1st Kings Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on 1st Kings | రాజుల మొదటి గ్రంథము తెలుగుబైబుల్ క్విజ్

1➤ రాజులు మొదటి గ్రంధము పరిశుద్ధ గ్రంధములో ఎన్నవది?

ⓐ తొమ్మిదవది
ⓑ యేడవది
ⓒ పండ్రెండవది
ⓓ పదకొండవది

2➤ రాజులు మొదటి గ్రంధములో ముఖ్యమైన వారెవరు?

ⓐ దావీదు; సొలొమోను
ⓑ రెహబాము; ఏలీయా
ⓒ యరొబాము : యెజెబెలు
ⓓ పైవారందరు

3➤ రాజులు మొదటి గ్రంధములో ముఖ్యమైన అధ్యాయము ఏమిటి?

ⓐ 12వ అధ్యాయము
ⓑ 18వ అధ్యాయము
ⓒ 22వ అధ్యాయము
ⓓ 16వ అధ్యాయము

4➤ రాజులు మొదటి గ్రంధములో ముఖ్యమైన వచనములు ఏమిటి?

ⓐ 6వ అధ్యాయము:12,13వచనములు
ⓑ 9వ అధ్యాయము: 4,5వచనములు
ⓒ 12వ అధ్యాయము :10,11వచనములు
ⓓ 18వ అధ్యాయము : 41,42వచనములు

5➤ రాజులు మొదటి గ్రంధములో యెహోవా మందిరము కట్టి సొలొమోను ఎటువంటి కార్యము చేసెను?

ⓐ గొప్పదైన
ⓑ కీర్తనీయమైన
ⓒ శ్రేష్టమైన
ⓓ పైవన్నీ

6➤ రాజుల మొదటి గ్రంధములో ఎన్ని ప్రశ్నలు కలవు??

ⓐ అరువదియారు
ⓑ ముప్పది మూడు
ⓒ యాబదియైదు
ⓓ డెబ్బదియేడు

7➤ రాజులు మొదటి గ్రంధములో ప్రవచింపబడిన ఎన్ని ప్రవచనములు నెరవేరబడినవి?

ⓐ తొంబదిరెండు
ⓑ డెబ్బదిఒకటి
ⓒ నూట మూడు
ⓓ యెనుబదినాలుగు

8➤ రాజులు మొదటి గ్రంధములో ఎన్ని ఆజ్ఞలు కలవు?

ⓐ నూటరెండు
ⓑ అరువదిమూడు
ⓒ తొంబదిరెండు
ⓓ డెబ్బదియారు

9➤ రాజులు మొదటి గ్రంధములో ఎన్ని హెచ్చరికలు గలవు?

ⓐ ఎనుబదిఎనిమిది
ⓑ నలువదిమూడు
ⓒ తొంబదినాలుగు
ⓓ డెబ్బదియారు

10➤ సొలొమోను కట్టించిన మందిర నిర్మాణములో ఎంతమంది పనివారు కలరు?

ⓐ రెండులక్షలు
ⓑ ఒక లక్ష
ⓒ యాబదివేలు
ⓓ పండ్రెండువేలు

11➤ ఇశ్రాయేలీయులను పాలించిన సొలొమోను దినములను ఏమని పిలుచుదురు?

ⓐ నిబంధనయుగము
ⓑ స్వర్ణయుగము
ⓒ సహస్రపాలనయుగము
ⓓ మానవ ప్రభుత్వయుగము

12➤ రాజులు మొదటి గ్రంధములో ముఖ్యమైన పదము ఏమిటి?

ⓐ రాజ్యకాంక్ష
ⓑ రాజ్యనిర్మాణము
ⓒ రాజ్య విభజన
ⓓ రాజ్య కుటిలత

13➤ .ఏ రాజు కాలమున ఇశ్రాయేలు రాజ్యము విభజింపబడెను?

ⓐ సొలొమోను
ⓑ ఆసా
ⓒ అబీయా
ⓓ రెహబాము

14➤ రాజులు మొదటి గ్రంధములో ఎన్ని వర్తమానములు కలవు?

ⓐ ఇరువదియేడు
ⓑ నలువదిమూడు
ⓒ ముప్పదియారు
ⓓ యాబది రెండు

15➤ రాజులు మొదటి గ్రంధములో ఎన్ని వాగ్ధానములు యున్నవి?

ⓐ పది
ⓑ ఆరు
ⓒ యేడు
ⓓ మూడు

16➤ మొదటి రాజుల గ్రంధములో కుట్రలతో రాజ్యము పొందిన వారు ఎవరు?

ⓐ తూరు రాజులు
ⓑ అష్షూరు రాజులు
ⓒ యూదా రాజులు
ⓓ ఇశ్రాయేలు రాజులు

17➤ సొలొమోను యొద్దకు వచ్చిన షేబ దేశపు రాణి పేరేమిటి?

