర్నబాసును ఏమని పిలిచేవారు?

=> ధ్యుపతి (14:12)

136➤ తమ బట్టలు చింపుకొని జనసమూహము మధ్యకు పరుగెత్తిన అపొస్తలులెవరు?

=> పౌలు మరియు బర్నబా (14:14)

137➤ ప్రజలు పౌలుమీద రాళ్ళు రువ్వినదెక్కడ?

=> లిస్రా లో (14:19)

138➤ అంతియోకుకు పంపబడిన ఇద్దరు ప్రవక్తల పేర్లు ఏమి?

=> యూదా, సిలానును (15:22)

139➤ యూదాకు మరియొక పేరేమి?

=> బర్నబా (15:22)

140➤ బర్నబా ఎవరిని తనతో పాటు తీసుకొనిపోయెను?

=> మార్కును (15:39)

141➤ పరిచర్య కొరకు పౌలు తనతోపాటు ఎవరిని తీసికొనిపోయెను?

=> సిలాసు (15:40

142➤ తిమోతి ఊరు పేరేమి?

=> లిస్తా (16:1)

143➤ పౌలు ఎవరికి సున్నతి చేయించెను?

=> తిమోతికి (16:3)

144➤ పౌలును పవిత్రాత్మ దేవుని వాక్యమును బోధించవలదని ఎక్కడ నిరోధించెను?

=> ఆసియాలో (16:6)

145➤ పవిత్రాత్మ పౌలును వెళ్ళవద్దని ఎక్కడ ఆజ్ఞాపించెను?

=> బెతూనియా (16:7)

146➤ ఏ ప్రాంతమున పౌలుకు దర్శనములో మా ప్రాంతమునకు వచ్చి మాకు సహాయపడుమని చెప్పబడెను?

=> మాసిదోనియాకు (16:9)

147➤ పౌలు దర్శనములో ఏమి చూసెను?

=> త్రోయ (16:8,9)

148➤ నదీ ప్రాంతమున ఉన్న ఏ ప్రాంతములో పౌలు దేవుని వాక్యము బోధించెను?

=> ఫిలిప్పు (16:13)

149➤ ఏ స్త్రీ మొదటిగా దేవుని వాక్యమును అంగీకరించెను?

=> లిదియా (16:14,15)

150➤ ఊదా వర్ణముగల దుస్తులను అమ్ముకొని వ్యాపారము చేయు స్త్రీ ఎవరు?

=> లిదియా (16:14)

151➤ లిదియా ఏప్రాంతమునకు చెందినది.

=> తైతీర (16:14)

152➤ భూతావిష్కురాలైన ఒక స్త్రీని పౌలు ఎచ్చట స్వస్థత పరచెను?

=> ఫిలిప్పీలో (16: 16-18)

153➤ జైలులో పాటలు పాడుచు, ప్రార్థించినవారెవరు?

=> పౌలు మరియు సిలాసులు అనువారలు (16:26)

154➤ చెరసాలలో పాటలు పాడుచు, ప్రార్థనలో గడిపినదెవరు?

=> పౌలు మరియ సిలాసులు (16:36)

155➤ చెరసాల నాయకుడు అతని కుటుంబము యేసును తమ స్వరక్షకునిగా ఎచటఅగీకరించిరి?

=> ఫిలిప్పీ చెరసాలలో (16:30-34)

156➤ పౌలును తెస్సలోనీకకు ఎవరు ఆహ్వానించిరి?

=> యాసోను (17:7)

157➤ ఎవరు తెస్సలోనీకలో ఉన్న వారికంటె ఘనులు?

=> బెరయా ప్రజలు (17:11)

158➤ ఎవరు లేఖనములను ప్రతి నిత్యము పరిశోధించుచు వచ్చిరి?

=> బెరయా ప్రజలు (17:11)

159➤ ఏ పట్టణము విగ్రహములతో నిండి యుండెను?

=> ఏథెన్సులో (17:16)

160➤ ఎవరు పౌలును అవివేకి అనిరి?

=> ఎపెకూరియులు, నోయికుల వేదాంతులు (17:18)

161➤ ఏథెన్సులోని ఏ సభలో పౌలు బోధించెను?