ⓐ మెకడా
ⓑ అజూబా
ⓒ గ్రేసిమా
ⓓ జిరీయా

18➤ "షేబ"అనగా అర్ధము ఏమిటి?

ⓐ తీర్మానము
ⓑ ప్రమాణము
ⓒ నిశ్చయము
ⓓ సంకల్పము

19➤ షేబ యొక్క ప్రస్తుత పేరు ఏమిటి?

ⓐ స్పెయిన్
ⓑ భూటాన్
ⓒ కెమెన్
ⓓ యెమెన్

20➤ యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అని అనుకొనిన రాజు ఎవరు?

ⓐ జిమీ
ⓑ బయేషా
ⓒ ఆహాబు
ⓓ ఆహజ్యా

21➤ ఏ రాజైన ఎత్బయలు కుమార్తెను ఆహాబు వివాహము చేసుకొనెను?

ⓐ అమోరీయుల
ⓑ సీదోనీయుల
ⓒ అమాలేకీయుల
ⓓ అష్షూరీయుల

22➤ "సీదోను" అనగా అర్ధము ఏమిటి?

ⓐ చేపల పెంపకము
ⓑ పందుల వ్యాపారము
ⓒ వస్తువుల వర్తకము
ⓓ పక్షుల పెంపకము

23➤ ఇశ్రాయేలు రాజులు మొదట ఎక్కడ నుండి పాలన చేసేవారు?

ⓐ సిరియ
ⓑ తిర్సా
ⓒ మీసారు
ⓓ గిలాదు

24➤ "తిర్సా" అనగా అర్దము ఏమిటి?

ⓐ ఉల్లాసము
ⓑ ఉత్సవము
ⓒ సంతోషము
ⓓ ఉత్సాహము

25➤ ఏ దేశము మీద హజయేలునకు పట్టాభిషేకము చేయమని యెహోవా ఏలీయాతో చెప్పెను?

ⓐ అష్టూరు
ⓑ తూరు
ⓒ ఇశ్రాయేలు
ⓓ సిరియ

26➤ "హజాయేలు"అనగా అర్ధము ఏమిటి?

ⓐ దేవుడు చూశాడు
ⓑ దేవుడు విన్నాడు
ⓒ దేవుడు విడిచాడు
ⓓ దేవుడు దృష్టించాడు

27➤ యెహోవా ఏలీయాతో ఎటువంటి స్వరముతో మాటలాడెను?

ⓐ మిక్కిలి భీకరమైన
ⓑ మిక్కిలి నిమ్మళమైన
ⓒ మిక్కిలి గంభీరమైన
ⓓ మిక్కిలి హెచ్చయిన

28➤ మొదటి రాజుల గ్రంధములో కీలక ఆధ్యాయము ఏమిటి?

ⓐ పండ్రెండవ
ⓑ ఇరువదవ
ⓒ ఎనిమిదవ
ⓓ పదునెనిమిదివ

29➤ మొదటి రాజుల గ్రంధములో ముఖ్యమైన వచనము ఏమిటి?

ⓐ 6వ అధ్యాయము; 12వ వచనము
ⓑ 22వ ఆధ్యాయము ; 17వ వచనము
ⓒ 8వ అధ్యాయము; 19వ వచనము
ⓓ 10వ అధ్యాయము; 7-9వచనములు

30➤ గోడలో నుండి మొలుచు ఏ మొక్క గురించి సొలొమోను వ్రాసెను?

ⓐ ఒలీవ
ⓑ పుదీన
ⓒ మాచిపత్రి
ⓓ హిస్సోపు

31➤ "హిస్సోపు" దేనికి సాదృశ్యముగా నుండెను?

ⓐ ఆత్మప్రక్షాళనకు
ⓑ స్వస్థతకు
ⓒ ఆరోగ్యమునకు
ⓓ విముక్తికి

32➤ ఇత్తడి బహు చమత్కారపు పనులు చేయ ఎవరిని సొలొమోను పిలువనంపించెను?

ⓐ బెయేరును
ⓑ హీరామును
ⓒ శల్మానును
ⓓ గెజెరును

33➤ హీరాము తల్లి ఏ గోత్రికురాలు?

ⓐ గాదు
ⓑ దాను
ⓒ నఫ్తాలి
ⓓ ఆషేరు

34➤ "హీరాము"అనగా అర్ధము ఏమిటి?

ⓐ ఉన్నతమైన
ⓑ గొప్పదైన
ⓒ కీర్తికలిగిన
ⓓ శ్రేష్టమైన

35➤ బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడనని ఎవరు ఏలీయాతో అనెను?

ⓐ ఆహాబు
ⓑ యెహూ
ⓒ బయెషా
ⓓ ఓబద్యా

36➤ ఓబద్యా అను పేరునకు అర్ధము ఏమిటి?

ⓐ యెహోవా నారాజు
ⓑ యెహోవా సేవకుడు
ⓒ యెహోవాయే తండ్రి
ⓓ యెహోవా నా కాపరి

37➤ యెహోవా శపించిన సిరియ రాజైన ఎవరిని పోనిచ్ఛినందున ఆహాబు ప్రాణము అప్పగింపబడునని యెహోవా సెలవిచ్చెను?

ⓐ రకే
ⓑ మేషా
ⓒ బెన్హదదు
ⓓ అజర్యా

38➤ తన అవ్వయైన మయకా చేయించిన దేవతాస్తంభములను ఆసా దేని ఓరను కాల్చివేసెను?

ⓐ కీషోను
ⓑ మీసారు
ⓒ ఆకోరు
ⓓ కిద్రోను

39➤ "మయకా" అనగా అర్ధము ఏమిటి?

ⓐ కుంభము
ⓑ సింహము
ⓒ మత్స్యము
ⓓ కుక్క

40➤ రాజైన యెషా గురించి యెహోవా సెలవిచ్ఛిన మాటను హనానీ కుమారుడైన ఎవరు తెలిపెను?

ⓐ యెహూ
ⓑ అజర్యా
ⓒ జెకర్యా
ⓓ గాదు

41➤ "యెహూ" అనగా అర్ధము ఏమిటి?

ⓐ మంచివాడు
ⓑ ఉన్నవాడు
ⓒ ఎత్తైనవాడు
ⓓ గొప్పవాడు

42➤ దంతపు ఇంటిని కట్టించిన రాజు ఎవరు?

ⓐ ఆసా
ⓑ ఆహజ్యా
ⓒ ఆహాబు
ⓓ అజర్యా

43➤ "కిను" అనగా ఏమి జరుగు స్థలమునకు సాదృశ్యముగా నుండెను?

ⓐ అంతిమ యుద్ధము -
ⓑ అంతిమ యాత్ర -
ⓒ అంతిమ విజయము
ⓓ అంతిమ తీర్పు

44➤ అదోనియా పక్షము చేరిన ఎవరిని యాజకుడుగా నుండకుండా సొలొమోను తీసివేసెను?

ⓐ అబ్యాతారును
ⓑ షెమయాను
ⓒ అజర్యాను
ⓓ హనానీని

45➤ అదోనియా యొక్క తల్లి ఎవరు?

ⓐ అబీగయీలు
ⓑ బత్తెబ
ⓒ హగ్గీతు
ⓓ అహనాయము

46➤ "అదోనియా"అను పేరుకు అర్ధము ఏమిటి?

ⓐ నా దేవుడు నా రాజు
ⓑ నా దేవుడు యెహోవా
ⓒ నా దేవుడు నా కాపరి
ⓓ నా దేవుడు వినును

47➤ "హగీతు" అనగా ఏమిటి?

ⓐ ఉత్సవము
ⓑ సందడి
ⓒ గీతము
ⓓ నాట్యము

48➤ దావీదు పురము యొక్క పేరేమిటి?

ⓐ షోమ్రోను
ⓑ తిర్సా
ⓒ సీయోను
ⓓ మహనయీము

49➤ ఏమి అను రెండవ మాసమున సొలొమోను మందిరమును కట్టింప నారంభించెను?

ⓐ ఆదారు
ⓑ అబీబు
ⓒ ఏలూలు
ⓓ జీపు

50➤ జీప్ ను ఏమని పిలుచుదురు?

ⓐ పువ్వుల మాసము
ⓑ వెన్నెల మాసము
ⓒ సూర్యుని మాసము
ⓓ వీవన మాసము

51➤ సొలొమోను పక్షమున ఉండి ఆతని ఆజ్ఞాపించినట్లు చేసిన యెహోయాదా కుమారుని పేరేమిటి?

ⓐ సాదోకు
ⓑ బెనాయా
ⓒ యెష్చేజరు
ⓓ ఆదారు

52➤ "బెనాయా"అను పేరుకు అర్ధము ఏమిటి?

ⓐ యెహోవా తోడు
ⓑ యెహోవా నడిపెను
ⓒ యెహోవా నిర్మించెను
ⓓ యెహోవా నిలిపెను

53➤ ఏ మాసమున ఇశ్రాయేలీయులందరు సొలొమోను యొద్దకు కూడుకొని వచ్చిరి?

ⓐ ఏలూలు
ⓑ ఏతానీము
ⓒ ఆదారు
ⓓ కిస్లేవు

54➤ "ఏతానీము"మాసము అనగా ఏ కాలము?