=> అరెయోపగసు (17:19)

162➤ తెలియబడని దేవునికి అను వాక్యము వ్రాయబడిన దేవాలయము ఎక్కడ ఉన్నది.

=> ఏథెన్సు (19:21)

163➤ ఏథెన్సులో యేసును నమ్మిన స్త్రీ ఎవరు?

=> డెమారిసు (17:34)

164➤ రోమునుండి వెళ్ళిపొమ్మని ఎవరు ఆపించిరి?

=> కౌదియా (18:2)

165➤ అక్విలా ఎచ్చట జన్మించెను?

=> పొంతులో (18:27

166➤ పౌలుతో కొరింథులో డేరాలు కుట్టువాని పేరేమి?

=> అక్విల (18:2,3)

167➤ అన్యులకు సువార్తను బోధించిన అపోస్తులుడెవరు?

=> పౌలు (18:6)

168➤ దేవుని యందు భయభక్తిగల ఎవరి ఇంటికి పౌలు వెళ్ళెను?

=> తీతుయుసు ఇంటికి వెళ్ళెను (18:7)

169➤ ఇంటిల్లిపాది భయభక్తిగల సమాజ మందిరపు అధికారి ఎవరు?

=> క్రిస్సు (188)

170➤ అకయకు అధిపతిగావున్న అధికారి ఎవరు?

=> గల్లియో (18:12)

171➤ యూదులారా, యిది యొక అన్యాయము కాని చెడ్డ నేరముగానియైన యెడల మీ మాట సహనముగా వినుట న్యాయమే ఈ మట ఎవరు పలికిరి?

=> గల్లియోను (18:12, 15)

172➤ ఏ సమాజ మందిర అధికారిని యూదులందరు పట్టుకొని కొట్టిరి?

=> సొస్తనీసును (18:17)

173➤ ఎక్కడ పౌలు తల వెంట్రుకలను కత్తరించుకొనెను?

=> కెంకేయలో (18:18)

174➤ విద్వాంసుడును, లేఖనములయందు ప్రవీణుడైన వాడెవ్వడు?

=> అపొల్లో (18:24)

175➤ ఎక్కడ పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడువారు భాషలలో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి?

=> ఎఫెసునందు (196)

176➤ పౌలు ఏ పాఠశాలలో ప్రతిదినము తర్కించుచు వచ్చెను?

=> తిరాన్ను అను పాఠశాలలో (19:9)

177➤ ఏ అపోస్తలుని చేతి గుడ్డలైనను, నడికటైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు వారు స్వస్థత పొందిరి?

=> పౌలు (19:11,12)

178➤ ప్రధాన యాజకుని కుమారులు అధికారికంగా రోగులను, దయ్యం పట్టిన వారిని స్వస్థత పరచనుద్దేశించినప్పుడు సాతానుచేత వారు దండించబడిరి. ఆ ప్రధాన యాజకు, పేరేమి?

=> స్కేవ (19:14-16)

179➤ అర్తెమి దేవత వెండి గుళ్ళను చేయించిన కంసాలి పేరేమి?

=> దేమేత్రియసు (19:24)

180➤ ఎఫెసీయుల పట్టణములోని మహాదేవి యెవరు?

=> అర్తెమిదేవి (19:35)

181➤ పౌలు చాలా సేపు ప్రసంగించుచుండగా నిద్రా భారమునజోగి మూడవ అంతస్తు నుండిక్రిందపడి చనిపోయినదెవరు?

=> యాతికూసు (20:9)

182➤ కైసరయలో పౌలు ఎవరి యింట ప్రవేశించెను?

=> ఫిలిప్పుయింట (21:8)

183➤ ప్రవచించు నలుగురు కుమార్తెల తండ్రి పేరేమి?

=> ఫిలిప్పు (21:8, 9)

184➤ ఎవరు యూదయానుండి వచ్చి పౌలు నడికట్టు తీసికొని తన చేతులను కాళ్ళును కట్టుకొని యెరూషలములో యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధింతురని ప్రవచించెను?

=> అగాబు (21:10, 11)

185➤ షిలిషియాలోని గొప్ప పట్టణము పేరేమి?

=> తార్సు పట్టణము (21:39)

186➤ పౌలు ఎవరివద్ద ధర్మశాస్త్రమును అభ్యసించెను?

=> గమాలియేలు (22:3)

187➤ పూర్వుల చట్టమును గూర్చి గట్టిగా ఉపదేశము పొందినవి ఎవరు?

=> పౌలు (22:3)

188➤ సున్నము కొట్టినగోడా! అని పౌలు ఎవరినిగూర్చి అనెను?

=> ప్రధాన యాజకుడైన అననియాను (23:3)

189➤ నీవు ఏ రాష్ట్రము నుండి వచ్చినవాడవని ఏ గవర్నరు పౌలును ప్రశ్నించెను?

=> రాష్ట్రపతి ఫెలిక్స్ (23:34)

190➤ ఈ మనుష్యుడు మాకొక వినాశనకారిగా వున్నాడు. ఈ మాట ఎవరు అన్నారు?

=> తెర్తుల్లు (24:5)

191➤ ఏ కమాండరు పౌలును కాపాడెను?

=> లీసియా (24:7)

192➤ క్రైస్తవ్యమును గురించి బాగుగా ఎరిగిన సైన్యాధిపతి ఎవరు?

=> ఫెలిక్సు (24:22)

193➤ పౌలు కొంత ధనము ఇచ్చునని ఆశించిన గవర్నరు పేరేమిటి?

=> ఫెలిక్సు (24:26)

194➤ ఫెలిక్స్ భార్య పేరేమిటి?

=> ద్రుసిల్లా (24:24)

195➤ అగ్రిప్పరాజు భార్య ఎవరు?

=> బెర్నీసు (26:13)

196➤ కైసరియాలోని పెస్తునకు స్వాగతం చెప్పుటకు ఎవరు వచ్చిరి?

=> అగ్రిప్పరాజు అతని భార్యయగు బెర్నీసు (26:13)

197➤ పెలిక్సుచే ఖైదీగా ఉంచబడినవాడొకడున్నాడు. ఆ ఖైదీ ఎవరు?

=> పౌలు (25:14).

198➤ పౌలు బోధలు వినాలని కుతూహలపడిన రాజు పేరేమిటి?

=> అగ్రిప్పరాజు (25:22).

199➤ పౌలుతో అగ్రిప్పరాజు ఏ భాషలో మాట్లాడెను?

=> హీబ్రూ భాషలో (26:14).

200➤ పౌలూ నీవు వట్టి పిచ్చివాడవు. నీవు నేర్చుకొన్న గొప్ప విద్యయే నిన్ను పిచ్చివానిగా చేయుచున్నది. ఈ మాటలు ఎవరివి?

=> ఫెసు (26:24).

201➤ “ఇంత స్వల్ప కాలములోనే నన్ను క్రైస్తవునిగా చేయదలచుచున్నావా అని ఎవరు అనిరి?"

=> అగ్రిప్పరాజు (26:28).

202➤ చక్రవర్తి పటాలమునకు శతాధిపతియెవరు?

=> జూలియస్ (27:1).

203➤ ఫోనిక్స్ ఓడరేవుకు మరియొక పేరేమి?

=> క్రేతురేవు (27:12).

204➤ పౌలు మరియు అతని మనుషులు ఇటునటుకొట్టుకొనిపోయిన సముద్రమేది?

=> అద్రియ సముద్రము (27:27).

205➤ ఏదీవి ప్రాంతమున పౌలు అతని అనుచరులు తప్పించుకొనిరి?

=> మాల్టా దీవి (28:1)

206➤ పౌలు చేతిని ఎక్కడ ఒక పాము పట్టెను?

=> మాల్టానందు (28:1-3)

207➤ యల్లు దీవి ద్వీపమునందు ముఖ్యుడెవరు ?

=> పుబ్లియు (28:7)

208➤ అలెగ్జాండ్రియా పట్టణపు ఓడ చిహ్నమేది?

=> అశ్వని చిహ్నము (28:11)

209➤ పౌలు స్వతంత్రముగా జీవించుటకు చివరిగా ఎచ్చటికి పంపబడెను?

=> రోమునకు (28:16)