ⓐ గ్రీష్మ కాలము
ⓑ తుషార కాలము
ⓒ మంచు కాలము
ⓓ ఆకులు రాలే కాలము

55➤ ఆసా యొక్క భార్య పేరేమిటి?

ⓐ అజూబా
ⓑ మయకా
ⓒ జిబ్యా
ⓓ నయమా

56➤ "అజూబా"అనగా అర్ధము ఏమిటి?

ⓐ వాడిపోయిన
ⓑ నిర్జనమైన
ⓒ ఎండిపోయిన
ⓓ రాలిపోయిన

57➤ ఇశ్రాయేలు రాజుతో కలిసి యుద్ధమునకు పోయి మరణము నుండి తప్పింపబడిన రాజు ఎవరు?

ⓐ బెన్హదదు
ⓑ ఆసా
ⓒ యెహోషాపాతు
ⓓ అబీయాము

58➤ ఏమి గలవాడనై యెహోవా కొరకు నేను ఒక్కడినే మిగిలియున్నానని ఏలీయా యెహోవాతో అనెను?

ⓐ కోపము
ⓑ పౌరుషము
ⓒ ఆగ్రహము
ⓓ రోషము

59➤ మొదటి రాజుల గ్రంధములో ఎవరి పాలన సంపూర్ణమై ఎవరి పాలన ఆరంభమాయెను?

ⓐ దావీదు; అదోనీయా
ⓑ దావీదు; యోవాబు
ⓒ దావీదు ; సొలొమోను
ⓓ దావిదు; దానియేలు

60➤ దావీదుకు వెట్ట పుట్టించుటకు తేబడిన అబీషగును ఆశించినదెవరు?

ⓐ షెఫట్యా
ⓑ షిమీ
ⓒ యోవాబు
ⓓ అదోనీయా

61➤ రెహబాము యొక్క దేని వలన ఇశ్రాయేలు రాజ్యము రెండుగా చీలెను?

ⓐ నిర్లక్ష్యము
ⓑ దురాశ
ⓒ లోభత్వము
ⓓ దుష్టత్వము

62➤ రాజ్యము ఎవరి సంతతి వారిది కాకుండ యుండుటకు ఇశ్రాయేలీయులు యెహోవాను విసర్జించునట్లు యరొబాము చేసెను?

ⓐ సౌలు
ⓑ దావీదు
ⓒ సొలొమోను
ⓓ రెహబాము

63➤ యూదా రాజులు తమ పాలన ఎక్కడ నుండి చేసిరి?

ⓐ మహనయీము
ⓑ షోమోను
ⓒ యెరూషలేము
ⓓ తిర్సా

64➤ యెరూషలేము ఏ కొండపై కలదు?

ⓐ గిలాదు
ⓑ తాబోరు
ⓒ సీయోను
ⓓ మీసారు

65➤ ఇశ్రాయేలు రాజులు మొదట ఎక్కడ నుండి పాలించిరి?

ⓐ బేతేలు
ⓑ దాను
ⓒ తిర్సా
ⓓ మేరోదు

66➤ ఇశ్రాయేలు రాజైన ఎవరు షోమ్రోనును కట్టించి, అక్కడ నుండి పాలన చేసెను?

ⓐ ఏలా
ⓑ ఒమ్రీ
ⓒ జిమ్రి
ⓓ యహూ

67➤ "సమరియ"అనగా అర్ధము ఏమిటి?

ⓐ కొండపైకి ఎక్కుము
ⓑ పర్వతమును చూడుము
ⓒ శిఖరము పట్టుకొనుము
ⓓ మెట్టను సరాళము చేయుము

68➤ యెరికోను గురించి యెహోవా యెహోషువ ద్వారా సెలవిచ్ఛినట్లు ఏ రాజు దాని కట్టగా ఆ ప్రకారము జరిగెను?

ⓐ ఆహాజు
ⓑ అహజ్యా
ⓒ ఆహాబు
ⓓ అజర్యా

69➤ ఆసా విగ్రహములను దేవతాస్థంభములను ఏ వాగు ఓరను కాల్చివేయించెను?

ⓐ కిద్రోను
ⓑ కిషోను
ⓒ గోహాజు
ⓓ కెరీతు

70➤ ఎవరు కీషోను వాగు దగ్గర బయలు ప్రవక్తలను వధించెను?

ⓐ ఓబద్యా
ⓑ షెమయా
ⓒ ఏలీయా
ⓓ యెహూ

71➤ "కీషోను"అనగా అర్ధము ఏమిటి?

ⓐ నష్టము
ⓑ అపవిత్రము
ⓒ వ్యర్ధము
ⓓ కఠినము